For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు & స్కిన్ కోసం రైస్ వాటర్ను (గంజిని) ఎలా ఉపయోగించాలి?

|

కొన్ని దేశాలలో ప్రధాన ఆహారంగా వరి బియ్యం అత్యంత సాధారణంగా కనిపించే పదార్ధం. ఈ బియ్యం ఆరోగ్య ప్రయోజనాలనే కాకుండా, మీ శారీరక సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుందంటే మీరు ఆశ్చర్యపోతారు?

బియ్యం నీటిలో ఉండే అమైనో ఆమ్లాలు మరియు విటమిన్లు B, C & E వంటివి, మీ జుట్టు & చర్మానికి బాగా పనిచేస్తాయి. బియ్యాన్ని కడిగినప్పుడు (లేదా) ఉడకబెట్టినప్పుడు ఈ తెల్లటి ద్రావణాన్ని (గంజిని) పొందవచ్చు, మీరు ఈ ద్రావణాన్ని అనేక సౌందర్య సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించవచ్చు.

How To Use Rice Water For Hair And Skin?

బియ్యం కడిగిన నీటిలో అనగా గంజిలో ఉండే పిండి పదార్థం మీ జుట్టును మృదువుగా, ఆరోగ్యకరమైనదిగా చేయడంలో సహాయపడుతుంది. ఈ గంజి ప్రోటీన్లను & కార్బోహైడ్రేట్లను కూడా కలిగి ఉంటుంది, అది మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చెయ్యడమే కాకుండా, వృద్ధాప్యం దశలో ప్రారంభమయ్యే కొన్ని సంకేతాలను నిరోధిస్తుంది. కాబట్టి, ఇది మీ జుట్టు & చర్మానికి నిజంగా ఎలాంటి ప్రయోజనాన్ని చేకూరుస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం !

రైస్ వాటర్ను (గంజిని) ఎలా సిద్ధం చేయాలి ?

నీళ్ళతో బియ్యాన్ని కడగడం / ఉడకబెట్టడం ద్వారా వచ్చే తెల్లటి ద్రావణాన్నే గంజి అని అంటారు.

ఈ గంజి ద్వారా మీ జుట్టుకు & చర్మానికి కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

"జుట్టు కోసం" :-

పొడి జుట్టు కోసం :

గంజి, అనారోగ్యంగా ఉన్న మీ జుట్టును దృఢపరచి, మీ జుట్టు యొక్క స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. గంజిలో ఉన్న ప్రోటీన్లు మీ జుట్టుకు లోతైన కండీషనర్గా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది మీ జుట్టు చిక్కుబడటాన్ని కూడా నిరోధిస్తుంది.

ఇందుకోసం మీరు 3 వంతుల సాధారణ నీటికి, 1 వంతు గంజిని కలిపి ఉపయోగించండి. మీరు షాంపూతో తలస్నానం చేసిన తరువాత, ఈ గంజి ద్రావణాన్ని అప్లై చేయండి. మరిన్ని మెరుగైన ఫలితాల కోసం ఈ పద్ధతినే వారానికి 2-3 సార్లు చెప్పున ఆచరించండి.

ఆరోగ్యకరమైన జుట్టు కోసం :

ఆరోగ్యకరమైన జుట్టు కోసం :

గంజి ద్రావణంలో మీ జుట్టుకు మేలు చేసే ప్రోటీన్ను కలిగి ఉంది. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా, మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. ఈ గంజి ద్రావణంలో ఉన్న కార్బోహైడ్రేట్స్, దెబ్బతిన్న జుట్టును మృదువుగా చేసి, దానిని మరింత సులభంగా నిర్వహించుకునెలా చెయ్యడంలో మీకు సహాయపడుతుంది.

సాధారణమైన నీటికి, గంజి ద్రావణాన్ని కలపండి. షాంపూతో మీ జుట్టును శుభ్రపరచుకున్న తరువాత, గంజి నీళ్లతో ఒక 10 నిమిషాల పాటు మీ జుట్టును & మాడునూ నెమ్మదిగా మర్దన చేయండి.

ఆ తర్వాత సాధారణ నీటితో మీ జుట్టును శుభ్రపరచుకోండి. కావాలనుకుంటే మీరు లావెండర్ ఆయిల్, రోజ్మేరీ ఆయిల్ వంటి కొన్ని ముఖ్యమైన ఆయిల్స్ను యొక్క కొన్ని చుక్కలను చేర్చవచ్చు. మీరు ఒక వారంలో కనీసం 2-3 సార్లు ఈ చిట్కాను రిపీట్ చేయవచ్చు.

"చర్మం కోసం" :-

బిగుతైన చర్మరంద్రాల కోసం :

సాధారణంగా, ఆయిల్ స్కిన్ తో బాధపడే వారు బయటకు పెద్దగా తెరచుకొన్న చర్మ రంధ్రాల సమస్యను ఎదుర్కొంటారు. చర్మ రంధ్రాలు బయట వైపుకు తెరుచుకోవడం వల్ల మోటిమలు ఏర్పడటమే కాకుండా, చర్మం పగులుటకు కూడా దారితీస్తుంది. బయటవైపుకు పెద్దగా తెరుచుకున్న చర్మ రంధ్రాలను తగ్గించడంతో పాటు, చర్మపు pH బ్యాలెన్స్ను నిర్వహించడంలో గంజి బాగా సహాయపడుతుంది. గంజిలో ఉండే రక్తస్రావ నివారిణి లక్షణాలు మీ చర్మాన్ని మరింత బిగుతుగా చేయడంలో కూడా సహాయపడుతుంది.

1 కప్పు బియ్యాన్ని తీసుకొని, ఒక 1 కప్పు నీటిలో వేసి నానబెట్టండి. ఆ నీటిని వడకట్టి, ఒక స్ప్రే బాటిల్లో నిల్వ చేయండి. ఆ నీటిని మీ ముఖం మీద స్ప్రే చేస్తూ, ఒక దూది పింజ సహాయంతో మీ ముఖమంతటా అప్లై చేసి 15-20 నిముషాల పాటు వదిలివేయాలి. ఆ తరువాత, సాధారణ నీటితో మీ ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేయాలి. మెరుగైన ఫలితాల కోసం ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ చిట్కాను అనుసరించండి.

చర్మపు మంటలను నివారించడం కోసం :

చర్మపు మంటలను నివారించడం కోసం :

గజ్జి ద్రావణం, పిండి పదార్ధాలను కలిగి ఉంటుంది, ఇది ఎలాంటి చర్మ వాపునైనా & చికాకునైనా నివారించడంలో సహాయపడుతుంది.

ఇలాంటి చర్మం సమస్యను నివారించడానికి, వెచ్చని నీటిని కలిగి ఉన్న బాత్ టబ్లో కొద్దిగా గంజి ద్రావణాన్ని జోడించండి. ఆ బాత్ టబ్లో మీరు సుమారు 15-20 నిమిషాలు పాటు మునిగి ఉండండి.

మీరు చర్మం చికాకు కలిగి ఉన్న నిర్దిష్ట ప్రాంతాల్లో చల్లని గంజిని కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఆశించదగ్గ ఫలితాలను పొందే వరకు ఈ చిట్కాను రిపీట్ చేయండి.

కాంతివంతమైన చర్మం కోసం :

కాంతివంతమైన చర్మం కోసం :

చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో గంజి బాగా సహాయపడుతుంది, అలా ఇది మీ చర్మపు ఛాయను మెరుగుపరుస్తుంది. అంతేకాక మీ చర్మం నుండి ఇతర విష వ్యర్ధాలను తీసివేసి, మీ చర్మం తాలూకా స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది.

మొదటగా, సాధారణమైన నీటిలో తగినంత గంజిని కలపండి. అందులోకి దూది పింజను ముంచి, మీ ముఖం మీద అప్లై చేసుకోండి. అలా 10-15 నిముషాలు వేచి ఉన్న తర్వాత, మీ చర్మాన్ని వృత్తాకారంలో మృదువుగా కదిలిస్తూ, గోరువెచ్చని నీటితో మీ చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. వేగవంతమైన, మెరుగైన ఫలితాల కోసం ప్రతిరోజూ దీనిని పునరావృతం చేయండి.

English summary

How To Use Rice Water For Hair And Skin?

Rice being the staple food in some countries is the most common ingredient that can be found. The starch that rice water contains can help in making your hair softer and healthier than before. It also contains proteins and carbohydrates that can easily brighten your skin and prevent certain early signs of ageing.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more