Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
చర్మ సంరక్షణకు పెరుగుతో ఐదు అద్భుతమైన పరిష్కారాలు
భారత దేశంలో ప్రతి ఇంట్లో పెరుగు సాధారణంగా అందుబాటులో ఉంటుంది. ఆహారానికి రుచితో పాటు మనకు ఆరోగ్యాన్ని అందించే పెరుగు సౌందర్య పోషణకు కూడా ఉపయోగపడుతుంది అని మీకు తెలుసా!అది చర్మంపై అద్భుతమైన ప్రభావం చూపి
భారత దేశంలో ప్రతి ఇంట్లో పెరుగు సాధారణంగా అందుబాటులో ఉంటుంది. ఆహారానికి రుచితో పాటు మనకు ఆరోగ్యాన్ని అందించే పెరుగు సౌందర్య పోషణకు కూడా ఉపయోగపడుతుంది అని మీకు తెలుసా!అది చర్మంపై అద్భుతమైన ప్రభావం చూపిస్తుంది. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం పలు చర్మ సమస్యల పరిష్కారానికి తోడ్పడుతుంది.
పెరుగు చర్మంపై సూర్యుని ప్రభావం వలన పేరుకున్న ట్యాన్, నల్లని మచ్చలను తొలగించి కాంతివంతంగా మారుస్తుంది. ఇది చర్మం పైన పేరుకున్న మృతకణాలను తొలగించి, బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి చర్మాన్ని శుభ్రపరచి ఆరోగ్యంగా మలుస్తుంది.

పెరుగు వలన కలిగే సౌందర్య ప్రయోజనాలు:
పెరుగుతో మన అందాన్ని ఏ విధంగా మనం పెంచుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా! పెరుగుతో వివిధ రకాల ప్యాక్ లను తయారుచేసుకుని ఇంట్లోని కూర్చుని సౌందర్య పోషణ చేసుకోవచ్చు. అనాదిగా పెరుగు మజ్జిగలు అందాన్ని కాపాడుకోవడంలో చేస్తున్న మాయను మీ ముందు ఉంచబోతున్నాం.

1. మేని ఛాయను ఇనుమడింపజేస్తుంది:
ముందే చెప్పుకున్నట్లు పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం మీ రంగును మెరుగుపరచి కాంతివంతమైన ఛాయను పొందటానికి సహాయపడుతుంది.
ఒక టేబుల్ స్పూన్ పెరుగులో చిటికెడు పసుపు వేసి బాగా కలపండి. దీనిని ముఖానికి, మెడకు బాగా పట్టించండి. అరగంటపాటు ఆరనిచ్చి నీటితో మృదువుగా మర్దన చేస్తూ కడిగేయండి. ప్రతిరోజూ ఇలా రెండు వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

2. నల్లని మచ్చలను తగ్గిస్తుంది:
క్రమం తప్పకుండా వాడటం వలన పెరుగు మృతకణాలను తొలగించి నల్లని మచ్చలను మరియు మరకలను సహజంగానే తేలికపరుస్తుంది.
ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల నారింజ తొక్కల పొడిని తీసుకుని తగినంత పెరుగులో కలిపి మెత్తని పేస్టుగా చేయండి. దీనిని ముఖానికి, మెడకు బాగా పట్టించండి. అరగంట తరువాత చల్లని నీటితో కడిగేయండి. ఇలా వారానికి రెండుసార్లు చేయండి.
వేరొక పద్ధతి ద్వారా కూడా నల్లని మచ్చలను తగ్గించవచ్చు. ఒక దూది ఉండను తీసుకుని పెరుగులో ముంచి ముఖానికి పూయండి. పది పదిహేను నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేయండి. ఇలా రోజుకి రెండు మూడుసార్లు చేయండి.

3. ఎండ వలన ఏర్పడిన ట్యాన్ ను తొలగిస్తుంది:
దీనికై పెరుగును అదే విధముగా ఉపయోగించవచ్చు లేదా మరీంత మేలైన ఫలితం కొరకు ఇతర పదార్థాలతో కలిపి వాడవచ్చు.
పావు కప్పు పెరుగు తీసుకోండి. దీనికి సగం టొమాటోను కలిపి మెత్తని ముద్దగా చేయండి. దీనిని ముఖమంతటా లేదా ట్యాన్ ఉన్న చోట పూయండి. అరగంట తరువాత చల్లని నీటితో కడిగేయండి. ఇలా వారానికి రెండుసార్లు చేయండి.
అంతేకాకుండా దీనిని తేనెతో కలిపి కూడా వాడవచ్చు. ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల పెరుగుకు రెండు టేబుల్ స్పూన్ల తేనెను కలపండి. దీనితో ఐదు నిమిషాల పాటు మర్దన చేసుకుని తరువాత పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వండి. తరువాత చల్లని నీటితో కడిగేయండి. ఇలా ప్రతిరోజూ చేస్తే మంచి ఫలితముంటుంది.

4. పొడి చర్మ సమస్యను పరిష్కరిస్తుంది:
చర్మం పొడిగా ఉండి పొరలుగా ఊడే సమస్య ఉన్నవారికి ఇది బాగా పనిచేస్తుంది.
ఒక చిన్న అరటి పండు ముక్కను తీసుకుని గుజ్జుగా చేయండి. దీనికి ఒక చెంచాడు పెరుగును బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఉంచండి. తరువాత నీటితో కడిగేయండి. ఈ ప్యాక్ మృతకణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

5. క్లెన్సర్ గా పనిచేస్తుంది:
పెరుగు చర్మం పై పేరుకున్న మలినాలను తొలగిస్తుంది. చర్మంపై బాక్టీరియాను మరియు మృతకణాలను తొలగిస్తుంది. దీని వలన చర్మం మెరుగ్గా, ఆరోగ్యంగా ఉంటుంది.
మూడు స్పూన్ల పెరుగును ఒక గిన్నెలో తీసుకోండి. దీనికి ఒక స్పూన్ ఆలివ్ నూనె, బాదం నూనెమరియు కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలపండి. ఒక దూది ఉండను తీసుకుని దీనిలో ముంచి ముఖానికి పూయండి. ఇలా చేయడంతో చర్మం మీద పేరుకున్న మురికి తొలగిపోతుంది.దీనిని పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వండి. తరువాత చల్లని నీటితో కడిగేయండి. ప్రతిరోజు మీరు అన్ని పనులు పూర్తి చేసుకుని ఇల్లు చేరుకున్న తరువాత ఇలా చేయడం వలన మీ చర్మం యొక్క అలసట మొత్తం తొలగిపోతుంది.



Click it and Unblock the Notifications