For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో చర్మ సంరక్షణకోసం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు !

|

సెలవులు వస్తున్నాయంటే అనేకమంది చాలా రకాల ప్లాన్స్ వేసుకుంటారు, అందులోనూ వేసవి సెలవులు వస్తున్నాయంటే కొన్ని నెలల ముందు నుంచే ప్రత్యేకమైన ప్రణాళికలను తప్పక సిద్ధం చేసుకుంటారు. అయితే, ఈ వేసవి సెలవులు తెచ్చే ఆనందంతోపాటు, మీ చర్మ సౌందర్యానికి నష్టాన్ని (లేదా) విఘాతం కలిగించే పరిస్థితులు కూడా ఎక్కువగా ఉండటంవల్ల మీరు కొన్ని ప్రత్యేక చర్యలను పాటించడం వల్ల మీ చర్మ సౌందర్యాన్ని సహజసిద్ధంగా కాపాడుకోగలుగుతారు.

మీ చర్మ సౌందర్యాన్ని సహజసిద్ధంగా, ప్రకాశవంతంగా సంరక్షించేందుకు అవసరమైన ఉత్తమ ఆహార పదార్ధాల గురించి తెలుసుకోవడానికి ఈ క్రింది తెలియజేసిన విషయాలను చదవండి.

Take Care Of Your Skin This Summer Like A Pro!

చర్మ సౌందర్య ఉత్పత్తుల ప్రచారాలు & మార్కెట్లలో విక్రయించడం వంటివి ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, వాటివల్ల జరిగే మేలు చాలా తక్కువ అన్నది పచ్చి నిజం. అలా మార్కెట్లో లభించే సౌందర్య సాధనాలలో ఉన్న ప్రిజర్వేటివ్స్ ఆ ఉత్పత్తులను ఎక్కువకాలం నిల్వ ఉండేలా చేస్తాయి అని మనందరికీ బాగా తెలుసు.

మన బామ్మలు కాలం నాటి నుంచి నేటివరకు చర్మ సౌందర్యంకోసం ఉపయోగించబడుతున్న ముఖ్యమైన ఆయిల్స్ మంచి ఫలితాలను అందజేయగలవనే వాస్తవాన్ని మనము పూర్తిగా నమ్మలేం. గత కొన్ని శతాబ్దాల నుండి ఇంట్లోనే తయారుచేసుకునే క్రీములు, లేపనాలు వంటివి మీ చర్మాన్ని కాంతివంతంగా ఉంచగలవనే నిజాన్ని మనము నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఎందుకంటే ఇవి మన చర్మానికి సహజమైన కాంతిని చేకూర్చడమే కాకుండా మచ్చలేని ప్రకాశవంతమైన చర్మం కోసం ఖచ్చితంగా మార్గనిర్దేశం చేస్తుంది.

రైతుల చేత నేరుగా పండించబడిన కూరగాయలు & పండ్లను అమ్మే స్థానిక దుకాణాల వద్ద వాటిని కొనుగోలు చేయడం ఎల్లప్పుడూ మంచిది. చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించే ఆహార వస్తువులను వినియోగించేటప్పుడు స్థానికంగా రైతులచేత సరఫరా చేయబడుతున్న పండ్లను & కూరగాయలను కొనుగోలు చేయడం చాలా మంచిది. చర్మ సౌందర్యం ఎల్లప్పుడూ ఒకేలా ఉండటం కోసం, ఫాన్సీ స్టోర్ల వద్ద లభించే ప్యాకేజింగ్ పుడ్ను, ఇతర జంక్ ఫుడ్స్ను వినియోగించడాన్ని తక్షణమే ఆపివేయాలి.

మీ చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించే ఆహారపదార్థాలను రుచికరంగా ఉండటానికి మీరు మాస్టర్ చెఫ్గా పని చేయవలసిన అవసరం లేదు. అయితే, సరైన విధానంలో ఈ ఆహార పదార్ధాలను ఎలా రుచికరంగా తయారు చేసుకోవాలో కొంచెం తెలుసుకోవాలి.

మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో మీ చర్మ సంరక్షణను ప్రారంభించే ముందు, కొత్త ఆహార నియమాలు సానుకూలమైన ఫలితాలుగా చూపించడానికి కొన్ని నెలల సమయం పడుతుందని తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే మన శరీరం వెలుపల ఉన్న చర్మకణాలు బాగా ఉత్పత్తి చెంది సరైన క్రమంలో అవన్నీ ఒక చోటకు చేరుకుని శరీరంపై కొత్త పొరగా పెరగడానికి కొన్ని నెలల సమయం పడుతుందనేదే దాని ప్రధాన కారణం.

మీకు సహజసిద్ధమైన, ప్రకాశవంతమైన చర్మం పొందడానికి సహాయపడే కొన్ని చర్మ సంరక్షణ ఆహార పదార్థాల గురించి మరింతగా తెలుసుకోండి.

ఈ కింద తెలిపిన ఆహారపదార్థాలను రోజులో కనీసం ఒక్కసారైనా తినడానికి ప్రయత్నించండి.

ఉదయం వేళలో నిమ్మరసం :

ఉదయం వేళలో నిమ్మరసం :

నిమ్మరసం అనేక రకాల ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఒక గ్లాసు వేడినీటిలో, సగం కోసిన నిమ్మచెక్క రసాన్ని జోడించండి. ఈ పానీయానికి అల్లం పొడిని (లేదా) కొన్ని తాజా పుదీనా ఆకులను చల్లుకోవచ్చు. నిద్రలేచిన కొన్ని నిమిషాల తరువాత ఈ పని ఉదయాన్నే తాగండి. ఇది మీ శరీరంలో ఉన్న మలినాలను బయటకు పంపించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ నిమ్మరసాన్ని తీసుకున్న అరగంట తర్వాత అల్పాహారం తినండి.

ఎక్కువగా నీరు త్రాగడం :

ఎక్కువగా నీరు త్రాగడం :

2 లీటర్ల నీటిని రోజువారీగా తీసుకోవడం వల్ల మీ చర్మం బాగా హైడ్రేట్గా ఉంచుతుంది. నీళ్ళు తాగడానికి దాహం కలిగి ఉండాలన్న నిబంధన ఏదీ లేదు. వేసవిలోనే కాదుగాని, శీతాకాలంలో కూడా మీరు ఈ విషయాన్ని మనసులో గుర్తుంచుకోండి.

 బాదమును వినియోగించడం :

బాదమును వినియోగించడం :

గుండె & మెదడు ఆరోగ్యంతో పాటు ఆరోగ్యకరమైన చర్మాన్ని పెంపొందించడంలో సహాయపడే మోనోఅన్సాచురేటెడ్ కొవ్వులను బాదం కలిగి ఉంటాయి. బాదంలో ఉండే విటమిన్-E ఒక గొప్ప యాంటీఆక్సిడెంట్గా ఉంటూ మీ చర్మాన్ని మరమ్మత్తు చేస్తుంది & మీ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. ప్రయాణాలు చేసేవారికి ఈ బాదం చిరుతిండిగా కూడా పనిచేస్తుంది.

చర్మ సౌందర్యానికి - కొబ్బరి :

చర్మ సౌందర్యానికి - కొబ్బరి :

కొబ్బరినూనెతో వంటకాలు చేయడం (లేదా) మీ చర్మంపై అప్లై చేయడం వల్ల, అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరిలో ట్రైగ్లిజరైడ్స్ అని పిలవబడే కొవ్వులు ఉండటం వల్ల, కొబ్బరినూనెను చాలా తేలికగా జీర్ణం కాబడుతుంది, అలాగే మీ జీవక్రియను వేగవంతం చేయడంలో కూడా సహాయపడుతుంది. మీరు వివిధ వంటలలో కొబ్బరిగుజ్జును కలపవచ్చు. ఇది మీరు సిద్ధం చేసే వంటకాలలో రుచిని బాగా పెంచుతుంది. అలాగే కొబ్బరినీరు రీహైడ్రేటింగ్ లక్షణాలకు బాగా ప్రసిద్ధి చెందింది.

వేసవికాలంలో తినే మామిడి పండ్లు :

వేసవికాలంలో తినే మామిడి పండ్లు :

మామిడిలో "బీటా-కెరోటిన్" అనే కంటెంట్ను కలిగి ఉంది, మామిడిని తినేటప్పుడు ఆ కంటెంట్ను మన శరీరం విటమిన్-ఎ లోకి మారుస్తుంది & అందువల్ల మనకు స్పష్టమైన ఛాయను అందిస్తుంది. అలాగే వీటిలో విటమిన్-సి గొప్ప ఉండటం వల్ల, చర్మ కణాలను దెబ్బతీసే బాధ్యత స్వేచ్ఛా రాడికల్ ఉత్పత్తికి వ్యతిరేకంగా పోరాటంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. UV కిరణాలకు వ్యతిరేకంగా చర్మాన్ని రక్షించడానికి మామిడి విత్తనాల నుంచి చేసిన నూనెను ఉపయోగించవచ్చు.

మీ రోజువారీ ఆహారంలో పైన చెప్పిన ఆహారాలను చేర్చడం వల్ల, మీరు ఈ వేసవిలో ఆరోగ్యకరమైన, దోషరహితమైన & ప్రకాశించే చర్మాన్ని పొందగలుగుతారు.

English summary

Take Care Of Your Skin This Summer Like A Pro!

With the summer season comes a variety of plans, especially with the summer vacation around, you surely can't forget the holidays that you had been planning for the past few months. However, with the pleasures that the summer season brings, it is also accompanied with worries related to being able to maintain a good skin once you are back to your routine daily life.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more