For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రకాశవంతమైన చర్మాన్ని అందించే అద్భుతమైన హెర్బల్ మార్గాలు

|

చర్మానికి రంగును అందించేందుకు మెలనిన్ పిగ్మెంట్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ, మనం కాస్తంత ప్రయత్నం చేస్తే మన స్కిన్ షేడ్ ని ఒక షేడ్ మెరుగుగా మార్చుకోవచ్చు. తద్వారా, ప్రకాశవంతమైన చర్మాన్ని కొన్ని ప్రత్యేకమైన హోంమేడ్ ఫ్యాక్స్ ని రోజువారి పాటించడం ద్వారా పొందవచ్చు.

అయితే, చర్మం ప్రకాశవంతంగా అలాగే కాంతివంతంగా మారేందుకు కొన్ని రకాల కాస్మెటిక్స్ పై ఆధారపడుతూ ఉంటాము. ఈ ప్రోడక్ట్స్ అనేవి తక్షణ ఫలితాలను అందించినా అవి కేవలం తాత్కాలిక ఫలితాలు మాత్రమే. ఈ ప్రాడక్ట్స్ తయారీలో వాడే కెమికల్స్ వలన చర్మానికి హానీ కలిగే ప్రమాదం కూడా ఉంది.

అందువలన, హోమ్ రెమెడీస్ పైనే ఆధారపడటం ఉత్తమం. మచ్చలేని ప్రకాశవంతమైన అలాగే కాంతివంతమైన చర్మాన్ని పొందేందుకు హెర్బల్ మరియు నేచురల్ రెమెడీస్ ని పాటించడం మంచిది. ఈ రెమెడీస్ అనేవి పాజిటివ్ ఫలితాలను అందించి చర్మానికి ఎటువంటి హానీ కలిగించవు.

Herbal Ways To Get Bright Skin

డల్ స్కిన్ పై అద్భుతంగా పనిచేసే అద్భుతమైన హోమ్ రెమెడీస్ కలవు. సరైన స్కిన్ కేర్ రిజైమ్ ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. ఈ హోమ్ రెమెడీస్ అద్భుత ఫలితాలను అందించేందుకు కాస్తంత సమయం తీసుకున్నా చర్మానికి ఎటువంటి హానీ కలిగించదు.

ఈ ఆర్టికల్ లో, సహజసిద్ధంగా చర్మం యొక్క నిగారింపును ఎలా మెరుగుపరచుకోవచ్చో తెలుసుకుందాం. ఈ హెర్బల్ మార్గాలను ప్రయత్నించి నిగారింపుని మెరుగుపరుచుకోండి.

Herbal Ways To Get Bright Skin


తేనె: తేనెలో చర్మం యొక్క నిగారింపుని మెరుగుపరిచే లక్షణాలు అనేకం. మీ చర్మం నిగారింపుని మెరుగుపరిచేందుకు ఈ ప్రత్యేకమైన చర్మ సంరక్షణ పదార్థాన్ని మీ బ్యూటీ రొటీన్ లో తప్పక జోడించాలి. తేనెని క్రమం తప్పకుండా మీ చర్మంపై అప్లై చేయడం ద్వారా ప్రకాశవంతమైన చర్మాన్ని పొందగలుగుతారు. ముఖంపై, మునివేళ్లతో తేనెని సున్నితంగా మసాజ్ చేయండి. ఆ తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోండి.


అలోవెరా జెల్: అలోవెరాలో అన్ని రకాల బ్యూటీ ప్రాబ్లెమ్స్ ని తొలగించే లక్షణాలు అనేకం కలవు. అందువలన, శిరోజాల సమస్యల దగ్గర నుంచి చర్మ సమస్యల వరకు వివిధ సమస్యలకు అలోవెరా అనేది అద్భుతమైన రెమెడీగా పనిచేస్తుంది. ఇది డార్క్ స్పాట్స్, హైపర్ పిగ్మెంటేషన్ సమస్యను పరిష్కరిస్తుంది. అలాగే, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. కాస్తంత అలోవెరా జెల్ ను తీసుకుని ముఖంపై అప్లై చేసుకుని మీ మునివేళ్లతో మృదువుగా మసాజ్ చేయండి. ఈ ప్రొసీజర్ ను ఒక నెలపాటు వాడి అద్భుతమైన ఫలితాలను పొందండి.

Herbal Ways To Get Bright Skin

బొప్పాయి: మీ చర్మంపై అద్భుతాలను సృష్టించే మరొక మేజికల్ ఇంగ్రిడియెంట్ ఇది. ఇందులో లభించే పోషకాలు డార్క్ స్పాట్స్ ని బ్లేమిషెష్ ని తొలగించి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. కాస్తంత బొప్పాయి గుజ్జుని చర్మంపై అప్లై చేసి కొద్ది సేపటి తరువాత చర్మాన్ని శుభ్రపరుచుకోండి.

పసుపు: ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడతాయి. పాలతో కలిపి వాడితే అద్భుత ఫలితాలను పొందవచ్చు. పసుపు పొడిని కాస్తంత మిల్క్ క్రీమ్ లో కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంపై ఫేస్ ప్యాక్ లా అప్లై చేస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు.

పెరుగు: పెరుగులో లభించే లాక్టిక్ యాసిడ్ లో స్కిన్ బ్లీచింగ్ ప్రాపర్టీలు పుష్కలంగా లభ్యమవుతాయి. కాస్తంత పెరుగుని తీసుకుని చర్మంపై అప్లై చేసి ఆ తరువాత గోరువెచ్చటి నీటితో చర్మాన్ని శుభ్రపరచుకోవాలి. పెరుగు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి చర్మాన్ని మరింత కాంతివంతంగా మార్చుతుంది.

English summary

Herbal Ways To Get Bright Skin

Herbal Ways To Get Bright Skin,There are certain effective remedies that work wonders for dull skin. A good skin care regimen results in a healthy skin. These home remedies take time to give results but do provide effective results causing zero side effects. In this article, we have listed out some of the natural ways
Story first published:Thursday, February 1, 2018, 13:08 [IST]
Desktop Bottom Promotion