For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐశ్వర్యరాయ్: ఎప్పటికి కేన్స్ చలనచిత్ర వేడుకకు రారాణి

ఐశ్వర్యరాయ్: ఎప్పటికి కేన్స్ చలనచిత్ర వేడుకకు రారాణి

|

"కేన్స్ రెడ్ కార్పెట్" అనే మాట వినగానే మీ మెదడుకు తట్టే మొదటి పేరు ఎవరిది?

ఖచ్చితంగా, ఐశ్వర్యారాయ్ అయిఉంటుంది.

గతకొన్ని సంవత్సరాలుగా భారతీయ చలన చిత్రాలు మరియు భారతీయ నటీనటుల ఉనికి హఠాత్తుగా పెరిగింది. ఇటీవల కాలంలో ప్రియాంక చోప్రా మరియు దీపిక పదుకొనె వంటి నటీమణులు అంతర్జాతీయ వినోద పరిశ్రమలో తమవంతుగా విశేషమైన పాత్ర పోషిస్తున్నారు.

కానీ, ఇటువంటి ప్రముఖులు అందరికంటే చాలా ముందుగా విదేశాలలో భారతీయ సినిమా పరిశ్రమకు ముఖచిత్రంగా ఐశ్వర్యారాయ్ నిలిచింది. రెడ్ కార్పెట్లపై హొయలు ఒలికించడమే కాకుండా టాక్ షోలలో కూడా పాలుపంచుకుంది.

timeline-aishwarya-will-be-the-queen-cannes-always

గత పదిహేడేళ్ళుగా కేన్స్ రెడ్ కార్పెట్ లో ప్రతి సంవత్సరం మెరిసే తారగా కీర్తిని సంపాదించింది. ఏళ్ళు గడుస్తున్నకొద్దీ తన తప్పొప్పులను తెలుసుకుంటూ, తనను తాను సరిదిద్దుకుంటూ, ఒక్కో మెట్టు పైకెక్కుతూ, ఈ రోజు ఆమె ఆనందిస్తున్న స్థాయిని సంపాదించుకుంది.

భారతదేశానికి వెలుపల,భారతీయ ఫ్యాషన్ పరిశ్రమ ముఖచిత్రంగా ఈ నీలికళ్ల భామ గుర్తింపునొందిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐష్ ఇప్పుడు పదిహేడవసారి కేన్స్ ఎర్ర తివాచీపై నడవబోతుందనే విషయం, ఆమె ఇప్పటికి ఫ్యాషన్ ప్రపంచ సామ్రాజ్ఞి అని చెప్పకనే చెబుతుంది. ఒక్కసారి వెనుదిరిగి చూస్తే, ఆమె యొక్క ఈ అసాధారణ ప్రయాణం ఎలా సాగిందో గమనించవచ్చు.

2002-2003:

2002-2003:

2002-2003: మొట్టమొదటిసారిగా ఆమె 2002లో, సంజయ్ లీలా భన్సాలి మరియు షారూఖ్ ఖాన్ లతో కలిసి దేవదాస్ సినిమా ప్రదర్శన నిమిత్తం, కేన్స్ ఎర్ర తివాచిపై సందడి చేసింది. ఆ తరువాత ఆమెకి ఎదురులేకుండాపోయింది.

తిరిగి 2003లో ఆమె జ్యూరీ సభ్యురాలిగా పాలుపంచుకుంది. కానీ అప్పటికి ఈ మాజీ అందాల రాణి ఫ్యాషన్ పరంగా పూర్తిగా పరిణితి సాధించలేదని తేటతెల్లమైంది. తన ప్రారంభ సంవత్సరాలలో కొన్ని తప్పటడుగులు వేసింది. కొన్నిసార్లు అతిగా చేసుకున్న వస్త్రాలంకరణ ఆమెను ఎబ్బెట్టుగా చూపించింది. ముఖ్యంగా, ఆమెలో సంప్రదాయక రూపురేఖలను కప్పిపుచ్చడానికి, అతిగా కళ్ళకు రంగులు పూసి, విడ్డూరమైన శిరోజాలంకరణతో, నాణ్యత లేని యాక్సెసరీలతో చూడటానికి వింతగొలిపేది.

కానీ తన తప్పుల నుండే పాఠాలు నేర్చుకుని అంచెలంచెలుగా ఫ్యాషన్ నిచ్చెనను ఎగబాకింది.

2005: 2005లో

2005: 2005లో

ఐశ్వర్య తన అందంతో ఫ్రెంచ్ రివేరాను ఉప్పెనలా ముంచెత్తింది. కేన్స్ చలనచిత్ర వేడుకను ఆరంభించిన మీదటి భారతీయురాలిగా ఖ్యాతిని గడించింది.

భారతీయులకు గర్వకారణమైన ఈ సంఘటనతో ఆనందడోలికల్లో తేలియాడారు. ఆమె ఈ సంధర్భంగా నిస్సంకోచంగా ధరించిన లోతైన నెక్-లైన్ కలిగిన నల్లని గుస్సి గౌన్ లో ఆమె సొగసు ద్విగుణీకృతం అయ్యింది.

2007:

2007:

2007లో, అప్పుడే కొత్తగా వివాహం చేసుకున్న ఐశ్వర్య తన భర్త అయిన అభిషేక్ తో కలిసి తెల్లని అర్మాని గౌనుకు జతగా వజ్రాల చోకర్ ధరించి గారాలుపోయింది.

ఆ సంవత్సరం ఐశ్వర్య కళ్ళల్లో కనిపించిన ఆనందం ఎప్పటికీ మరువలేము.

2009-2010:

2009-2010:

2009లో ఆమె రెడ్ కార్పెట్ పై ఫుస్చియా పింక్ దుస్తులలో తన కుటుంబ సభ్యులైన అభిషేక్ మరియు అమితాబ్ బచ్చన్ లతో కలిసి నడిచింది. నేటివరకు ఆమె అపురూపంగా దర్శనమిచ్చిన సందర్భాలలో ఇది కూడా ఒకటి.

2010లో

2010లో

2010లో ఆమె తన భర్తతో కలిసి సంప్రదాయ పద్ధతిలో సబ్యశాచి డిజైన్ చేసిన బంగారు వన్నె చీరలో కేన్స్ లో తళుకులీనారు.

జుట్టును ముడి పెట్టుకుని, అతి తక్కువ యాక్ససరీలతో , విశేషశైలి మరియు కొట్టొచ్చే ఆత్మవిశ్వాసంతో అందరి మన్ననలు పొందింది.

2011:

2011:

ఈ సంవత్సరం ఆమె ఫ్యాషన్ పరంగా అత్యంత భవిష్యపూర్వక నిర్ణయం తీసుకుంది. ఆమె తన పంథా నుండి విభిన్నంగా మలుపు తీసుకుని ప్రయోగాత్మకంగా తనను తాను ప్రదర్శించుకుందిఐశ్వర్య విభిన్నమైన నిర్మాణం కలిగి, రెండు ఛాయాల్లో రూపొందించబడిన అర్మాని ప్రైవ్ కు జతగా న్యూడ్ మేకప్ మరియు నీలి స్మోకీ కన్నులతో చూపరులను ఆకట్టుకుంది.

2012:

2012:

ఈ సంవత్సరం ఆమె కేన్స్ కెరీర్ లొనే అత్యంత కీలకమైనది. ప్రసవానంతర అధిక బరువు మూలాన ఆమె అనేక విమర్శలకు గురయినది.

నిజమైన ఫ్యాషన్ రారాణి వలే ఐశ్వర్య తన ఒంపుసొంపులను గ్రేయిష్ బ్లూ ఎల్లీ సాబ్ గౌన్ లో అంతర్జాతీయ మీడియా మరియు ఫ్యాషన్ పండితుల ముందు చేసిన ప్రదర్శనను చూసి అందరూ ముక్తకంఠంతో ఆమెను నిజమైన కేన్స్ రారాణిగా కొనియాడారు.

2014:

2014:

ఈ సంవత్సరం ఐష్ మెరుపులీనే అలల వంటి కుచ్చులున్న, బంగారు రంగు ఉన్న రాబర్టో కావల్లి గౌన్ ధరించింది. ఆమె పెరిగిన బరువును కోల్పోయి తిరిగి సన్నగా తీగలా తయారయ్యింది.

ఐశ్వర్య యొక్క ఆత్మవిశ్వాసానికి ఆకాశమే హద్దుగా, చేతులు ఊపుతూ, గాలిలో అభిమానులకు ముద్దులిస్తూ రెడ్ కార్పెట్ పై హొయలొలకించి విమర్శకుల మన్ననలు పొందింది. నేటి వరకు కేన్స్ లో ఐశ్వర్య అందాల ప్రదర్శనలో ఇది అత్యుత్తమమైనది.

ఐశ్వర్యరాయ్: ఎప్పటికి కేన్స్ చలనచిత్ర వేడుకకు రారాణి

ఈ సంవత్సరం ఐష్ మెరుపులీనే అలల వంటి కుచ్చులున్న, బంగారు రంగు ఉన్న రాబర్టో కావల్లి గౌన్ ధరించింది. ఆమె పెరిగిన బరువును కోల్పోయి తిరిగి సన్నగా తీగలా తయారయ్యింది.

ఐశ్వర్య యొక్క ఆత్మవిశ్వాసానికి ఆకాశమే హద్దుగా, చేతులు ఊపుతూ, గాలిలో అభిమానులకు ముద్దులిస్తూ రెడ్ కార్పెట్ పై హొయలొలకించి విమర్శకుల మన్ననలు పొందింది. నేటి వరకు కేన్స్ లో ఐశ్వర్య అందాల ప్రదర్శనలో ఇది అత్యుత్తమమైనది.

సిండ్రెల్లా అందాన్ని మీరెలా వర్ణిస్తారు?

సిండ్రెల్లా అందాన్ని మీరెలా వర్ణిస్తారు?

సిండ్రెల్లా అందాన్ని మీరెలా వర్ణిస్తారు? గత సంవత్సరం ఐశ్వర్య, మైకేల్ సింకో డిజైన్ చేసిన పౌడర్ బ్లూ సిండ్రెల్లా గౌన్ లో వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించింది. కేన్స్ రెడ్ కార్పెట్ పై డిస్నీ రాజకుమారిలా కనిపిస్తున్న ఆమె అందాన్ని ప్రపంచం మొత్తం గమనించింది.

ఈ సంవత్సరం మే 11వ తారీఖున ఆమె రెడ్ కార్పెట్ పై ఆమె సందడి చేయబోతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె వన్నెచిన్నెలను ఆస్వాదిస్తున్న అభిమానులు, ఈ సంవత్సరం ఏ విధంగా అలరించబోతుందో అని ఉవ్విళ్లూరుతున్నారు. వేచిచూద్దాం, ఆమె అందరిని ఏ విధంగా మంత్రముగ్ధులను చేస్తుందో!

English summary

timeline aishwarya will be the queen cannes always

The presence of Indian cinema and Indian artists has improved drastically. Lately, some stars have made a significant contribution to the international entertainment industry. But much before any of these celebrities; Aishwarya was the face of Indian cinema, abroad. From attending red carpets to appearing in some prestigious talk shows, she has been there done it all.
Desktop Bottom Promotion