For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మాన్ని మెరిపింపచేయడానికి శనగపిండిని ఏ విధంగా ఉపయోగించాలి?

చర్మాన్ని మెరిపింపచేయడానికి శనగపిండిని ఏ విధంగా ఉపయోగించాలి?

|

ప్రకాశవంతమైన చర్మం పొందేందుకు, మృతచర్మకణాలు తొలగించడం మరియు పునరుజ్జీవింప చేయడం అవసరం. దీని కొరకు, మనం మార్కెట్లో అందుబాటులో ఉన్న క్రీములు, లోషన్లు, ప్యాకులు వంటి ఉత్పత్తులతో రకరకాల ప్రయోగాలు చేస్తాము. కానీ సహజ పదార్థాలతో పోలిస్తే ఈ ఉత్పత్తులు చాలా దుష్ప్రభావాలు కలిగి ఉంటాయి.

కనుక మీ కొరకు మేము ఇప్పుడు కొన్ని శనగ పిండితో చేపట్టగలిగే చర్మ సంరక్షణ విధానాలను తెలియ చేయబోతున్నాము. ఇవి చర్మం ప్రకాశవంతమైన మెరుపును సొంతం చేసుకోవడానికి సహాయపడతాయి.

How to Use Gram Flour (Besan) for Skin Whitening?

ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవడానికి శనగ పిండి ఏ విధంగా పని చేస్తుంది?

దక్షిణ భారతదేశంలో బేసన్ గా పిలువబడే శనగ పిండి, సాధారణంగా మన వంటగదిలో ఎప్పుడూ ఉండే పదార్ధాలలో ఒకటి. ఇది ఆహార పదార్ధం వలెనే కాక, చర్మంపై కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. శనగపిండి చర్మపు pH ను సమతులం చేసి, పిగ్మెంటేషన్, మచ్చలను తొలగించి, ముఖమంతటా సమాన ఛాయను పొందేందుకు సహాయపడుతుంది. మృతచర్మ కణాలను తొలగించి వేయడంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. సూర్యుని ప్రభావం వలన ఏర్పడిన ట్యాన్ ను తొలగించి చర్మం కాంతివంతంగా మెరిసేటట్టు చేస్తుంది. ప్రకాశవంతమైన చర్మం పొందడానికి శనగపిండిని మాస్కుల రూపంలో ఉపయోగించవచ్చు. దీనిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం!

1. శనగ పిండి మరియు పెరుగు:

1. శనగ పిండి మరియు పెరుగు:

ఎలా వాడాలి?

ఈ మాస్కును ఉపయోగించడం వలన ట్యాన్ తొలగి, చర్మం కాంతివంతంగా తయారు అవుతుంది. ఈ ప్యాక్ తయారీ కొరకు అన్ని 1 టేబుల్ స్పూన్ శనగ పిండి మరియు కొంచెం పెరుగు అవసరమవుతాయి. రెండు పదార్ధాలను కలపి పేస్ట్ లా చేయండి. చిక్కని పేస్ట్ గా తయారు చేయడానికి తగినంత పెరుగుని కలపండి. ముఖం కడుక్కున్నాక దీనిని రాసుకోండి. ఆపై దానిని ఆరిపోయే వరకు వదిలివేసి, ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

2. శనగ పిండి మరియు పచ్చి పాలు :

2. శనగ పిండి మరియు పచ్చి పాలు :

ఎలా వాడాలి?

మీరు పొడి చర్మం కలిగి ఉన్నవారైతే, ఈ మాస్కు మీకు సహాయపడుతుంది. పొడి చర్మం సమస్యను పరిష్కరించడమే కాక, చర్మానికి పోషణ అందించి మేనిఛాయను కూడా మెరుగుపరుస్తుంది. శనగ పిండి, పాలు కలిపి మీ ముఖం మీద ఒక పొరలా రాసుకోండి. దీనిని 15-20 నిముషాల పాటు ఆరనివ్వండి.తరువాత సాధారణ నీటితో కడిగేయండి.

3. శనగ పిండి మరియు టమోటా రసం:

3. శనగ పిండి మరియు టమోటా రసం:

ఎలా వాడాలి?

ఈ ప్యాక్ మీ ముఖం మీద ఏ విధమైన పిగ్మెంటేషన్, మచ్చలు లేదా గాట్లు ఉన్నా తొలగించడంలో బాగా పనిచేస్తుంది. ఒక మధ్యస్థ పరిమాణంలో ఉన్న టమోటాని కట్ చేసి, దాని బ్లెండర్ లో వేసి పేస్ట్ చేయండి. 2-3 టీస్పూన్ల టమోటా పేస్ట్ ను శనగపిండిలో వేసి ఉండలుగా ఏర్పడకుండా బాగా కలపండి.

ఇప్పుడు మీ ముఖం మరియు మెడను శుభ్రం చేసుకుని, ఈ పేస్ట్ ను రాసుకోండి. 20 నిముషాల పాటు ఆరనిచ్చి సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి.

4. శనగ పిండి మరియు నిమ్మరసం:

4. శనగ పిండి మరియు నిమ్మరసం:

ఎలా వాడాలి?

ఈ ప్యాక్ ను సాధారణంగా మనలో చాలా మంది చర్మం ప్రకాశవంతంగా మరియు ఆరోగ్యంగా తయారు చేసుకోవడానికి వాడతారు. శనగ పిండి చర్మానికి పోషణ అందిస్తుంది. నిమ్మకాయలో ఉన్న విటమిన్ సి చర్మాన్ని మృతచర్మకణాలను తొలగించి, మేనిఛాయను మెరుగుపరిచడంలో సహాయపడుతుంది.

1 టేబుల్ స్పూన్ శనగ పిండిలో తాజా నిమ్మ రసం కొన్ని చుక్కలను వేసి, రెండు పదార్ధాలను బాగా కలపండి. మీ ముఖం మీద దీనిని రాసుకుని మరియు 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

5. శనగ పిండి, పాలు మరియు పసుపు

5. శనగ పిండి, పాలు మరియు పసుపు

ఎలా వాడాలి?

ఈ పదార్థాల కలయిక, చర్మంపై ఉన్న మొటిమలు మరియు మచ్చలను నివారించడంలో తోడ్పడుతుంది. అంతేకాక, పసుపు మరియు పాలుతో పాటు చర్మానికి అవసరమైన పోషణను అందించి మేనిఛాయను మెరుగుపరుస్తుంది.

1 టేబుల్ స్పూన్ శనగ పిండి, కొన్ని చుక్కలు పచ్చి పాలు మరియు పసుపును ఉండలు ఏర్పడకుండా బాగా కలపాలి. మీ ముఖం మీద సమానమైన పొరగా ఈ ప్యాక్ ను రాసుకుని, 15 నిముషాల పాటు ఆరనిచ్చి, తరువాత సాధారణ నీటితో కడిగేయండి.

English summary

How to Use Gram Flour (Besan) for Skin Whitening?

Rejuvenation and exfoliation is necessary to attain a glowing skin. Gram flour helps in maintaining the pH balance of the skin and helps in combating issues like pigmentation, blemishes and evening out the skin tone. It also has its role in removing sun tans and removing dead skin cells thus helping in brightening and rejuvenating the skin.
Story first published:Wednesday, August 1, 2018, 17:19 [IST]
Desktop Bottom Promotion