For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పొడిగా ఉన్న చర్మం కోసం మీరేమి చేయాలి ?

  |

  శీతాకాలంలో చాలా మందికి చర్మం పొడిగా ఉంటుంది. కానీ కొంతమంది వ్యక్తులకు మాత్రం ఏడాది పొడవునా పొడి చర్మాన్నే కలిగి ఉంటారు, అలాంటి వారికి శీతాకాలంలో చెప్పలేనంత బాధను కలిగి ఉంటారు. వారి చర్మం శీతాకాలంలో మరింత పొడిగా మారుతుంది.

  చర్మమనేది పొరలుగా, పొడిగా ఉండటమనేది మంచిది కాదు. ఎందుకంటే ఇది ఒక ఆరోగ్య పరిస్థితిని గూర్చి తెలియజేయబడుతుంది, థైరాయిడ్ సమస్యలు (లేదా) రక్తహీనత వంటి పలు ఆరోగ్య పరిస్థితుల యొక్క లక్షణాలను గూర్చి తెలియజేస్తుంది, కనుక మీ చర్మం పొడిగా గాని ఉన్నట్లయితే పైన పేర్కొన్న వ్యాధుల నిర్ధారణ కోసం ఒకసారి డాక్టరు చేత పరీక్ష చేయించుకోండి.

  what to do when you have dry skin

  ఫ్లాకీ (పొరలుగా ఉన్న) చర్మం ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు, కానీ అది కనిపించేదానికన్నా చాలా దారుణమైనదిగా అనిపిస్తుంది. మరియు మీరు ఎన్ని ఫ్యాన్సీ మాయిశ్చరైజర్లను కొనుగోలు

  చేసి ఉపయోగించిన పెద్దగా ఆశించిన ఫలితం ఉండదు, అలాగే మీరు తరచుగా ఈ మాయిశ్చరైజర్లను ఉపయోగించడాన్ని కొనసాగించాలి. మరీ అధ్వానమైన పరిస్థితి ఏమిటంటే పొడి చర్మం చాలా గట్టిగా మరియు దురద వంటి అనుభూతిని కలిగి ఉంటుంది. మీకు అలా దురదగా అనిపించినప్పుడు ఎక్కువగా గోకడం వల్ల దద్దుర్లుగా మారవచ్చు, మరియు దాని నుండి రక్తం కూడా రావచ్చు.

  కాబట్టి, మీరు ఏడాది పొడవునా పొడి చర్మమును కలిగి ఉన్నట్లయితే, దాని యొక్క నివారణకు మీరు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. మీరు తీవ్రమైన పొడి చర్మమును కలిగి ఉంటే ఏమి చేయాలో ఇక్కడ మేము మీకు కొన్ని చిట్కాల ద్వారా సూచించాము. అవేమిటో మీరు కూడా చూడండి.

  1. చల్లని (లేదా) గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి :

  1. చల్లని (లేదా) గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి :

  శీతాకాలంలో వేడి నీళ్లతో స్నానం చేయటం వల్ల చాలా సౌకర్యంగా ఉంటుందని మనందరికీ తెలుసు, కానీ మీరు పొడి చర్మాన్ని కలిగివున్నప్పుడు వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల మీ చర్మం మరింత ఎక్కువగా నష్టపోతుంది. అలాంటప్పుడు మీ చర్మ రంధ్రాలను మూసివేయడానికి మరియు, మీరు స్నానం చేస్తున్నప్పుడు చర్మం తేమను కోల్పోకుండా ఉండటానికి చల్లని నీళ్లతో స్నానం చేయడం చాలా మంచిది. ఒకవేళ మీరు కచ్చితంగా వేడినీళ్లను వాడాలనుకుంటే, గోరువెచ్చని నీళ్లను ఉపయోగించండి. చల్లని నీళ్లతో స్నానం చేయటం వల్ల వృద్ధాప్య ఛాయల వల్ల కలిగే ముడతలను, మరియు గీతాలను ఆలస్యమయ్యేలా చేస్తుంది.

  2. సున్నితమైన బాడీ-వాష్ను ఉపయోగించండి :

  2. సున్నితమైన బాడీ-వాష్ను ఉపయోగించండి :

  సువాసన భరితమైన బాడీ-సోప్స్ మరియు బాడీ-వాష్లు మీ పొడి చర్మానికి మరింత హానికరం. సుగంధరహితము (లేదా) తేలికైన సువాసనలను కలిగిన మాయిశ్చరైజింగ్ బాడీ-సోప్ను ఉపయోగించండి. ప్రస్తుత కాలంలో సువాసన భరితమైన బాడీ-సోప్ల వినియోగం ఒక ట్రెండ్గా ఉంది, కానీ మీ పొడి చర్మానికి ఇది ఏమాత్రం మంచిది కాదు కాబట్టి, మీరు దీనిని వినియోగించవద్దు. మీ శరీరాన్ని శుభ్రపరిచే సబ్బులను మాత్రమే వాడండి నురగులు వచ్చే వాటిని మాత్రం వాడకండి. నురగులు వచ్చే సబ్బులను ఉపయోగించడం వల్ల మీ పొడి చర్మం పై సహజంగా ఉత్పత్తి అయ్యే ఆయిల్ను కూడా పూర్తిగా తొలగిస్తుంది.

  3. స్నానానికి ముందు ఆయిల్ను వాడండి :

  3. స్నానానికి ముందు ఆయిల్ను వాడండి :

  స్నానానికి వెళ్ళే ముందు మీ శరీరానికి నూనెను ఉపయోగించండి. ఇది మీకు నిజంగానే ఉపయోగకరంగా ఉంటుందని కనుగొన్నబడిన ఒక సులభమైన చిట్కా, ఇక్కడ ఆయిల్ను మీరు స్నానం చేయడానికి ముందు మీ చర్మానికి అప్లై చేయడం వల్ల, ఈ ఆయిల్ మీ చర్మరంధ్రాల్లో కి చేరి చర్మాన్ని తేమగా ఉంచడానికి ఉపయోగించబడుతుంది. ఇది నీటి నుండి మీ పొడి చర్మాన్ని పాడవకుండా రక్షిస్తుంది. మీరు కొబ్బరినూనెను, కాస్టర్-ఆయిల్ను, బాదంనూనెను (లేదా) ఆలివ్ నూనె వంటి వాటిని ఉపయోగించవచ్చు. ఈ నూనెలు పొడి చర్మంలోకి బాగా చొచ్చుకుపోయి మీ పొడి చర్మాన్ని తేమగా ఉంచుతాయి.

  4. స్క్రబ్తో శుభ్రం చేయండి :

  4. స్క్రబ్తో శుభ్రం చేయండి :

  మీ ముఖం కోసం ఎక్స్ఫోలియేషన్ చెయ్యవలసిన అవసరం లేదు. కానీ, మీ శరీరంపై చనిపోయిన చర్మ కణాలు చాలానే ఉన్నాయి. వాటిని తొలగించడానికి - మీ శరీరాన్ని ఎక్స్ఫోలియేషన్ చెయ్యడంలో మీరు తరచుగా నిర్లక్ష్యత వహిస్తారు. చనిపోయిన చర్మకణాలు చర్మము యొక్క పొడిరూపంలో ఊడిపోవడం అనేది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే వాటి స్థానంలో కొత్త చర్మకణాలు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి మీరు స్టోర్ లో దొరికే స్క్రబ్లను కొని ఉపయోగించవచ్చు (లేదా) మీ ఇంట్లో దొరికే పదార్థాలతో మీరే స్వయంగా స్క్రబ్ను తయారు చేసి ఉపయోగించవచ్చు.

  5. స్నానం చేసిన తర్వాత కూడా మాయిశ్చరైజర్ను ఉపయోగించండి :

  5. స్నానం చేసిన తర్వాత కూడా మాయిశ్చరైజర్ను ఉపయోగించండి :

  మీరు స్నానం చేసిన తర్వాత గాలికి మీ చర్మము తిరిగి పొడిగా మారుతుంది. మీ చర్మాన్ని తేమగా ఉండేటట్లుగా చేసే మాయిశ్చరైజర్ను అప్లై చేయండి, అది మీ చర్మాన్ని తేమగా ఉంచేదని నిర్ధారించుకోండి. కోకో-బటర్ (లేదా) షియా-బటర్ వంటి ఇంటెన్సివ్ మాయిశ్చరైజర్ను ఉపయోగించాలని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము. వీటిని ఒక్కసారి ఉపయోగిస్తే, మళ్లీమళ్లీ ఉపయోగించవలసిన అవసరం లేదు.

  6. ఆయిల్ మసాజ్ :

  6. ఆయిల్ మసాజ్ :

  ప్రతిరోజు రాత్రి మీరు పడుకునే ముందు, తక్కువ మొత్తంలో ఆయిల్ ఉపయోగించి, మీ చర్మాన్ని మసాజ్ చేయండి. ఇది మీ చర్మంలో రక్త ప్రసరణను పెంచేలా చేయుటకు, మీ చర్మం లోతుగా ఆయిల్ చొచ్చుకుపోయెలా మసాజ్ చేయాలి. మీ చర్మంలోని త్వరగా ఇంకిపోయే నూనెలను వాడండి ఎందుకంటే, అది మీ బట్టలకు అంటుకొని మరకలను సృష్టించగలదు. ప్రతిరోజు రాత్రి మీరు పడుకునే ముందు, చర్మానికి ఆయిల్ ను అప్లై చేయడం వల్ల మీ చర్మం పై ఎలాంటి బాధను కలగనివ్వదు.

  7. ఒక లిప్-బామ్ను ఉపయోగించండి :

  7. ఒక లిప్-బామ్ను ఉపయోగించండి :

  మీరు సంవత్సరం పొడవునా పొడి చర్మంతో బాధపడుతున్నట్లైతే, మీ పెదవులు పొడిగా మారి రక్తం కూడా రావచ్చని మేము భావిస్తున్నాము. మీ పెదవులను కాపాడుకోవడం కోసం రాత్రి పడుకునే ముందు మీ పెదాలకు లిప్-బామ్ను అప్లై చేయండి.

  English summary

  what to do when you have dry skin | tips on what to do if you have severely dry skin

  Flaky skin may look unattractive, but it feels a lot worse than it looks. And no matter how many fancy moisturisers you buy, it never seems to go away, and you have to keep reapplying it. So, certain precautions like showering with cold water, oiling before showering, moisturising right after a shower and so on help.
  Story first published: Thursday, March 8, 2018, 9:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more