అందమైన , కాంతివంతమైన చర్మ సౌందర్యంను పొందడానికి బాదంనూనెతో 10 మార్గాలు

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

డ్యూవీ స్కిన్ అనేది ఇప్పటి ఫ్యాషన్ ప్రపంచంలోని ట్రెండ్ గా మారింది. డ్యూవీతో పాటు రేడియంట్ కాంప్లెక్షన్ వైపు ఇప్పుడు అమ్మాయిలందరూ మొగ్గుచూపుతున్నారు. ఈ విధమైన ప్రత్యేకమైన కాంప్లెక్షన్ ను పొందటం కోసం ఎంతో మంది అమ్మాయిలు కాస్మెటిక్స్ ట్రీట్మెంట్స్ పై అలాగే ఖరీదైన షీట్ మాస్కులపై, స్క్రబ్బులపై పెద్ద మొత్తాన్ని వెదజల్లుతున్నారు.

అయితే, ఈ విధమైన కాంప్లెక్షన్ ను కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ ని వాడకుండా సురక్షితమైన మార్గంలో పొందవచ్చు. అటువంటి విధానాలకై మీరు ఎదురుచూస్తున్నట్లయితే, ఈ ఆర్టికల్ ప్రత్యేకించి మీ కోసమే. ఈరోజు, బోల్డ్ స్కై, కొన్ని ప్రత్యేకమైన పద్దతులలో నూనెలను కాస్మెటిక్ గా ఉపయోగించడం ద్వారా సహజసిద్ధమైన డ్యూవీ మరియు రేడియంట్ లుక్ ని సొంతం చేసుకునే మార్గాలను తెలియచేస్తోంది .

ways to use almond oil to get radiant and dewy skin

బాదం నూనెతో ప్రకాశవంతమైన డ్యూవీ కాంప్లెక్షన్ ను పొందే మార్గాలు.

బాదం నూనెలో అద్భుతమైన కాస్మెటిక్ ప్రాపెర్టీస్ కలవు. విటమిన్ ఏ తో పాటు ఇతర శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు బాదం నూనెలో కలవు. వీటన్నిటికీ చర్మానికి సంరక్షణనిచ్చే అద్భుతమైన గుణాలున్నాయి.

బాదంలోనున్న చర్మ సంరక్షణ లక్షణాలు మీ చర్మంలో దాగి ఉన్న దుమ్మూ ధూళిని తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తాయి. చర్మరంధ్రాలలోని పేరుకుని ఉన్న చెత్తను తొలగిస్తాయి. తద్వారా సహజసిద్ధమైన డ్యూవీ లుక్ ను మీకందిస్తాయి.

కాబట్టి, ఈ సహజసిద్ధమైన అద్భుతమైన నూనెతో మీ చర్మన్ని సంరక్షించుకుంటూ మీరెప్పటినుంచో కోరుకుంటున్న డ్యూవీ లుక్ ని పొందండి.

ఈ ప్రత్యేకమైన కాంప్లెక్షన్ ను పొందడానికి బాదం నూనెను వాడే విధానాలను తెలుసుకోండి.

1. తేనెతోబాదం నూనె

1. తేనెతోబాదం నూనె

అర టీస్పూన్ తేనెలో అర టీస్పూన్ బాదం నూనెను కలపండి.

వీటిని కలపగా వచ్చిన మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచండి.

మరుసటి ఉదయం, గోరువెచ్చటి నీటితో మీ ముఖాన్ని శుభ్రపరచుకోండి.

ఈ పద్దతిని వారానికి రెండు లేదా మూడు సార్లు ప్రయత్నించడం ద్వారా అందమైన డ్యూవీ లుక్ ని సొంతం చేసుకోవచ్చు.

2. అలోవెరా జెల్ తో బాదం నూనె:

2. అలోవెరా జెల్ తో బాదం నూనె:

అర టీస్పూన్ బాదం నూనెలో ఒక టీస్పూన్ అలోవెరా జెల్ ను కలపండి.

ఈ మిశ్రమంతో మీ చర్మంపై అయిదు నుంచి పది నిమిషాల వరకు మసాజ్ చేయండి.

మైల్డ్ క్లీన్సర్ తో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోండి.

ఈ పద్దతిని వారానికి రెండు లేదా మూడు సార్లు పాటించండి.

3. రోజ్ వాటర్ తో బాదం నూనె:

3. రోజ్ వాటర్ తో బాదం నూనె:

అర టీస్పూన్ బాదం నూనెలో ఒక టీస్పూన్ రోజ్ వాటర్ ను కలిపి మిశ్రమాన్ని తయారుచేసుకోండి.

ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచండి.

మరుసటి రోజు ఉదయాన్నే మీ ముఖాన్ని తేలికపాటి క్లీన్సర్ తో అలాగే గోరువెచ్చటి నీటితో శుభ్రపరుచుకోండి.

ఈ హోంమేడ్ మిశ్రమాన్ని వారానికి మూడు లేదా నాలుగు సార్లు వాడటం ద్వారా ప్రకాశవంతమైన చర్మాన్ని పొందండి.

4. పాలతో బాదం నూనె:

4. పాలతో బాదం నూనె:

అర టీస్పూన్ బాదం నూనెను రెండు టీస్పూన్ల పాలతో కలిపి మరిగించండి.

ఈ మిశ్రమాన్ని ఫేషియల్ క్లీన్సర్ లా వాడుతూ మీ చర్మంపై మృదువుగా అప్లై చేయండి.

ఆ తరువాత గోరువెచ్చటి నీటిని మీ ముఖంపై చల్లుకుని మీ చర్మాన్ని శుభ్రపరుచుకోండి.

ఈ హోంమేడ్ పేషియల్ క్లీన్సర్ ని వారానికి రెండుసార్లు వాడటం ద్వారా డ్యూవీ కాంప్లెక్షన్ ను పొందవచ్చు.

5. బ్రౌన్ షుగర్ తో బాదం నూనె:

5. బ్రౌన్ షుగర్ తో బాదం నూనె:

ఒక టేబుల్ స్పూన్ బాదం నూనెను ఒక టీస్పూన్ బ్రౌన్ షుగర్ తో బాగా కలపండి.

ఈ మిశ్రమంతో మీ చర్మాన్ని మసాజ్ చేయండి.

ఆ తరువాత, గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని శుభ్రపరుచుకోండి.

వారానికి ఒకసారి, ఈ హోంమేడ్ స్క్రబ్ తో మీ చర్మాన్ని గారాబం చేయటం ద్వారా ప్రకాశవంతమైన మెరిసే చర్మాన్ని పొందవచ్చు.

6. పటికపొడితో బాదం నూనె:

6. పటికపొడితో బాదం నూనె:

ఒక టీస్పూన్ బాదం నూనెలో 1/3 టీస్పూన్ పటికపొడిని కలపండి.

ఈ మిశ్రమంతో మీ చర్మానికి చక్కటి మసాజ్ ని అందచేయండి.

ఆ తరువాత గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని శుభ్రపరచుకోండి.

నెలకి రెండుసార్లు ఈ పద్దతిని పాటించడం ద్వారా కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.

7. నిమ్మరసంతో బాదం నూనె:

7. నిమ్మరసంతో బాదం నూనె:

అర టీస్పూన్ బాదం నూనెలో ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని కలపండి.

ఈ మిశ్రమాన్ని మీ చర్మంపై అప్లై చేసి దాదాపు పదిహేను నిమిషాల వరకు అలానే ఉంచండి.

ఇప్పుడు గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని శుభ్రపరుచుకోండి.

ఈ మిశ్రమాన్ని వారానికి రెండు లేదా మూడు సార్లు వాడటం ద్వారా అందమైన చర్మాన్ని పొందవచ్చు.

8. గ్రీన్ టీతో బాదం నూనె:

8. గ్రీన్ టీతో బాదం నూనె:

అర టీస్పూన్ బాదం నూనెలో ఒక టీస్పూన్ గ్రీన్ టీని కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేయండి.

ఈ మిశ్రమంతో మీ చర్మానికి చక్కటి మసాజ్ ను అందచేయండి.

ఆ తరువాత, తేలికపాటి క్లీన్సర్ తో మీ చర్మాన్ని శుభ్రపరుచుకోండి.

వారానికి ఒకసారి ఈ పద్దతిని పాటించడం ద్వారా మెరిసే డ్యూవీ కాంప్లెక్షన్ ను సొంతం చేసుకోండి.

9. రోజ్ హిప్ ఆయిల్ తో బాదం నూనె:

9. రోజ్ హిప్ ఆయిల్ తో బాదం నూనె:

అర టీస్పూన్ బాదం నూనెలో రెండు లేదా మూడు చుక్కల రోజ్ హిప్ ఆయిల్ ను కలపండి.

ఇలా తయారయిన మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేయండి.

అయిదు లేదా పది నిమిషాల తరువాత తేలికపాటి క్లీన్సర్ తో పాటు గోరువెచ్చటి నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోండి.

10. దోసకాయతో బాదం నూనె:

10. దోసకాయతో బాదం నూనె:

కొన్ని దోసకాయ ముక్కలని పేస్ట్ లా చేసుకుని అందులో ఒక టీస్పూన్ బాదం నూనెను కలపండి.

ఇప్పుడు, ఈ మిశ్రమాన్ని మీ చర్మంపై అప్లై చేయండి.

పదినిమిషాల తరువాత, గోరువెచ్చటి నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

వారానికి రెండుసార్లు ఈ పద్దతిలో మీ చర్మాన్ని సంరక్షించుకుంటే అద్భుతమైన ఫలితాలు మీ సొంతమవుతాయి.

English summary

10 Ways To Use Almond Oil To Get Radiant And Dewy Skin

Almond oil is packed with vitamin A and other powerful antioxidants, it is often hailed for its numerous skin-enhancing benefits. It can effectively get the gunk out of your skin and make sure that there is no build-up of debris in your pores, thereby imparting a dewy glow on your face.