For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖానికి నిమ్మరసం వాడుతున్నారా? అయితే ఈ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి

ముఖానికి నిమ్మరసం వాడుతున్నారా? అయితే ఈ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి

|

చర్మ సంరక్షణ కోసం మనము వివిధ మార్గాలను అనుసరిస్తుంటాము. వాటిలో కొన్ని మన చర్మానికి మంచి చేస్తే కొన్ని హాని కలిగిస్తాయి. ఎందుకంటే అందాన్ని మెరుగుపరుచుకోవడం కోసం మనం ఉపయోగించే కొన్ని బ్యూటీ కేర్ ఉత్పత్తులు చర్మంలో అనేక సమస్యలను కలిగిస్తాయి. కొన్ని బ్యూటీ ఉత్పత్తులపై అవగాహన లేకుండా నేరుగా చర్మంపై అప్లై చేయడం ద్వారా చర్మానికి చాలా హాని కలుగుతుంది. చర్మం తెల్లగా మారడం కోసం కొన్నిబ్యూటీ ఉత్పత్తులను వాడుతుంటాము.

కానీ ఇవన్నీ కేవలం తాత్కాలికంగా తెల్లబడటం, సమస్యలను నివారించడం చేస్తాయి. కానీ తరువాత మన చర్మంపై మరింత తీవ్రమైన పరిణామాలను కలిగిస్తాయి. అందం సంరక్షణ కోసం నిమ్మరసంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ దీని వల్ల చర్మానికి దుష్ప్రభావలు కూడా ఉన్నాయన్న విషయం మీరు తెలుసుకోవాలి.

serious side effects of using lemon on face

చాలా కథనాల్లో లేదా వ్యాసాల్లో మరియు పత్రికల్లో నిమ్మరసం ముఖానికి చాలా మేలు చేస్తుంది, చర్మంను కాంతివంతం చేస్తుందన్న కారణంగా దీన్ని మన ముఖానికి రాస్తుంటారు. అయితే దీన్ని తరచు ముఖంపై రాయడం వల్ల చర్మంలో తరచుగా వచ్చే చీకాకుల గురించి మనలో చాలా మందికి తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే ఇది చర్మంపై వాడినప్పుడు ఇది చర్మానికి చాలా చీకాకు కలిగిస్తుంది.

ఇలాంటి వాటి గురించి తెలియకపోవడం వల్ల మీలో ఎక్కువ సమస్యలు వస్తాయి. మీ ముఖం మీద నిమ్మరసం ఎలాంటి దుష్ప్రభావాలను కలిగిస్తుందో చూద్దాం.

నిమ్మకాయ ఆమ్ల గుణం కలది

నిమ్మకాయ ఆమ్ల గుణం కలది

వివిధ రకాల చర్మ సమస్యలను నివారించుకోవడంలో తరచుగా దీన్ని ఉపయోగిస్తుంటారు. కొన్ని సార్లు ఇది వ్యతిరేఖ ఫలితాలను చూపుతుంది. ఎందుకంటే నిమ్మరసంలో ఆమ్లగుణం అధికంగా, పిహెచ్ స్థాయిలు చాలా తక్కువగా ఉండటం వల్ల దీన్ని నేరుగా మీరు మీ ముఖం పై ఉపయోగించినప్పుడు ఇది చర్మంలో కొన్ని అసౌకర్యాలను కలిగిస్తుంది.

సున్నితమైన చర్మం

సున్నితమైన చర్మం

అందం సంరక్షణ విషయానికి వస్తే సున్నితమైన చర్మ సంరక్షణకు ఇది పూర్తిగా వ్యతిరేఖంగా పనిచేస్తుంది. నిమ్మరసంను చర్మంపై ఎక్కువగా వాడటం వల్ల తరచుగా సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. చర్మంలోని నిమ్మరసం తరచుగా వాడటం వల్ల చర్మంపైపై ఎర్రటి-గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి. సున్నితమైన చర్మం ఉన్నవారు దీనికి ఎక్కువ అవకాశం ఉంది.

దురద మరియు దద్దుర్లు

దురద మరియు దద్దుర్లు

నిమ్మరసంలో అసిడ్ ఆమ్లం అధికంగా ఉంటుంది మరియు తరచూ చర్మంలో ఉపయోగించడం వల్ల ఇది దురదకు కారణమవుతుంది. చర్మంపై ఇటువంటి దుష్ప్రభాలు కలిగించడం వల్ల చివరికి కొంతకాలం తర్వాత చర్మంలో చాలామార్చులు వస్తాయి. కాబట్టి మీకు వాపు, దురద మరియు ఇతర అసౌకర్యం ఉంటే మీరు ఏ కారణం చేతనైనా నిమ్మరసం వాడకుండా ఉండాలి.

చర్మంలో బొబ్బలు

చర్మంలో బొబ్బలు

చర్మ బొబ్బల సమస్యలను కూడా కలిగిస్తాయి. ఎందుకంటే నిమ్మరసం జిడ్డుగల చర్మంలో సమస్యలను పెంచుతుంది, చర్మంలో దద్దుర్లు, బొబ్బలు ఏర్పడటానికి కారణం అవుతుంది. కాబట్టి ఈ సమస్యలను మరియు ఆరోగ్యాన్ని తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన పరిష్కారం అని మనము భావించే నిమ్మరసం కేవలం చర్మానికి మేలు చేయడం మాత్రమే కాదు, ఎక్కువ హాని కూడా కలిగిస్తుంది.

ఇది మీ చర్మాన్ని పొడిగా చేస్తుంది

ఇది మీ చర్మాన్ని పొడిగా చేస్తుంది

ఇది చర్మాన్ని మరింత పొడిగా చేసే శక్తిని కలిగి ఉంటుంది. డ్రై స్కిన్ ఉన్న వారు దీన్ని ఉపయోగించడం వల్ల చర్మాన్ని మరింత పొడిగా చేస్తుంది. మనము ఈ సమస్యను సీరియస్ గా తీసుకోకపోతే ఇది చర్మ సమస్యలను పెంచుతుంది. డ్రై స్కిన్ ఉన్నవారు నిమ్మరసం ఉపయోగించకపోవడమే ఉత్తమం.

మృదుత్వాన్ని తొలగిస్తుంది

మృదుత్వాన్ని తొలగిస్తుంది

నిమ్మరసం చర్మం యొక్క సహజంగా ఉండే మృదుత్వాన్ని తొలగించడానికి కూడా పనిచేస్తుంది. మీరు అలాంటి వాటిని గమనించకపోతే ఇది మీ చర్మాన్ని చాలా కఠినంగా చేస్తుంది. ముడతలు మరియు చర్మాన్ని మరింత డ్రైగా మార్చుతుంది. చర్మంలో మృదుత్వాన్ని తొలగిస్తుంది. చర్మానికి నిమ్మరసం వాడటం వల్ల దుష్ప్రభానికి గురి అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి.

English summary

serious side effects of using lemon on face

Here in this article we explain some of the serious side effects of lemon on face. Read on.
Story first published:Saturday, October 26, 2019, 16:44 [IST]
Desktop Bottom Promotion