For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డైమండ్ ఫేషియల్ ప్రత్యేకతేంటి? దీని వలన కలిగే ప్రయోజనాలు

డైమండ్ ఫేషియల్ ప్రత్యేకతేంటి? దీని వలన కలిగే ప్రయోజనాలు

|

సౌందర్యంపై శ్రద్ధ కనబరిచే వారు అనేక ఫేషియల్స్ గురించి వినే ఉంటారు. ముఖ్యంగా డైమండ్ ఫేషియల్ అనేది వీరిని అమితంగా ఆకర్షించి ఉంటుంది. అయితే, దీన్ని లగ్జరీ బ్యూటీ రెజైమ్ గా పరిగణించే ఉంటారు. అయితే, ఇది ఇప్పుడు ఎంతో కామన్ బ్యూటీ రెజైమ్ గా మారిపోయింది. డైమండ్ ఫేషియల్ గురించి తెలుసుకోవాలని అనుకునే వారికి ఈ ఆర్టికల్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ ఆర్టికల్ లో డైమండ్ ఫేషియల్ కి సంబంధించిన విషయాలను దీని వలన చర్మానికి కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నాము. కాబట్టి, రిలాక్స్డ్ గా కూర్చుని ఈ ఆర్టికల్ ను చదివి డైమండ్ ఫేషియల్ గురించి తెలుసుకోండి.

Beauty Benefits Of Diamond Facial

చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది:

సాధారణంగా చర్మంలోని కొలాజెన్ ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు చర్మం బలహీనంగా అలాగే వదులుగా మారుతుంది. చర్మంలోని ఎలాస్టిసిటీ తగ్గుతుంది. డైమండ్ ఫేషియల్ వలన చర్మంలోని కొలాజెన్ ఉత్పత్తి మెరుగవుతుంది. చర్మం టైట్ గా అలాగే బిగుతుగా మారుతుంది. చాలా ఫేషియల్ క్రీమ్స్ డైమండ్ డస్ట్ ని కలిగి ఉండటానికి గల కారణమిదే. డైమండ్ ఫేషియల్ వలన చర్మ సౌందర్యం మెరుగవుతుంది.

చర్మం హైడ్రేట్ అవుతుంది:

డైమండ్ ఫేషియల్స్ లో భాగంగా వాడే క్రీమ్స్ మరియు జెల్స్ అనేవి చర్మాన్ని హైడ్రేట్ చేసి మాయిశ్చరైజ్ చేసేందుకు తోడ్పడతాయి. అందువలన, డ్రై స్కిన్ తో బాధపడేవారికిది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. డ్రై స్కిన్ అనేది సెబమ్ ప్రొడక్షన్ తక్కువగా ఉత్పత్తి అవడం వలన తలెత్తుతుంది. ఇది రాను రాను ఫ్లేకీ మరియు ఇచీ స్కిన్ కి దారితీస్తుంది. డైమండ్ ఫేషియల్ అనేది చర్మాన్ని హైడ్రేటెడ్ గా, సాఫ్ట్ గా అలాగే సపుల్ గా ఉంచుతుంది.

మొటిమలను అలాగే బ్రేకవుట్స్ ను అరికడుతుంది:

డైమండ్ ఫేషియల్ అనేది బ్రేకవుట్స్ ను తగ్గిస్తుంది. పోర్స్ లో పేరుకుపోయిన దుమ్మూ ధూళిని తొలగించడం ద్వారా చర్మాన్ని శుభ్రపరుస్తుంది. పోర్స్ క్లాగ్ అవడం వలన బ్రేకవుట్స్ సమస్య తలెత్తుతుంది. తద్వారా, చిన్న చిన్న పింపుల్స్ తలెత్తుతాయి.

ముడతలను నివారిస్తుంది:

డైమండ్ డస్ట్ ను పొందుబరిచిన క్రీమ్స్ మరియు జెల్స్ అనేవి ముడతలు అలాగే ఫైన్ లైన్స్ ను తొలగించేందుకు తోడ్పడతాయి. వీటితో మసాజ్ చేసుకోవడం వలన బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగవుతుంది. ముడతలు తొలగిపోయాయి. ఫైన్ లైన్స్ తగ్గుముఖం పడతాయి. ముఖ కండరాలు అలాగే చర్మం టైట్ అవుతాయి. తరచుగా ఈ విధానాన్ని పాటిస్తే ఏజింగ్ కి సంబంధించిన ఇతర లక్షణాలు తగ్గుముఖం పడతాయి.

చర్మాన్ని సాంత్వన అందుతుంది:

మనస్సు అలాగే శరీరం ఉల్లాసంగా మారడానికి మనమెంతగా ప్రయత్నిస్తామో చర్మానికి కూడా అదేవిధమైన కేర్ ను మనం అందించాలి. చర్మానికి కూడా అటువంటి సాంత్వనను చేకుర్చాలి. అందుకోసం, తరచూ చర్మంపై శ్రద్ధను కనబరచాలి. డైమండ్ ఫేషియల్ ద్వారా చర్మానికి సాంత్వనను చేకూర్చవచ్చు.

చర్మం ప్రకాశవంతంగా మారుతుంది:

చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చేందుకు డైమండ్ ఫేషియల్ తోడ్పడుతుంది. చర్మాన్ని డైమండ్ డస్ట్ తో తయారుచేయబడిన జెల్ లేదా క్రీమ్ తో మసాజ్ చేయడం వలన చర్మం ఎక్స్ఫోలియెట్ అవుతుంది. తద్వారా, చర్మంపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. చర్మంపై బ్లేమిషెస్ ను అలాగే పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది. స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. డైమండ్ ఫేషియల్స్ ను రెగ్యులర్ బేసిస్ లో ప్రయత్నించి చర్మకాంతిని పెంపొందించుకోండి.

డైమండ్ ఫేషియల్ కిట్ లోని ఐటమ్స్

1. డైమండ్ క్లీన్సర్

2. డైమండ్ స్క్రబ్

3. డైమండ్ మసాజ్ జెల్

4. డైమండ్ మసాజ్ క్రీమ్

5. డైమండ్ ఫేస్ ప్యాక్

మీరు పాటించవలసిన కొన్ని చిట్కాలు:

1. ఇరవైల వయసులో ఉన్నవారికి ఈ ఫేషియల్ సూట్ కాదు. ఇది మెచ్యూర్ స్కిన్ కలిగిన వారికి బాగా సూట్ అవుతుంది.

2. గర్భిణీలు దీని వినియోగించకూడదు.

3. డైమండ్ ఫేషియల్ ని చేసుకున్న తరువాత కఠినమైన సోప్స్ ను వినియోగించకూడదు.

4. కొన్ని రోజుల వరకు చర్మాన్ని ఎక్స్ఫోలియెట్ చేయకూడదు.

5. ఈ ఫేషియల్ చేసుకున్న వెంటనే ఎటువంటి మేకప్ ను వాడకూడదు.

English summary

Beauty Benefits Of Diamond Facial

Which women/girl doesn't love diamonds? Just as how this beautiful piece of stone enhances our beauty in the form of jewellery, this can do a lot to enhance our beauty in other forms too. Yes. Diamond is being used by the cosmetics industry due to several benefits it aids for the skin. It helps in treating acne, brightens the skin, firms the skin, etc.
Story first published:Wednesday, August 22, 2018, 17:58 [IST]
Desktop Bottom Promotion