ఒక్క రాత్రిలోనే బ్లాక్ హెడ్స్ ను నివారించడం ఎలా ?

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

నేటి కాలంలో చాలా ఎక్కువ మంది ఎదుర్కుంటున్న అతి సాధారణమైన చర్మ సమస్య ఈ "బ్లాక్-హెడ్స్". చనిపోయిన చర్మకణాలు, ధూళితో సమ్మిళితమై చర్మ రంధ్రాలలోకి చేరినప్పుడు ఈ బ్లాక్హెడ్స్ ఏర్పడతాయి. ఇవి సాధారణంగా ముక్కు, బుగ్గలు, నుదటి మీద కనిపిస్తాయి. అలాగే ఇది భుజం, చేతులు, వీపు, మెడ భాగాల్లో కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి.

మీరు సూర్యరశ్మిలో బహిర్గతమవడం, ఎక్కువగా మేకప్ను ఉపయోగించడం, చర్మం పొలుసుల మాదిరిగా ఊడిపోకుండా ఉండటం, అధికంగా సెబుం ఉత్పత్తి అవ్వడం, శరీర హార్మోన్ల మార్పులు, గర్భధారణ, రుతుస్రావం, పిల్లలు పుట్టకుండ మాత్రలు వాడటం, దీర్ఘకాలంగా స్టెరాయిడ్ క్రీములను ఉపయోగించడం వంటి కారణాల వల్ల ఈ బ్లాక్ హెడ్స్ అనేవి ఏర్పడటానికి కారకాలుగా మారతాయి.

 How To Remove Blackheads Overnight

ఈ బ్లాక్హెడ్స్ను నివారించేందుకు మార్కెట్లో లభిస్తున్న అనేక ఉత్పత్తుల వినియోగం దీర్ఘకాలంలో మనకు హానికరమైనవిగా మారతాయి. కాబట్టి వాటికి బదులుగా ఇంట్లోనే తయారు చేసుకోగలిగే సులువైన చిట్కాలను పాటించడం ద్వారా బ్లాక్ హెడ్స్ను నివారించవచ్చు.

ఇంతకు అవేమిటో ఇప్పుడు మనము చూద్దాం.

1. నిమ్మరసం :-

1. నిమ్మరసం :-

నిమ్మరసం యాంటీ ఆక్సిడెంట్లను & విటమిన్-C ను కలిగి ఉండటం వల్ల, చనిపోయిన చర్మకణాలను, బ్లాక్ హెడ్స్ను తొలగించడంలో సహాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

అర టీస్పూను నిమ్మరసం

1 టేబుల్ స్పూను ఉప్పు

నీరు తగినంత

తయారీ విధానం :

పైన చెప్పబడిన పదార్థాలను మూడింటిని బాగా కలపాలి. ఈ విధంగా తయారైన మిశ్రమాన్ని మీ ముఖంపై బ్లాక్ హెడ్స్ ఉన్నచోట వృత్తాకార కదలికలు నెమ్మదిగా అప్లై చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై 5-10 నిమిషాల పాటు ఉండనిచ్చిన తరువాత, చలం నీటితో మీ ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఈ విధంగా ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు చేస్తూ ఉండ్రి పడుకునే ముందు చేస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలను పొందగలరు.

2. కొబ్బరినూనె :-

2. కొబ్బరినూనె :-

కొబ్బరినూనె క్లీన్సర్ గానూ, అలాగే మాయిశ్చరైజర్ గాను పనిచేస్తుంది. అందువల్ల కొబ్బరినూనెను వాడటం వల్ల బ్లాక్ హెడ్స్ అనేవి సులభంగా తొలగిపోతాయి.

చిట్కా :

1-2 చుక్కల కొబ్బరినూనెను వేలితో తీసుకొని సమస్యాత్మకమైన ప్రాంతంలో రుద్దుతూ ఉండాలి. దానిని అలాగే కొన్ని గంటలపాటు వదిలేయాలి. ఇలా ప్రతిరోజూ మీరు నిద్రించడానికి ముందు అప్లై చేస్తుండాలి.

3. గుడ్డులోని తెల్లసొన :-

3. గుడ్డులోని తెల్లసొన :-

గుడ్డు తెల్లసొనలో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అవి వైట్ హెడ్స్కు సరైన చికిత్సను అందిస్తుంది.

చిట్కా :

గుడ్డు నుంచి వేరు చేయబడిన తెల్లసొనను మీ ముఖం పైన అప్లై చేయాలి. అలా అప్లై చేసిన గుడ్డు పొరమీద టిష్యూలను ఉంచాలి. 30 నిమిషాలపాటు భాగా ఆరానిచ్చిన తరువాత, చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ప్రతిరోజూ పడుకునే ముందు ఈ విధంగా చేయడం వల్ల మీరు బ్లాక్ హెడ్స్ నుంచి త్వరగా బయటపడగలరు.

4. పసుపు పొడి :-

4. పసుపు పొడి :-

పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు బ్లాక్ హెడ్స్ నివారణకు బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇదే గాయాలను తొలగించి, చర్మ కాంతిని మెరుగు పరచడంలో కూడా సహాయపడుతుంది.

పైన చెప్పిన ఫలితాలను పొందడం కోసం మీరు 1 టేబుల్ స్పూన్ పసుపు పొడిని తీసుకొని, దానికి 1 టేబుల్ స్పూన్ల పుదీనా రసాన్ని కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖంపైన అప్లైచేసి, 15-20 నిమిషాల వరకు ఉంచిన తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. ప్రతిరోజూ పడుకునే ముందు ఇదే ప్రక్రియను కొనసాగిస్తూ ఉండాలి.

5. రోజు వాటర్ :-

5. రోజు వాటర్ :-

ఈ రోజు వాటర్ మూసుకుపోయిన చర్మ రంద్రాలను తెరచుకొనేలా చేయడంలో సహాయపడుతుంది. చర్మం pH స్థాయిని సమతుల్యం చేస్తూ, సరైన రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది.

చిట్కా :

1 టేబుల్ స్పూన్ రోజ్వాటర్కు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని మిక్స్ చేసి, బాగా కలపాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని దూది సహాయంతో ప్రభావితమైన చర్మ ప్రాంతాల్లో దరఖాస్తు చేసి 10 - 12 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. సత్వరమైన ఫలితాలను పొందడం కోసం మీరు ప్రతిరోజు తప్పకుండా ఈ చిట్కాను పాటించాలి.

6. షుగర్ స్క్రబ్ :-

6. షుగర్ స్క్రబ్ :-

ఇది చనిపోయిన చర్మకణాలను తొలగించడానికి, తెల్లని పొరల రూపంలో ఉన్న పొడి చర్మాన్ని నివారించడానికి బాగా సహాయపడుతుంది.

చిట్కా :

1 స్పూను చక్కెర & తేనెలను తీసుకుని బాగా కలపాలి. దానికి అదనంగా కొన్ని చుక్కల నిమ్మరసాన్ని జోడించవచ్చు. ఇలా తయారైన మిశ్రమాన్ని వృత్తాకార కదలికలో నెమ్మదిగా రుద్దుతూ మీ ముఖంపై అప్లై చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖంపై బాగా ఆరనిచ్చిన తరువాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగాలి. వారానికి 1-2 సార్లు ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలను పొందగలరు.

7. అలోవెరా :-

7. అలోవెరా :-

వీటిలో క్లీన్సింగ్ లక్షణాలు గొప్పగా ఉండటం వల్ల మీ చర్మంపై ఉన్న బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. అలోవెరా మీ చర్మంపై సహజ తేమను ఉంచి, అన్నివేళలా మీ చర్మాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది.

చిట్కా :

కలబంద ఆకుల నుంచి సేకరించిన గుజ్జును 1 టేబుల్ స్పూన్ మోతాదులో సేకరించాలి. ఈ గుజ్జును మెత్తని పేస్ట్లా చేసుకుని, దానికి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని చేర్చి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉన్న చర్మ ప్రాంతంలో 3-4 నిముషాల పాటు మసాజ్ చేస్తూ అప్లై చేయాలి. అలా అప్లై చేసిన 10 నిమిషాలపాటు బాగా ఆరానిచ్చిన తర్వాత, చల్ల నీటితో మీ ముఖాన్ని పరిశుభ్రం చేసుకోవాలి. బ్లాక్ హెడ్స్ ను నివారించేందుకు ఈ చిట్కాలను వారంలో 3 సార్లు ప్రయత్నించి చూడండి.

English summary

How To Remove Blackheads Overnight

Blackheads is a very common skin issue faced by most of us out there. Blackheads occur when dead skin cells and dirt collect in our pores and are left unclean. You can easily treat blackheads sitting back at home with simple home remedies. Some ingredients like turmeric, help you in getting rid of blackheads overnight if used regularly.
Story first published: Monday, May 7, 2018, 19:00 [IST]