For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పై పెదవిపై ఉన్న జుట్టును తొలగించడానికి సహజ మార్గాలు

By Gandiva Prasad Naraparaju
|

పైపెదవి పై జుట్టు పెరగడం అనేది సాధారణంగా సంభవించే విషయం, వాక్సింగ్, త్రేడింగ్ వంటి వివిధ పద్ధతుల సహాయంతో వీటిని తొలగించవచ్చు.

అయితే, ఈ పద్ధతుల వల్ల కొద్దిగా బాధకలుగుతుంది, అంతేకాకుండా బైటికి అసహ్యంగా కూడా కనిపి౦చవచ్చు.

అదృష్టవశాత్తూ, పైపెదవిపై ఉన్న జుట్టును కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులు ఉపయోగించి కూడా తొలగించవచ్చు. నేడు, బోల్డ్ స్కై, పైపెదవిపై ఉన్న జుట్టును తొలగించడానికి సహాయపడే పద్ధతుల గురించి మీకు తెలియచేస్తున్నారు.

Natural Ways To Remove Upper Lip Hair

ఈ పద్ధతులు 100% సహజమైన, సురక్షితమైనవే కాకుండా చవకైనవి, తక్కువ బాధాకరమైనవి, చేయడానికి సులభమైనవి, ఎక్కువ ప్రభావవంతమైనవి కూడా.

నొప్పి లేకుండా, అత్యంత ప్రభావవంతంగా పైపెదవిపై ఉన్న జుట్టును తొలగించడానికి వీటిని ప్రయత్నించండి. ఇక్కడ ఇచ్చిన సహజ పద్ధతులపై దృష్టి పెట్టండి:

గమనిక: ఈ కింద ఇచ్చిన మిశ్రమాలను మీ ముఖంపై అప్లై చేసే ముందు మీ చర్మంపై పాచ్ లా వేసి పరీక్షించాలని సిఫార్సుచేయబడింది.

1.కోడిగుడ్డు తెల్లసొన

1.కోడిగుడ్డు తెల్లసొన

-మీ పైపెదవిని శుభ్రంగా కడిగి, దానిపై కోడిగుడ్డు తెల్లసొనను ఒక పొరలాగా రాయండి.

-ఆ పదార్ధాన్ని తొలగించే ముందు 15-20 నిమిషాల పాటు ఆరనివ్వడం మంచిది.

-గోరువెచ్చని నీటితో శుభ్రంచేసి, దానిపై కలబంద రసాన్ని అప్లై చేయండి.

-పైపెదవిపై ఉన్న జుట్టును తొలగించడానికి ఈ పద్ధతిని వారానికి రెండుసార్లు పాటించండి.

పంచదారతో నిమ్మరసం

పంచదారతో నిమ్మరసం

-1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ పంచదారతో ఒక మిశ్రమాన్ని తయారుచేయండి.

-ఫలితాన్నిచ్చే ఈ మిశ్రమాన్ని పైపెదవిపై అప్లై చేసి, షుమారు 15-20 నిమిషాలపాటు వదిలేయండి.

-ఆ పొరను తొలగించి, గోరువెచ్చని నీటితో చర్మాన్ని కడిగేయండి.

-ఆరాక, కొద్దిగా రోజ్ వాటర్ అప్లై చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.

- ఈ పద్ధతిని వారానికి రెండుసార్లు అనుసరించి పైపెదవిపై జుట్టును తొలగించుకోండి.

బంగాళదుంప రసంతో మైదాపిండి

బంగాళదుంప రసంతో మైదాపిండి

-1 టీస్పూన్ బంగాళదుంప రసంతో ½ టీస్పూన్ మైదాను కలపండి.

-పైపెదవిపై ఈ ఫలితాన్నిచ్చే మిశ్రమాన్ని సమానంగా రాయండి.

-దీన్ని తొలగించేముందు దాదాపు 15-20 నిమిషాల పాటు వదిలేయండి.

-గోరువెచ్చని నీటితో చర్మాన్ని కడిగేయండి.

-పైపెదవిపై ఉన్న జుట్టును తొలగించడానికి ఈ పద్ధతిని కానీసం వారానికి రెండుసార్లు ప్రయత్నించండి.

పాలతో పసుపు

పాలతో పసుపు

-ఒక గాజు బౌల్ తీసుకుని, ½ టీస్పూన్ పసుపు, 2 టీస్పూన్ పచ్చిపాలు కలపండి.

-కొంతసేపు ఆ పదార్ధాలను బాగా కలిపి ఆ మిశ్రమాన్ని మీ పైపెదవిపై రాయండి.

-15-20 నిమిషాల తరువాత, ఈ మిశ్రమాన్ని తొలగించి, గోరువెచ్చని నీటితో చర్మాన్ని కడిగేయండి.

-కొద్దిసేపు ఆరనిచ్చి, సున్నితమైన ప్రభావం కోసం కొద్దిగా రోజ్ వాటర్ ని అప్లై చేయండి.

-ఇంట్లో తయారుచేసిన ఈ మిశ్రమాన్ని వారానికి ఒకసారి అప్లై చేసి మీపైపెదవిపై ఉన్న జుట్టును తొలగించుకోండి.

శనగపిండి తో తేనె

శనగపిండి తో తేనె

-1/2 టీస్పూన్ శనగపిండితో 2 టీస్పూన్ల తేనెను కలపండి.

-ఒక ఐసు పుల్లను ఉపయోగించి ఈ మిశ్రమాన్ని పైపెదవిపై అప్లై చేయండి.

-మిశ్రమాన్ని తొలగించే ముందు 20 నిమిషాల పాటు ఆరనివ్వండి.

-గోరువెచ్చని నీటితో చర్మాన్ని శుభ్రంచేసి, రోజ్ వాటర్ అప్లై చేసే ముందు కాసేపు ఆరనివ్వండి.

-పైపెదవిపై జుట్టును తొలగించడానికి ఈ సహజ జుట్టు తొలగించే మిశ్రమాన్ని వారానికి రెండుసార్లు వాడండి.

ఉల్లిపాయ రసంతో కార్న్ ఫ్లోర్

ఉల్లిపాయ రసంతో కార్న్ ఫ్లోర్

-ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని, అందులో 1 టీస్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టీస్పూన్ల ఉల్లిపాయరసం కలపండి.

-ఈ మిశ్రమాలను బాగా కలిసేదాకా కలపండి.

-ఈ మిశ్రమాన్ని పైపెదవిపై రాసి, 15-20 నిమిషాల పాటు వదిలేయండి.

-ఆ మిశ్రమాన్ని సున్నితంగా తీసేసి, గోరువెచ్చని నీటితో మీ చర్మాన్ని కడగండి.

-తరువాత పైపెదవిపై కలబంద రసాన్ని రాయండి.

-అన్ని సహజ మిశ్రమాలతో కూడిన ఈ పదార్ధాన్ని వారానికి రెండుసార్లు రాసి పైపెదవిపై ఉన్న జుట్టును తొలగించుకో౦డి.

బియ్యంపిండి తో పెరుగు

బియ్యంపిండి తో పెరుగు

-1టీస్పూన్ బియ్యంపిండి, తాజా పెరుగు కలపండి.

-ఫలితాన్నిచ్చే ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రదేశంపై సమానంగా రాయండి, అలా 15 నిమిషాల పాటు ఉంచండి.

-ఈ మిశ్రమాన్ని తీసేసి, గోరువెచ్చని నీటితో మీ చర్మాన్ని శుభ్రంచేసుకోండి.

-కొద్దిగా ఆరనిచ్చి, కొంచెం కలబంద జెల్ ని రాయండి.

-అద్భుతమైన ఫలితాల కోసం ఇంట్లో తయారుచేసిన ఈపదార్ధాన్ని వారానికి 2-3సార్లు ఉపయోగించండి.

English summary

Natural Ways To Remove Upper Lip Hair

There are alternative methods that can be used for eliminating hair from the upper lip area. Today, at Boldsky, we're letting you know about these methods that can help you get rid of upper lip hair.
Story first published:Monday, January 29, 2018, 15:00 [IST]
Desktop Bottom Promotion