For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Skin Cycling: ముడతలు, మచ్చలు, మొటిమలు.. స్కిన్ సైక్లింగ్ ఒక్కటే పరిష్కారం!

ముఖాన్ని కాంతివంతం చేసుకునేందుకు, ముడతలు, మొటిమలు, నల్లమచ్చలను దూరం చేసుకోవాలంటే స్కిన్ సైక్లింగ్ ను అనుసరించాలని అంటున్నారు సౌందర్య నిపుణులు. అసలు స్కిన్ సైక్లింగ్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

Skin Cycling: చిన్న వయస్సులోనే ముఖంపై ముడతలు వచ్చేస్తున్నాయి. వృద్ధాప్య ఛాయలు ముసురుకుంటున్నాయి. ముఖంపై మచ్చలు, మొటిమలు, కళ్ల కింద నల్లటి వలయాలు, ముఖం కాంతి కోల్పోవడం ఇలా చాలా సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. వీటి నుండి చర్మాన్ని మరీ ముఖ్యంగా ముఖాన్ని కాంతివంతంగా చేసుకునేందుకు చాలా మంది రకరకాల ఉత్పత్తులు వాడుతుంటారు. రోజూ ఏవేవో క్రీములు, లోషన్లు, మాస్క్ లు, ఫేస్ వాష్ లు చేస్తుంటారు. ఎన్ని చేసినా వచ్చే ఫలితం అంతంతమాత్రమే.

What is skin cycling? What are the benefits?

ముఖాన్ని కాంతివంతం చేసుకునేందుకు, ముడతలు, మొటిమలు, నల్లమచ్చలను దూరం చేసుకోవాలంటే స్కిన్ సైక్లింగ్ ను అనుసరించాలని అంటున్నారు సౌందర్య నిపుణులు. అసలు స్కిన్ సైక్లింగ్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్కిన్ సైక్లింగ్ అంటే ఏంటి?

స్కిన్ సైక్లింగ్ అంటే ఏంటి?

స్కిన్ సైక్లింగ్ అనేది స్కిన్ కేర్ రొటీన్. ఒక పద్ధతిలో తగిన క్రీములను రాస్తూ వెళ్లడమే స్కిన్ కేర్ రొటీన్. అయితే స్కిన్ సైక్లింగ్ లో ఒక పద్ధతి ప్రకారం క్రీములు రాస్తూనే, ఎలాంటి క్రీములు వాడకుండా విశ్రాంతి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల చర్మం దానంతట అదే రిపేర్ చేసుకుంటుంది. మనం పాటించే స్కిన్ కేర్ రొటీన్ ఫలితాలు ప్రభావవంతంగా కనిపిస్తాయి.

స్కిన్ సైక్లింగ్ అంటే రాత్రి పూట మాత్రమే చేయాల్సిన ప్రక్రియ. ఇందులో మొత్తం మూడు దశలు ఉంటాయి.

1. ఎక్స్ ఫోలియేషన్:

1. ఎక్స్ ఫోలియేషన్:

ముందు మంచి క్లెన్సర్ ను ఎంచుకోవాలి. అది మీ చర్మ తత్వానికి సరిపోయేది అయి ఉండాలి. మీ చర్మతీరుకు తగిన క్లెన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఏదైనా స్ర్కబ్ ను తీసుకుని దానితో కనీసం ఐదు నిమిషాల పాటు ముఖాన్ని మర్దన చేయాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని చక్కగా కడగాలి. తడి పూర్తిగా ఆరిపోయేలా మెత్తని తువ్వాలుతో తుడుచుకోవాలి. తర్వాత కొద్ది సేపు ఆరిపోయాక.. మాయిశ్చరైజర్ రాసుకోవాలి. క్లెన్సర్ తో చర్మాన్ని శుభ్రం చేస్తే మృతకణాలు తొలగిపోతాయి. చర్మంపై పేరుకుపోయిన అవశేషాలూ పోతాయి.దీంతో మొదటి రోజు స్కిన్ సైక్లింగ్ లో మొదటి దశ పూర్తి అయినట్లే.

2. రెటినాయిడ్స్:

2. రెటినాయిడ్స్:

రెండో రోజు ముఖాన్ని క్లెన్సర్ తో చక్కగా కడగాలి. తర్వాత తడి మొత్తం పోయే వరకు తువ్వాలుతో తుడిచి కొద్దిసేపు ఆగాలి. ఆ తర్వాత విటమిన్ ఏ ఎక్కువగా ఉండే రెటినాయిడ్, లేదా క్రీము ఎంచుకుని ముఖంపై రాసుకోవాలి.

రెటినాయిడ్ ను మొదటి సారి రాసుకునే వారికి చర్మం ఎర్రబడటం, చిన్న మొటిమలు రావొచ్చు. ఇలా జరిగితే కొద్దిగా మాయిశ్చరైజర్ రాయాలి. ఇలా మాయిశ్చరైజర్ రాయడం వల్ల మొటిమలు తొలగిపోవడమే కాకుండా వాటి వల్ల వచ్చే మచ్చలు ఏర్పడవు. ముడతలు, గీతలు అన్ని తొలగిపోతాయి.

3. రికవరీ:

3. రికవరీ:

ఈ రికవరీ దశ మూడు, నాలుగు రోజులు ఉంటుంది. ఈ రోజుల్లో ఎక్స్ ఫోలియేట్ యాసిడ్ు, రెటినాయిడ్స్ వాడకూడదు. ఇలా చేయడం వల్ల చర్మం తిరిగి కోలుకునే అవకాశాన్ని ఇచ్చినట్లు అవుతుంది. స్కిన్ మైక్రోబయోమ్ ను పోషించడం, చర్మ అవరోధాన్ని సరిచేయడంపై దృష్టి పెట్టాలి.

రోజూ క్రీములు, లోషన్లు చర్మంపై రాయడం వల్ల చర్మ రంధ్రాల్లో అవి పేరుకుపోతాయి. ఇది స్కిన్ ను డ్యామేజ్ చేస్తాయి. అందుకే ఈ విశ్రాంతి ఇవ్వడం అని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.

ఈ రికవరీ రోజుల్లో చర్మాన్ని కడిగి మాయిశ్చరైజర్ రాసుకుంటే సరిపోతుంది. దీని వల్ల చర్మం తేమ కోల్పోకుండా ఉంటుంది.

తర్వాత ఈ స్కిన్ సైక్లింగ్ ను కొనసాగించాలి. ఈ స్కిన్ కేర్ రొటీన్ వల్ల మీ చర్మంపై మెరిసిపోయేలా కనిపిస్తుందా, మొటిమలు, మచ్చలు పోతున్నాయా లేదా అనేది గమనించుకోవాలి. తర్వాత ఎంత కాలంపాటు అయినా ఈ స్కిన్ సైక్లింగ్ ను వాడొచ్చు. దీని నుండి ప్రయోజనం పొందవచ్చు.

English summary

What is skin cycling? What are the benefits?

read on to know What is skin cycling? What are the benefits?
Desktop Bottom Promotion