గత రెండు దశాబ్దాలకు చెందిన బాలీవుడ్ స్టైలిష్ వధువులు వీరే

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. పెళ్లంటే ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన రోజే కదా. మరి సెలెబ్రిటీల విషయంలో కూడా ఇది అక్షరాలా నిజమే. సెలెబ్రిటీల పెళ్లి వేడుకలు వైభవంగా జరుగుతాయి. ఆ సెలెబ్రిటీల విభిన్న వెడ్డింగ్ స్టైల్స్ మన మనసుని ఆకట్టుకుంటాయి. వాటిని చూసి సాధారణ ప్రజలు కూడా అటువంటి వెడ్డింగ్ కాన్సెప్ట్స్ ని ప్రయత్నించాలని తహతహలాడతారు. మరి, తమ ప్రత్యేకమైన రోజున సెలెబ్రిటీలు ఏ స్టైల్ లో మెరిశారో తెలుసుకోవాలని ఆతృతగా ఉందా? ఇంకెందుకాలస్యం ఈ ఆర్టికల్ ని చదివేయండి మరి.

సెలెబ్రిటీ వధువుకు పెళ్లి వస్త్రాలను డిజైన్ చేయడానికి నిపుణులైన డిజైనర్స్ పనితీరు ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రతి మైన్యూట్ విషయాన్ని కూడా వారు డిజైన్ కి ఉపయోగించుకుంటారు. డిటైల్డ్ ఎంబ్రాయిడరీ కోసం ఎంతో మంది కళాకారులు నెలలతరబడీ నిమగ్నమై ఉంటారు. కాబట్టి, కస్టమైజ్డ్ సెలెబ్రిటీ బ్రైడల్ లెహంగాలు అత్యంత ఖరీదు చేయడంలో ఆశ్చర్యం అవసరం లేదు.

బాలీవుడ్ కి చెందిన మన ఫెవరెట్ సెలెబ్రిటీస్ బ్రైడల్ లుక్స్ విషయాలని ఈ ఆర్టికల్ లో పొందుబరిచాము. వారి బ్రైడల్ అవుట్ ఫీట్స్ ధరలను కూడా ఇందులో పొందుబరిచాము.

అనుష్క శర్మ:

అనుష్క శర్మ:

విరుష్క వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్స్ అనేవి వైరల్ గా మారాయన్న విషయం తెలిసిందే. ఇందులో అనుష్క బ్రైడల్ లెహంగా గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. సబ్యసాచి ముఖర్జీ ఈ డిజైన్ కోసం ఎంతో శ్రమించారు. దాదాపు 67 మంది టైలర్లు ఈ లెహంగాను డిజైన్ చేయడంలోతమదైన పాత్ర పోషించారు. ఈ భారీ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ లెహంగాపై కస్టమైజ్డ్ టైలరింగ్ ని చేశారు. దీని ధర దాదాపు 40 లక్షలు.

బిపాసా బసు:

బిపాసా బసు:

బిపాసా బసు తన వెడ్డింగ్ డేలో రెడ్ శారీలో తళుక్కుమంది. బాలీవుడ్ ని తన హాట్ లుక్స్ తో ఒక ఊపు ఊపిన బిపాసా వెడ్డింగ్ శారీలో కుందనపు బొమ్మలా ఒద్దికగా ఉంది. సబ్యసాచి ముఖర్జీ ఈ శారీని డిజైన్ చేశారు. ఈ శారీ ధర దాదాపు 4 లక్షలు. అనుష్క వెడ్డింగ్ అటైర్ ధర కన్నా ఇది ఎంతో తక్కువ. ఆ అయినా, ఈ వెడ్డింగ్ అటైర్ అనేది బిపాసా బసు వెడ్డింగ్ డే కి హైలైట్ గా నిలవడంతో గొప్ప పాత్ర పోషించింది.

జెనీలియా డిసౌజా దేశముఖ్:

జెనీలియా డిసౌజా దేశముఖ్:

జెనీలియా కూడా రితేష్ దేశ్ ముఖ్ అనే నటుడితో క్రాస్ కమ్యూనిటీ మేరేజ్ ని చేసుకుంది. మరాఠీ బ్రైడల్ లుక్ లో జెనీలియా లుక్ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. నీతా లుల్లా డిజైన్ చేసిన రెడ్ మరియు గోల్డ్ బ్రైడల్ సరీలో జెనీలియా లుక్ అదిరిపోయింది. గోల్డ్ కుందన్, జరీ మరియు బార్డర్ లో బూటీ వర్క్ అనేది జెనీలియా ని ప్రెట్టియెస్ట్ బ్రైడ్ ఆఫ్ ది సీజన్ గా మార్చిందనడంలో సందేహం లేదు. ఈ శారీ ధర దాదాపు 17 లక్షలు.

ఐశ్వర్య రాయ్ బచ్చన్:

ఐశ్వర్య రాయ్ బచ్చన్:

2007లో అందాలరాశి ఐశ్వర్యా రాయ్ అభిషేక్ బచ్చన్ ని వివాహమాడింది. వీరి వెడ్డింగ్ అప్పట్లో టాక్ ఆఫ్ ది సీజన్ అయింది. ఈ వేడుకకు నీతా లుల్లా డిజైన్ చేసిన గోల్డెన్ ఎల్లో శారీని ఐశ్వర్య ధరించింది. ఈ శారీ ధర దాదాపు 75 లక్షలు. గోల్డ్ మరియు స్వరోవస్కీ క్రిస్టల్స్ ని బ్రైడల్ శారీతో మ్యాచ్ చేసింది. ఈ వేడుకలో ఐశ్వర్యకు దాదాపు 15 కేజీల బంగారు ఆభరణాలను ధరించింది.

కరీనా కపూర్:

కరీనా కపూర్:

ఫ్ల్యాషీ సెలెబ్రిటీ వెడ్డింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నట్టయితే సైఫ్ ఆలీ ఖాన్ తో అందాల నటి కరీనా కపూర్ వెడ్డింగ్ గురించి మనం తప్పక మాట్లాడుకోవాలి. తన అత్తగారు షర్మిలా ఠాగూర్ తన పెళ్లివేడుకలో ధరించినటువంటి ఘరారానే కరీనా ధరించింది. ఈ రాయల్ ఘరారా లెహంగాని డిజైనర్ రీతూ కుమార్ డిజైన్ చేశారు. దీని ధర దాదాపు 50 లక్షలు. దీనిపై మ్యాచ్ చేసిన స్టన్నింగ్ నెక్ పీస్ ధర దాదాపు 40 లక్షలు.

ఈషా డియోల్:

ఈషా డియోల్:

సదరు భారతీయ వధువులా వెడ్డింగ్ నాడు రెడ్ కలర్ నే ధరించాలని ఈషా డియోల్ కూడా భావించినట్టుంది. అద్భుతమైన రెడ్ మరియు గోల్డ్ శారీలో ఈషా తన వెడ్డింగ్ డే నాడు మెరిసిపోయింది. ఈ కాంజీవరం శారీని నీతా లల్లా డిజైన్ చేశారు. దీని ధర దాదాపు 3 లక్షలు. ఇది ఎంతో అందంగా మెరిసిపోయింది. గోల్డెన్ జరీ మరియు బూటీ వర్క్స్ తో కూడిన మోటిఫ్ ఎంబ్రాయిడరీ ఈ శారీ అందాన్ని మరింత పెంచింది.

దియా మీర్జా:

దియా మీర్జా:

తన కళ్ళతో అందరినీ ఫిదా చేసే దియా మీర్జా తన వెడ్డింగ్ డే నాడు కూడా స్పెషల్ గా కనిపించడంలో విఫలమవలేదు. బీజ్, గ్రీన్ మరియు వయొలెట్ కాంబినేషన్ తో గోల్డ్ జరీ వర్క్స్ అవుట్ ఫిట్ ఆమె అందాన్ని మరింత పెంచాయి. ఈ బ్రైడల్ షరారాను రీతూ కుమార్ డిజైన్ చేశారు. దీని ధర దాదాపు 3 లక్షలు. ఈ షరారాలో ఈ బాలీవుడ్ నటి మెరిసిపోయింది.

శిల్పా శెట్టి:

శిల్పా శెట్టి:

రాజ్ కుంద్రాతో శిల్పా శెట్టి వివాహం బాలీవుడ్ లోని మరొక హ్యాపెనింగ్ వెడ్డింగ్ గా పేరొందింది. ఈ ఫ్యాషనిస్టా తన వెడ్డింగ్ డే నాడు రెడ్ అండ్ గోల్డ్ వెడ్డింగ్ శారీని ధరించి మెరిసిపోయింది. ఈ శారీని తరుణ్ తాహిలియానీ డిజైన్ చేశారు. ఈ అవుట్ ఫిట్ పై స్వరోవస్కీ క్రిస్టల్స్ తో ఎంబ్రాయిడరీ చేశారు. అందువలన, ఈ అవుట్ ఫిట్ ధర దాదాపు 50 లక్షలు పలికింది.

ఊర్మిళా మటోండ్కర్:

ఊర్మిళా మటోండ్కర్:

వెడ్డింగ్ డే నాడు ఊర్మిళ అందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. మనీష్ మల్హోత్రా లెహంగా ను ఊర్మిళ ధరించింది. ఈ లెహంగా ధర దాదాపు 4.5 లక్షలు. ఇటువంటి అందమైన లెహంగాలో ఊర్మిళ అందం మరింత రెట్టింపైంది. ఈ అవుట్ ఫిట్ కి తగిన గోల్డ్ ఆభరణాలను ధరించి మరింత ఆకర్షణీయంగా కనిపించింది ఊర్మిళ.

ఇక అందరి కళ్ళు దీపికా పైనే:

ఇక అందరి కళ్ళు దీపికా పైనే:

గత రెండు దశాబ్దాలకు చెందిన మోస్ట్ బ్యూటిఫుల్ బాలీవుడ్ బ్రైడ్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దీపికా పడుకొనే బ్రైడల్ లుక్ కోసం బాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీపికా కొన్నేళ్ల నుంచి రణ్వీర్ సింగ్ తో ప్రేమలో ఉందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ అమ్మడు రణవీర్ తో ఈ ఏడాది ఏడడుగులు నడుస్తోందన్న వార్తలకు అంతే లేదు. దీపికా ప్రిఫరెన్స్ లను గమనిస్తే తన వెడ్డింగ్ డే అవుట్ ఫిట్స్ కోసం ఈ బ్యూటీ కూడా సబ్యసాచి ముఖర్జీ లేదా నీతా లుల్లా డిజైన్స్ ని ఎంచుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

English summary

Most Beautiful Bollywood Brides | Most Stylish Bollywood Brides

Most Beautiful Bollywood Brides , Most Stylish Bollywood Brides,These actresses have given us wedding style goals in the past two decades. Have a look.
Story first published: Tuesday, February 20, 2018, 12:30 [IST]