ఒత్తైన కనురెప్పలను వేగంగా పెంచే - సహజసిద్ధమైన ఇంటి చిట్కాలు !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఒత్తైన, అందమైన కనుబొమ్మలను కలిగి ఉండాలని మహిళలు ఎక్కువగా కోరుకుంటారు. స్త్రీలకు ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలలో కనుబొమ్మలు ఒకటి. ఒత్తైన, పొడవైన కనుబొమ్మలను ఎక్కువకాలం కలిగి ఉండాలని అందరూ ఎక్కువగా కోరుకుంటారు.

కొంతమంది సన్నని కనుబొమ్మలను కలిగివుంటారు, అలాంటి వాళ్ళు జనసమూహంలోకి వెళ్లడానికి ధైర్యం చెయ్యలేరు. సన్నని కనుబొమ్మలను కలిగి ఉండటానికి గల కొన్ని కారణాలు ఏమిటంటే థ్రెడ్డింగ్, ఓవర్ ప్లుక్కింగ్ (లేదా) వాక్సింగ్ వంటివి చెయ్యడం.

8 Natural Home Remedies To Grow Your Eyebrows Instantly

హెయిర్ లాస్ కి అనేక వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటివల్ల కలిగే దుష్ప్రభావాలు మాత్రం దీర్ఘకాల ప్రభావాలను కలిగి ఉంటాయి. ఈ సన్నని కనుబొమ్మల సమస్యను అధిగమించడానికి ఇంటి చిట్కాలను పాటించడమే అత్యుత్తమైనవని చెప్పవచ్చు.

ఇంట్లో ఉండే సహజమైన పదార్ధాలతో ఆరోగ్యవంతమైన, ఒత్తైన కనుబొమ్మలను పెంచడంలో ఎలా సహాయ పడతాయి మనము తెలుసుకుందాం రండి.

కొబ్బరినూనె :

కొబ్బరినూనె :

నీరు కొబ్బరి నూనెను ఉపయోగించడం ద్వారా ఒత్తైన కనుబొమ్మలను పెంచవచ్చు. కొబ్బరినూనె మీ కనుబొమ్మలు పెరగడానికి సహాయపడే విధంగా రక్త ప్రసరణను పెంచుతుంది. అంతేకాకుండా ఇది వెంట్రుకలు ఫోలికల్స్ను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ నూనెలో విటమిన్ E, ఐరన్ వంటి గుణాలను కలిగి ఉంది. అందువల్ల ఇది మీ కనుబొమ్మలను చాలా ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేటట్లు చేస్తుంది.

ఉల్లిరసం :

ఉల్లిరసం :

జుట్టు పెరుగుదల విషయంలో ఉల్లిపాయ రసం బాగా పనిచేస్తుంది. వంటల కోసం సాధారణంగా ఉపయోగించే దీనిని ఒత్తైన కనుబొమ్మల కోసం ఉపయోగించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను సృష్టించగలదు. ఉల్లిపాయ తొక్క ఒలిచి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసిన తరువాత వాటిని మెత్తని పేస్టులా చేసి, వడకట్టడం ద్వారా వచ్చిన రసాన్ని ఉపయోగించండి. ప్రతిరోజు ఈ రసాన్ని మీ కనుబొమ్మలకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలరు. ఈ రసాన్ని అప్లై చేసిన పది నిమిషాల తర్వాత చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రంగా కడగాలి.

గుడ్డు పచ్చసొన :

గుడ్డు పచ్చసొన :

గుడ్డు పచ్చసొనను, జుట్టు పెరుగుదలకు ఉపయోగించబడే చాలా పురాతనమైన నివారణలలో ఒకటి. మీ కనుబొమ్మలను ఒత్తుగా పెంచే ఇతర నివారణ పద్ధతుల కంటే, ఈ పద్ధతి చాలా ఉత్తమంగా పనిచేస్తుంది. అందుకోసం గుడ్డు నుంచి పచ్చసొనను వేరు చేసి మీ కనుబొమ్మల మీద అప్లై చెయ్యాలి. ఇలా అప్లై చేసిన 15-20 నిమిషాల వరకు బాగా ఆరనివ్వాలి, ఆ తర్వాత చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రంగా కడగాలి. మరింత మెరుగైన ఫలితాల కోసం ఈ పద్ధతిని వారంలో మూడుసార్లు తప్పక ప్రయత్నించి చూడండి.

మెంతులు :

మెంతులు :

ఒత్తయిన కనుబొమ్మల కోసం మెంతులను ఉపయోగించవచ్చు. దీనిని ఉపయోగించడం వల్ల మీరు ఆరోగ్యకరమైన, ఆకర్షణీయమైన కనుబొమ్మలను కలిగివుంటారు. అందుకోసం గుప్పెడు మెంతులు తీసుకొని రాత్రంతా నీటిలో బాగా నానబెట్టాలి. అలా నానబెట్టిన మెంతులు మరుసటి రోజు ఉదయము మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను మీ కనుబొమ్మలకు అప్లై చేసిన 15 నిముషాల తర్వాత మాత్రమే మీ ముఖాన్ని నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి.

పెట్రోలియం జెల్లీ :

పెట్రోలియం జెల్లీ :

భారతీయుల ప్రతి ఇంటిలో ఈ జెల్లీ ఉంటుంది. పెట్రోలియం జెల్లీ మీ కనుబొమ్మల పెరుగుదలలో అద్భుతాలను చెయ్యగలదు. ప్రతిరోజు రాత్రి

పడుకునే ముందు ఈ జెల్లీని మీ కనుబొమ్మలకు అప్లై చేయండి. మరుసటిరోజు ఉదయం చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రంగా కడగండి. ఈ విధంగా ప్రతి రోజూ చేయడం వల్ల మరింత మెరుగైన ఫలితాలను పొందగలరు.

అలోవెర (కలబంద) :

అలోవెర (కలబంద) :

అలోవెరను ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు. ఇది అసంఖ్యాకమైన సౌందర్య సమస్యలను పరిష్కరించగలదు. మీ కనుబొమ్మలను ఒత్తుగా చేసి, ఆరోగ్యవంతంగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది. దీనికోసం మీరు కలబంద గుజ్జును బయటకు తీసి, కనుబొమ్మలపై అప్లై చేయండి. అలా అప్లైచేసిన 15 నిమిషాల తర్వాత నీటితో మీ ముఖాన్ని శుభ్రంగా కడగాలి. మంచి ఫలితాల కోసం తాజా కలబందను వాడండి (లేదా) మార్కెట్లో లభించే అలోవెర జెల్ను కూడా ఉపయోగించవచ్చు.

పాలు :

పాలు :

జుట్టు పెరుగుదలలో సహాయపడే ప్రోటీన్లు పాలలో ఉన్నాయి. అలాగే పాలలో ఉండే క్యాల్షియం మీ కనుబొమ్మల వెంట్రుకలు మరింత ఒత్తుగా పెంచడంలో సహాయపడుతుంది. దూది సహాయంతో మీ కనుబొమ్మల పై పాలను అప్లై చేయడం. అలా 15 నిమిషాలపాటు మీ కనుబొమ్మలను వదిలివేయండి. ఆ తరువాత చల్లని నీటితో శుభ్రం చేయండి. ఈ పద్ధతిని వారంలో మూడుసార్లు పాటించడం వల్ల వచ్చే భారీ తేడాను మీరే గమనించవచ్చు.

English summary

8 Natural Home Remedies To Grow Your Eyebrows Instantly

8 Natural Home Remedies To Grow Your Eyebrows Instantly,Thick and beautiful eyebrows is something that all the ladies out there wish for. Though there are several medical treatments for hair loss, they can at times have side effects in the long run. Let's see how some of our natural ingredients can help in growing thic