For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పెర్ఫ్యూమ్ వాడకుండా రోజంతా మంచి సువాసనను కలిగి ఉండటం ఎలా?

  |

  ఒకరి నుండి వచ్చే చెడు వాసన (దుర్గంధం) గురించి ఇతరులు చెప్పే విధంగా, వారి రోజు మొదలు కావాలని ఎవరూ కోరుకోరూ. అవును, ఒక వ్యక్తి శరీరం నుండి వచ్చే దుర్వాసన, వారి గూర్చి వెనకాల అసంతృప్తిగా మాట్లాడేలా చేయడమే కాకుండా, ఇతరుల నుండి దూరంగా ఉంచేలా కూడా చేస్తుంది.

  అలా ఉండటానికి బదులుగా, అతను / ఆమె రోజంతా మంచి వాసనను కలిగి ఉండడానికి అనుసరించవలసిన ఇతర పద్ధతులను తప్పక చేపడతారు.

  how to smell good

  అలా మీరు, ఈ సమస్యను ఎలా అధిగమించాలో అని అడిగితే గనుక, ఈ ప్రశ్నకు సమాధానం అనేది చాలా సులభమైనదని మేము చెబుతాం !

  మీ శరీరము నుండి వెలువడే చెడు వాసనను అధిగమించటానికి మీ మదిలో మెదిలిన ఆలోచనలో పెర్ఫ్యూమ్స్ / డియోడరెంట్స్ అనేవి చాలా ప్రధానమైనవిగా కనబడతాయి. అయితే ఇవి కేవలం వాసనను కలిగి ఉండే మాస్క్ లాంటిదే తప్ప, రోజంతా పూర్తిగా సువాసనను కలిగి ఉండలేవు.

  సుత్తి లేకుండా నేరుగా అసలు విషయానికి వస్తే, ఈ రోజు మేము పెర్ఫ్యూమ్స్ / డియోడరెంట్స్ వంటి వాటిని వాడకుండానే, మీ శరీరం నుండి మంచి సువాసనను వెదజల్లే టటువంటి కాస్మెటిక్ ప్రోడక్ట్స్ యొక్క జాబితాలను పంచుకోవాలని అనుకుంటున్నాము.

  ఈ కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్ను, అనగా పెర్ఫ్యూమ్స్ / డియోడరెంట్స్ వంటివి కాకుండా, మంచి సువాసనను కోరుకునే స్త్రీ పురుషులిద్దరి చేత వాడబడే ఇతర ప్రొడక్టులను గూర్చి బాగా తెలుసుకుందాము. ఈ విధంగా మీరు శరీరం నుంచి వచ్చే చెడంచి వచ్చే చెడు వాసనను దూరంగా తరిమేయవచ్చు.

  1. బాడీ బటర్ :

  1. బాడీ బటర్ :

  మీ చర్మ సంరక్షణ కోసం వాడే బ్రాండ్లలో ఇవి సాధారణంగా కనిపించకపోవచ్చు. మీ శరీరం నుండి మంచి సువాసన గుబాళించేలా చేయడానికి దీనిని మీ ఖాతాలోకి చేర్చుకోవచ్చు. ఈ బాడీ బటర్ అనేది కీరదోస, స్ట్రాబెరీ, క్షయ వంటి రుచులలో మనకు లభ్యమవుతాయి, మరియు ఇవి దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగి ఉంటున్నాయి.

  2. బాడీ క్రీమ్ / లోషన్ / మాయిశ్చరైజర్ :

  2. బాడీ క్రీమ్ / లోషన్ / మాయిశ్చరైజర్ :

  ఇవన్నీ కూడా పెర్ఫ్యూమ్కు ప్రత్యామ్నాయం వంటివి. వీటిలో బాడీ క్రీమ్ను శీతాకాలంలో మగవారు ఎక్కువగా వినియోగిస్తారు. వేసవి కాలంలో, మంచి సువాసన కోసం మీ శరీరానికి తగ్గ మాయిశ్చరైజర్ (లేదా) బాడీ లోషన్ను ఉపయోగించవచ్చు. వాటి యొక్క ప్రభావం మీ శరీరతత్వం మీద ఆధారపడి ఉంటుంది.

  3. బాడీ-వాష్ (లేదా) సోపు :

  3. బాడీ-వాష్ (లేదా) సోపు :

  మీరు స్నానం చేసే సమయంలో ఉపయోగించే మీ బాడీ-వాష్ (లేదా) సబ్బు యొక్క గుణం మీద, మంచి సువాసన అనేది ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది. మీ శరీరానికి అనువైన బాడీ-వాష్ (లేదా) సోపులతో ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల మీ శరీర వాసనలో ఆరోగ్యకరమైన మార్పును తీసుకువచ్చే ప్రయత్నాలు ఒకటని చెప్పవచ్చు.

  4. టోనర్ :

  4. టోనర్ :

  ముఖానికి మాత్రమే అప్లై చేసే ఈ టొన్నర్లు కూడా ఒక మంచి సువాసనను అందజేస్తాయి. మీ ముఖ సౌందర్యాన్ని పెంపొందించడమే కాకుండా, మంచి సువాసనను అందించేదిగా కూడా ఉంటుంది ! టొన్నర్లు వివిధ ఫ్లావర్స్లో లభిస్తాయి అందువల్ల, మీరు ఒక కొత్త సువాసనను కలిగిన కొత్త టోనర్ను కొంటూ ప్రయోగాలు చేయవచ్చు. ఒక టోనర్ను కొనేటప్పుడు, ఎల్లప్పుడు ఫ్రూట్ ఫ్లేవర్ను తీసుకోవడానికి ప్రయత్నించండి.

  5. సెంటెడ్ నెయిల్ పోలిష్ :

  5. సెంటెడ్ నెయిల్ పోలిష్ :

  మీరు మీ చేతుల నుండి సువాసనను పొందటం కోసం, సెంటెడ్ నెయిల్ పోలిష్లను వాడవచ్చు. సువాసన భరితమైన నెయిల్ పోలిష్లు సాధారణమైన వాటిలా కాకుండా, మరింత మంచి సువాసనను కలిగి ఉంటుంది. దాని నుండి వచ్చే సువాసన ఒక రోజులో పోయేది మాత్రం కాదు. మీ చేతి గోళ్లకు పూసుకున్న నెయిల్ పోలిష్ పూర్తిగా ఊడిపోయేంతవరకూ దానియొక్క పరిమళం వెదజల్లబడుతూనే ఉంటుంది.

  6. పెర్ఫ్యూమ్ సాచెట్ను వాడండి :

  6. పెర్ఫ్యూమ్ సాచెట్ను వాడండి :

  మంచి సువాసన అనేది కేవలం శరీరానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. మీరు మీ శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, చక్కని వార్డ్రోబ్ (బట్టలను నిల్వ చేసే పెట్టే) ను బాగా నిర్వహించినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. బట్టలు నుండి అండర్ గార్మెంట్స్ వరకు, ప్రతిదీ మంచి వాసనను కలిగి, పరిశుభ్రంగా ఉండాలి. మీరు ధరించే బట్టల నుండి మంచి సువాసన రావడానికి, మీరు మీ వార్డ్రోబ్లో పెర్ఫ్యూమ్ సాచెట్ను ఉంచవచ్చు, అది ఎలాంటి చెడు వాసనలకు అవకాశాలు లేకుండా చేస్తుంది.

  7. హెయిర్-స్ప్రే ను వాడండి :

  7. హెయిర్-స్ప్రే ను వాడండి :

  ఇప్పటివరకు మీ శరీరం నుండి మంచి సువాసన రావడానికి చాలానే చేశారు, మరి మీ జుట్టు సంగతేమిటి ? అవును, జుట్టుకి ఉపయోగించే షాంపూలు మరియు కండిషనర్లు మీ జుట్టుకు మంచి సువాసనను తీసుకువస్తాయి, కాని మీరు వాటిని ప్రతిరోజూ ఉపయోగించలేరు. వాటికి ప్రత్యామ్నాయంగా, హెయిర్ స్ప్రేని ఉపయోగించడమును ప్రారంభించండి. హెయిర్ స్ప్రే అనేది మీ జుట్టుకు వెంటనే సువాసనను కలిగిస్తుంది, ప్రత్యేకించి వ్యాయామము చేసేటప్పుడు (లేదా) తీవ్రమైన పనిదినములలో మీరు పార్టీకి (లేదా) ఏదైనా కార్యక్రమం కోసం బయటకు వెళ్లడానికి ముందు దీనిని వాడటం చాలా మంచిది.

  English summary

  How To Smell Good | Smelling Good All Day | Cosmetics To Smell Good | Tricks To Smell Good

  The sleep pattern of the body requires consistency and if you are physically tired but mentally wired while going to bed, it can cause drowsiness again the very next day. These are the things you shouldn't do when you are tired, which includes drinking wine before going to bed, eating midnight snacks, performing energetic exercises, drinking lots of coffee, etc.
  Story first published: Monday, February 26, 2018, 12:03 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more