For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ చర్మానికి ఆక్సిజన్ ఫేషియల్ ఎందుకు అవసరం? అది ఎలా చేయాలో తెలుసా?

By R Vishnu Vardhan Reddy
|

మీరు గనుక అందాన్ని పెంపొందించే బ్యూటీ పార్లర్ వద్దకు వెళ్లి మీ చర్మానికి ఏ రకమైన ఫేషియల్ నప్పుతుంది అని అడిగినట్లైతే సాధారణంగా వచ్చే సమాధానం ' ఆక్సిజన్ ఫేషియల్ '

ఆక్సిజన్ ఫేషియల్ అనే పేరే తెలియజేస్తుంది ఆ ఫేషియల్ ఎలా మనకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని. ఎక్కువ సాంద్రత కలిగిన అతిశయమైన పద్దతి ద్వారా ఆక్సిజన్ ని చర్మం లోపలకి పంపడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల చర్మం ఎక్కువ కాంతిని సంతరించుకుంటుంది మరియు తేజస్సు పెరుగుతుంది.

diy oxygen facial

ఫేస్ క్లీన్ గా..ఫ్రెష్ గా.. యంగ్ లుక్ తో కనబడాలంటే 10 సింపుల్ ఫేషియల్స్..!

ఎయిర్ గన్ లాంటి పరికరాలను ఉపయోగించి ఈ ప్రక్రియను చేస్తారు. ఆక్సిజన్ తో పాటుగా విటమిన్లు, పోషకాలు, యాంటి ఆక్సిడెంట్స్, పెప్టైడ్స్ మొదలగునవి చర్మం లోపలికి పంపుతారు. కాబట్టి ఒక రకంగా మన చర్మంలో ప్రతి రోజు దూరమయ్యే చర్మానికి కావాల్సిన పోషకాలన్నింటిని ఆక్సిజన్ ఫేషియల్ ద్వారా అందించవచ్చు. అలా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.

మీరు ఇప్పటికీ గనుక ఈ విషయం గురించి ఒప్పుకోలేకపోతున్నట్లైతే ఈ క్రింద ఆక్సిజన్ ఫేషియల్ గురించి వివరంగా చెప్పడం జరిగింది. మీరు ఎందుకు ఆ ఫేషియల్ చేపించుకోవాలి అనే విషయాన్ని కూడా చర్చించారు. అంతే కాకుండా ఈ ఆక్సిజన్ ఫేషియల్ ని మీ ఇంట్లో కూడా మీకు సౌకర్యవంతమైన పద్ధతుల్లో ఎలా చేసుకోవచ్చో వివరించారు.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ముఖంలో బ్లాక్ హెడ్స్, డెడ్ స్కిన్ సెల్స్ తొలగించే హోం మేడ్ ఫేషియల్స్

సూర్యకాంతి వల్ల దెబ్బతిన్న మరియు ఎండిపోయిన చర్మాన్ని నయం చేసే మార్గం :

సూర్యకాంతి వల్ల దెబ్బతిన్న మరియు ఎండిపోయిన చర్మాన్ని నయం చేసే మార్గం :

మన చర్మం తరచూ విపరీతమైన కాలుష్యానికి బహిర్గతమవుతుంది మరియు అక్కడ ఉన్న దుమ్ము, ధూళి వల్ల చర్మం తన సహజ సౌందర్యాన్ని కోల్పోయి పొడిబారిపోతుంది మరియు కాంతిహీనం అవుతుంది. ఇలా జీవంలేని చర్మంలా మారిపోయిన మన చర్మాన్ని మళ్ళీ మంచి యవ్వన స్థితికి తీసుకురావాలంటే అది ఆక్సిజన్ ఫేషియల్ ద్వారా సాధ్యమవుతుంది. చర్మానికి అవసరమైన పోషకాలన్నింటిని ఒకే సారి చర్మం లోపలికి చొప్పించడం అనే ప్రక్రియ ఆక్సిజన్ ఫేషియల్ ద్వారా సులభతరం అవుతుంది. ఈ పద్దతి వల్ల చర్మానికి జరిగిన నష్టం తగ్గిపోయి తక్షణ ఫలితాలు కనిపిస్తాయి. చర్మం లో ఉండే పి.హెచ్ సమతుల్యత కాపాడటంలో ఆక్సిజన్ ఫేషియల్ ముఖ్య పాత్ర వహిస్తుంది.

ఆక్సిజన్ ఫేషియల్ను చాలా తక్కువ సమయంలో ముగించవచ్చు :

ఆక్సిజన్ ఫేషియల్ను చాలా తక్కువ సమయంలో ముగించవచ్చు :

సాధారణంగా ఫేషియల్ కి వాడే క్రమ పద్ధతులన్నీ ఆక్సిజన్ ఫేషియల్ లో కనపడవు. ఆరోమా థెరపీ, మసాజ్ లేదా ప్రోడక్ట్ లేయరింగ్ కి ఉన్న ప్రక్రియలు ఆక్సిజన్ ఫేషియల్ కు ఉండవు. అయినప్పటికీ మీ చర్మానికి కావాల్సిన అన్ని పోషకాలను చాలా కొద్దీ సమయంలోనే అందిస్తుంది. మీ చర్మంలో ఉన్న చెడు పదార్ధాలను తీసివేస్తుంది, కాంతిని పెంపొందించేందుకు దోహదపడుతుంది, చర్మానికి కావాల్సిన ఆక్సిజన్ ఉపభాగాలను అందిస్తుంది. ఆక్సిజన్ ఫేషియల్ లో ఉన్న ఈ మూడు దశలను పూర్తి చేయడానికి మహా అయితే ఒక గంట సమయం మాత్రమే పడుతుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత మీలో ఏదో తెలియని శక్తి మీ చర్మానికి చేరింది అనే అనుభవాన్ని మీరు పొందుతారు, అనుభవిస్తారు.

మీ చర్మం తేజస్సుతో వెలిగిపోతుంది :

మీ చర్మం తేజస్సుతో వెలిగిపోతుంది :

ఏదైనా వేడుక త్వరలో ఉంటే అలాంటి వాటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు పాలిపోయిన లేదా కాంతిహీనమైన చర్మంతో వెళ్ళడానికి ఏ ఒక్కరు ఇష్టపడరు. అంతే కాకుండా స్త్రీలు కాంతివంతమైన మరియు తేజాస్సుతో కూడిన చర్మం ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు అలాంటి ఒక చర్మపు కాంతిని మీరు గనుక పొందాలని భావిస్తున్నట్లైతే ఆక్సిజన్ ఫేషియల్ అనేది ఉత్తమమైన మార్గం . ఈ ప్రక్రియ ద్వారా చర్మం పొరల్లోకి తాజా ఆక్సిజన్ అనేది పంపబడుతుంది. అందుచేత మీ చర్మం మరియు శరీరంలో రక్త ప్రసరణ బాగా పెంపొందుతుంది. ఆక్సిజన్ ఫేషియల్ రక్తప్రసరణ పై నేరుగా ప్రభావం చూపిస్తుంది మరియు అందువల్ల మీ చర్మం సాధారణ కాంతిని సంతరించుకుంటుంది. ఇందువల్ల మీరు ఒక అద్భుతమైన అనుభూతిని పొందుతారు.

ఫలితం ఖచ్చితంగా కలిగే ప్రక్రియ :

ఫలితం ఖచ్చితంగా కలిగే ప్రక్రియ :

మీరు ఒక ఆరోగ్యవంతమైన ఆక్సిజన్ ఫేషియల్ చేయించుకోవడం ద్వారా మీరొక అద్భుతమైన అనుభూతిని పొందుతారు. మీరు చికిత్స చేసుకునే సమయంలో మీకు ఇష్టమైన కొన్ని చికిత్సలను ఎంపిక చేసుకొనే వెసులుబాటు ఉంది. హైయాలురోనిక్ ఆమ్లం, బొటానికల్ పదార్దాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పెప్టైడ్స్ మరియు విటమిన్లు ఇలా మీరు ఏది కోరుకుంటే అందుకు అనుగుణంగా మీకు చికిత్స చేయడం జరుగుతుంది. అందుకు తగ్గ ఫలితాలు మీరు పొందుతారు. అది మీ చర్మం విషయంలో తక్షణ ఫలితాలు అందిస్తుంది. ఏ రకమైన ఆక్సిజన్ ఫేషియల్ చికిత్స మీ చర్మ తత్వానికి సరిపోతుంది అనే విషయానికి సంబంధించి అక్కడ బ్యూటీ పార్లర్ లో ఉన్న మహిళ సలహాలను తీసుకోవడం మంచిది.

మొటిమలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే :

మొటిమలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే :

ఏ వ్యక్తులైతే మొటిమలతో విపరీతమైన సమస్యలను ఎదుర్కొంటున్నారా అటువంటి వారు ఆక్సిజన్ ఫేషియల్ ని సంప్రదించవచ్చు. ఆక్సిజన్ ఫేషియల్ అనేది ఎన్నో చర్మ సంబంధమైన సమస్యలను నివారిస్తుంది. కాబట్టి మీకున్న మొటిమల సమస్యలను కూడా ఖచ్చితంగా నివారించే అవకాశం ఉంది. మొటిమలు అనేటివి ప్రోపియోనిబ్యాక్టీరియం అనే బాక్టీరియా వల్ల ఏర్పడతాయి. ఆక్సిజన్ ఫేషియల్ వల్ల అదనపు ఆక్సిజన్ మన చర్మ ఉపరితలం పై ప్రవేశించడం వల్ల నేరుగా ఆ బాక్టీరియా పై ప్రభావం చూపి వాటిని చర్మం నుండి పారద్రోలుతుంది. మొటిమల కణాల యొక్క మూలలను ఆక్సిజన్ దెబ్బ తీస్తుంది అందువల్ల మీ చర్మం ఎంతో అందంగా మరియు ఆరోగ్యవంతంగా తయారవుతుంది.

ఇప్పుడు మీ ఇంట్లో ఆక్సిజన్ ఫేషియల్ అనే చికిత్సను ఎలా చేసుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం .

ఇంట్లో ఆక్సిజన్ ఫేషియల్ ఎలా చేసుకోవాలంటే :

ఇంట్లో ఆక్సిజన్ ఫేషియల్ ఎలా చేసుకోవాలంటే :

బయట చేసినట్లుగా ఆక్సిజన్ ని నేరుగా మన చర్మంలోకి చొప్పించే ప్రక్రియ ఇంట్లో ఆక్సిజన్ ఫేషియల్ చేసుకున్నప్పుడు సాధ్యపడదు. కానీ, క్రింద చెప్పిన విధానాన్ని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఈ చేసే క్రమంలో విపరీతమైన బుడగలు వస్తాయి. దానికి కారణం అవే మీ చర్మానికి ఆక్సిజన్ అందించేవి.

వాడవలసిన పదార్ధాలు :

5 టేబుల్ స్పూన్ ల బాదం పొడి, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల బెంటోనైట్ పొడి, 4 టేబుల్ స్పూన్ల నీరు, కొన్ని చుక్కల రోజా తైలం, కప్పులో ఎనిమిదో వంతు ఓట్ మీల్ పొడి, రెండు చుక్కల హైడ్రోజెన్ పెరాక్సైడ్.

చేసే విధానం :

ఈ పొడులన్నింటిని (బాదం, బెంటోనైట్ మరియు ఓట్ మీల్ ) ముందుగా కలుపుకోవాలి.

ఆ తర్వాత రోజా తైలం మరియు నీటిని కలిపి ఒక ముద్దలా చేయాలి.

చివరిగా హైడ్రోజెన్ పెరాక్సైడ్ ని అందులో కలపాలి.

అలా చేసినప్పుడు మీకు బుడగలు రావడం మొదలవుతుంది. ఎక్కువ బుడగలు రావడానికి ఎక్కువ హైడ్రోజెన్ పెరాక్సైడ్ ని కలపకండి. అలా చేయడం వల్ల మీ చర్మం నష్టపోయే అవకాశం ఉంది.

ఈ మిశ్రమాన్ని మీ చర్మం పై పూయండి.

అర గంట పాటు అలానే వదిలేయండి, ఆ తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోండి, చివర్లో మాయిశ్చరైజర్ రాసుకోండి.

English summary

Diy Oxygen Facial |Why Oxygen Facial | Oxygen Facial With Step

DIY oxygen facial steps at home with its importance on your skin.
Story first published: Monday, September 25, 2017, 10:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more