For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Jacqueline fernandez: అందాల దీవి.. ఈ శ్రీలంక సుందరి

|

Jacqueline fernandez: జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. శ్రీలంకన్ నుండి వచ్చిన ఈ అందాల సుందరి. బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. ఆన్-పాయింట్ డ్రెస్సింగ్ సెన్స్ తో ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది ఈ భామ. జాక్వెలిన్ ఏది ధరించినా.. తన లుక్ మాత్రం అదిరిపోతుంది.

బాలీవుడ్ లో జాక్వెలిన్ రూటే సెపరేటు. ఈ బ్యూటీ ఎక్కడా తనకు హద్దులు పెట్టుకోదు. సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తుంది. అలాగే.. అవి మాత్రమే చేస్తానని ఎక్కడా గిరి గీసుకోదు. ఐటెం సాంగ్స్ కి కూడా సై అంటుంది ఈ శ్రీలంకన్ అందం.

ఈ లంకన్ బ్యూటీకి సినిమాల్లో ఎలాంటి హద్దులు లేనట్లే.. ఫ్యాషన్ లోనూ ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా ఉంటుంది. వెస్టర్న్ వేర్ నుండి ట్రెడిషనల్ వేర్ వరకు అన్నీ తన కలెక్షన్స్ లో భాగం చేసేస్తుంది. తన సోషల్ మీడియా ఖాతాల్లో తన క్యూటీ, బ్యూటీ పిక్స్ చూస్తే అదే అర్థం అవుతుంది.

ఈ మధ్యే కిచ్చా సుదీప్ నటించిన విక్రాంత్ రోనా సినిమాలో జాక్వెలిన్ ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇప్పుడు ఎక్కడ విన్నా.. 'రారా రక్కమ్మ' పాటే మారుమోగుతోంది. ఈ సాంగ్ లో జాక్వెలిన్ అందాలు కుర్రకారుకు కిక్కెక్కిస్తున్నాయి.

ఐఐఎఫ్ఎ అవార్డు కోసం అబుదాబి వెళ్లినప్పుడు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తెల్లని చీరలో మెరిసింది. ముత్యాల వంటి ఆ చీరలో ఈ భామ అదిరిపోయింది. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ గోల్డెన్ అవర్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

గత నెల అబుదాబిలో జరిగిన ఐఐఎఫ్ఎ అవార్డ్స్ లో ఈ భామ రాత్రి వేళ మెరిసిపోయే డ్రెస్సులో కనిపించి కవ్వించింది. గోల్డెన్ శిమ్మెరీ డ్రెస్సులో జాక్వెలిన్ అందాలు రెట్టింపు అయ్యాయి. డ్రెస్సుకు తగ్గట్టుగా ఉన్న అలంకరం.. జాక్వెలిన్ కు చక్కగా సరిపోయింది.

ఇటీవలె ఈ తార తన చీర కట్టును ప్రదర్శించింది. సౌత్ ఇండియన్ స్టైల్ లో జాక్వెలిన్ ఆకట్టుకుంది. రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ తో పాటు క్రీమ్ వైట్ కాటన్ చీర... జాక్వెలిన్ అందాన్ని పెంచి చూపించింది. చెవులకు పెద్ద పెద్ద జుంకీలు ధరించింది. కొప్పులా కనిపించేలా జడను మడిచి.. మల్లె పూల దండను జోడించింది.

తెల్లని చొక్కా, అదే రంగులోని ప్యాంటుతో కనిపించింది జాక్వెలిన్. మేకప్ రూము నుండి ఈ ఇమేజ్ తీసి, దానిని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేసింది.

* జాక్వెలిన్ శ్రీలంక దేశస్థురాలు. కానీ ఆమెకు మూడు దేశాలకు సంబంధించిన మూలాలు ఉన్నాయి. కెనడా, శ్రీలంక, మలేషియాకు చెందిన జాక్వెలిన్.. బహ్రెయిన్ లో పెరిగింది.
* ఆమె తండ్రిది శ్రీలంక.. తల్లి మలేషియాకు చెందినవారు. ఆమె పూర్వీకులు కెనడాకు చెందిన వారు కావడం గమనార్హం.

* జాక్వెలిన్ సిడ్నీ వర్సిటీ నుండి మాస్ కమ్యూనికేషన్స్ లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసింది. తర్వాత శ్రీలంకలో టీవీ రిపోర్డర్ గా పని చేసింది . అనంతరం మోడలింగ్ వైపు వచ్చింది.

* ఈ అమ్మడికి జంతువులు అంటే ప్రాణం. చాలా ఇష్టంగా వాటిని చూసుకుంటుంది. అందుకే ఆమెకు 2014 సంవత్సరానికి గానూ ఉమన్ ఆఫ్ ది ఇయర్ గా గుర్తించింది.
* జాక్వెలిన్ అందానికి ఎవరైనా ముగ్దులు కావాల్సిందే. ఈ సోగసిరికి 2008, 2011 లో రెండు సార్లు వరల్డ్ సెక్సీయెస్ట్ ఉమన్ జాబితాలో 12వ స్థానంలో నిలిచింది.
* 2013లో మోస్ట్ డిజైరబుల్ ఉమన్ లిస్ట్ లో మూడో స్థానంలో నిలిచింది.

English summary

Jacqueline Fernandez's Stunning Beauty Looks

read on to know Jacqueline Fernandez's Stunning Beauty Looks
Story first published:Saturday, July 16, 2022, 16:54 [IST]
Desktop Bottom Promotion