For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొటిమలను నివారించేందుకు నిమ్మ + తేనెలతో ఇంట్లోనే తయారు చేసుకోగల అద్భుతమైన పరిష్కార మార్గం !

|

జిడ్డైన చర్మం మిమ్మల్ని చాలా ఎక్కువగా బాధించవచ్చు, ముఖ్యంగా ఇది చర్మ పగుళ్ళకు & ముఖంపై మొటిమలు ఏర్పడే అవకాశాలను పెంచుతుంది. అత్యధిక మంది మహిళలు భయపడే చర్మ సమస్యలు జిడ్డైన చర్మం అనేది ఒకటి, దీని ఫలితంగానే పింపుల్స్ అనేవి తరచుగా ఏర్పడతాయి. జిడ్డైన చర్మం గల వారిలో ఇలా మొటిమలు సంభవించడం అనేది ఒక నిరంతరమైన సమస్యగా ఉంటుంది.

ఈ మొటిమల నివారణకు ఉపయోగించే మందులు చాలా ఖరీదైనవి, అలాగే మీరు ఈ మందులను దీర్ఘకాలంగా ఉపయోగించడం వల్ల మీ చర్మానికి అంత మంచిది కాదు. ఈ మందులు తాత్కాలిక ఫలితాలను మాత్రమే ఇవ్వగలదుగానీ మొటిమల కారణంగా ఏర్పడిన మచ్చలను మాత్రం పోగొట్టలేవు. జిడ్డైన చర్మం గల వారిలో ఏర్పడే మొటిమలను ఇంటి చిట్కాలను ఉపయోగించి చాలా సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు.

Homemade Honey And Lemon Mix For Treating Pimples

అలాంటి అద్భుతమైన ఇంటి చిట్కాలలో, నిమ్మ + తేనే అనేది ఒకటి. ఇప్పుడు మీరు దీని తయారీ విధానాన్ని & మొటిమలను సమర్థవంతంగా తొలగించడంలో దీని ప్రముఖ పాత్ర గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం !

జిడ్డైన చర్మం గల వారిలో ఈ మొటిమలు ఎందుకు ఏర్పడతాయి ?

జిడ్డుచర్మం గలవారిలో సెబం అనబడే కొవ్వును కలిగి ఉండే ఆయిల్ చర్మం నుంచి అధికంగా ఉత్పత్తి అయిన కారణంగా మొటిమలను ఏర్పరుస్తుంది. మీరు ఎలాంటి చికిత్సా పద్ధతులను ఉపయోగించకముందే మీరు జిడ్డైన చర్మాన్ని కలిగి ఉన్నారని ప్రాథమికంగా తెలుసుకుంటారు. ఇలాంటి చర్మం గల వారిలో చర్మరంధ్రాలు బాగా విస్తరించి ఉండటమే కాకుండా, మీ చర్మం ఎల్లప్పుడు మెరుస్తున్నట్లుగా కనపడుతుంది.

ఇదంతా కూడా అధికంగా సెబం ఉత్పత్తి కావటం వల్లే జరుగుతుంది. దీనికారణంగా పింపుల్స్ & బ్లాక్ హెడ్స్ వంటి చర్మ సమస్యలకు దారితీస్తుంది. మీ ముఖంపై ఏర్పడే ఈ లోపాలు నుదురు, ముక్కు, గడ్డం & T ఆకారంలో ఉన్న మీ ముఖ ఆకృతిపై కనిపించడమనేది సర్వసాధారణంగా ఉంటుంది.

జిడ్డైన చర్మం గలవారు సరైన పోషకాహారాలను తీసుకోకపోవడం వల్ల కూడా వారిలో మొటిమలు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చర్మం గలవారు వెన్న, నూనెల వంటి పదార్ధాల వినియోగానికి చాలా దూరంగా ఉండాలి.

బాగా వేయించిన & ఉప్పు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల అవి సేబాషియస్ గ్రంధులను పీడించేలా చేస్తుంది.

జిడ్డైన చర్మం గలవారు ఈ వేసవికాలంలో మరింత ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ సేబాషియస్ గ్రంధులు మరింత ప్రభావాన్ని కలిగి ఉంటాయి.

ఇంటిలోనే మొటిమలను చికిత్స చేయు విధానం :

నిమ్మరసం + తేనె మిశ్రమము మొటిమలను తొలగించి మీ చర్మాన్ని మరింత అందంగా తయారు చేయడంలో బాగా ఉపకరిస్తుంది. వయస్సు ఆధారిత సమస్యలను ఎదుర్కొనే జిడ్డైన చర్మం కలవారు ఈ ఇంటి చిట్కాను పాటించడంవల్ల ఉత్తమమైన ఫలితాలను పొందగలరని చాలామంది భావిస్తారు. నిమ్మకాయ అనేది ప్రతి ఇంటి వంటగదిలో సులభంగా లభించే పదార్థము, దీనిని ఉపయోగించడం వల్ల మీరు దోషరహితమైన, కాంతివంతమైన చర్మాన్ని కచ్చితంగా పొందగలరు.

నిమ్మలో సిట్రిక్ యాసిడ్ అనేది ప్రధానంగా ఉండే అంశము. ఇది జిడ్డైన చర్మం గల వారిలో అధికంగా ఉత్పత్తి అయ్యే సెబంను నియంత్రిస్తూ & బాగా నెమ్మదించేలా చేస్తుంది. అందువల్ల ఇది సమర్థవంతంగా పింపుల్స్ను తగ్గించేలా పనిచేస్తుంది. ఈ సిట్రిక్ యాసిడ్ మొటిమలు మరియు పింపుల్స్కు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపి, నిర్మూలించడంలో బాగా పనిచేస్తుంది.

మొటిమల కారణంగా ఏర్పడిన మచ్చలను తొలగించడంలో నిమ్మరసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

మొటిమల నివారణకు చాలామంది మహిళలు నిమ్మరసాన్నే ఎక్కువగా ఉపయోగిస్తారు. నిమ్మ ఒక సహజ రక్తస్రావాన్ని వారిని లక్షణాలను కలిగి ఉండడంతో పాటు, యాంటీ బ్యాక్టీరియల్ ఏజంట్గా కూడా ఉంటుంది. అందువల్ల నిమ్మ ఎక్స్ఫోలియంట్ గా కూడా పనిచేస్తుంది. అలా ఇది చనిపోయిన చర్మకణాలను త్వరగా తొలగించి అవి మీ చర్మ రంధ్రాలకు అడ్డుపడకుండా చూస్తుంది.

మరొకవైపు, తేనె యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది చర్మంపై తేమను సమంగా ఉండేలా పునరుద్ధరించడంలో బాగా పనిచేస్తుంది. తేనే మీ చర్మానికి సహజమైన కాంతిని అందివ్వడంలో సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఇది మొటిమల ఉనికిని తగ్గించడంలో కూడా బాగా పనిచేస్తుంది.

తేనెలో వున్నా యాంటిబయోటిక్స్ తన ప్రభావాన్ని చూపడానికి ముందే బ్యాక్టీరియా పెరుగుదలకు అవకాశంగా ఉన్నా తెగిన గాయాలను చికిత్స చేయుటలో బాగా ఉపయోగపడుతుంది. తేనె, యాంటీసెప్టిక్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల మోస్తరు స్థాయిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ను విడుదల చేస్తుంది. ఇది మీ చర్మాన్ని ఇన్ఫెక్షన్లకు గురికాకుండా సంరక్షిస్తుంది.

తేనెలో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు వల్ల, మీ చర్మం ఎరుపెక్కడం; మొటిమలు & పింపుల్స్ కారణంగా మీ చర్మం వాపుకు గురయ్యే వంటి ఇతర పరిస్థితులను నెమ్మదించేలా చేస్తాయి. తేనె పింపుల్స్ ను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది, అలాగే ఈ మొటిమల నివారణలో ఇతర చికిత్సా పద్ధతుల మాదిరిగా మీ చర్మాన్ని పొడిగా మారేలా మాత్రం ఉంచదు.

నిమ్మరసం + తేనె పదార్థాలతో అద్భుతమైన మిశ్రమమును తయారు చేసే విధానం :

• ఒక కప్పులో టేబుల్స్ స్పూన్ నిండుగా తాజా నిమ్మరసాన్ని తీసుకోవాలి. అంతే మోతాదులో తేనెను కూడా తీసుకొని, ఈ రెండింటిని బాగా కలపాలి. దాని ఫలితంగా మందంగా ఉన్న పేస్టు తయారవుతుంది.

• ఇలా తయారైన ప్యాక్ను మీ మెడ & ముఖ భాగాలపై అప్లై చేయండి. అంతకంటే ముందు మీ శరీరాన్ని బాగా శుభ్రపరచుకోవాలి. నిమ్మ తేనెల తో చేయబడిన ఈ ఫేస్ ప్యాక్ ను ఎల్లప్పుడూ పొడిగా & శుభ్రంగా వున్న ముఖంపైన మాత్రమే అప్లై చేయాలి.

• దూది పింజ సహాయంతో ఈ ప్యాక్ను ముఖము, మెడ భాగాలలో పూర్తిగా అప్లై చేయాలి.

• అప్లై చేసిన 15 - 20 నిమిషాల వరకు అలానే వదిలివేయాలి.

• ఆ తర్వాత మీ శరీరాన్ని చల్లని నీటితో శుభ్రంగా కడగాలి.

ఈ ప్యాక్ మొటిమలు తగ్గుదలలో తక్షణమే దాని ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా ఇది మీ ముఖానికి సహజమైన, ప్రకాశవంతమైన ఛాయను ప్రసాదిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ను ఉపయోగించడం వల్ల మొటిమల ఆధారిత మచ్చలను కూడా పోగొట్టేలా చేస్తుంది. పింపుల్స్ & మొటిమల నివారణ చికిత్సకు ఈ ఫేస్ ప్యాక్ చాలా అద్భుతమైనదిగా పనిచేస్తుందని పరిగణించబడింది.

సాధారణ నిమ్మరసం + తేనెలతో చేయబడిన ఈ ప్యాక్ మొటిమలను చికిత్స చేసి, వాటిని మీకు చాలా దూరంగా ఉంచుతుంది. ఈ ప్యాక్ ద్వారా మీ చర్మంపై ఏర్పడే మొటిమలు నివారించబడినట్లయితే, మీ చర్మ సంరక్షణ పద్ధతులలో ఈ చిట్కాను కూడా చేర్చి, దీనిని మీరు పాటించగలరు. ప్రతి వారంలో కనీసం రెండు సార్లు ఈ చిట్కాలను ప్రయత్నించి చూడండి. దానివల్ల కలిగే ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు !

English summary

Homemade Honey And Lemon Mix For Treating Pimples

Having an oily skin can be quite annoying, especially as it is quite prone to breakouts and acne. For any woman, the most feared skin problem, mainly if the skin is of an oily type, is the appearance of pimples frequently. Occurrence of pimples tends to be a persistent problem for people with an oily skin.
Story first published:Friday, June 22, 2018, 13:33 [IST]
Desktop Bottom Promotion