For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గౌట్ సమస్యతో బొటన వేలు బాగా నొప్పి పుడుతుంది, ఈ పది ఎసెన్షియల్ నూనెలతో గౌట్ నొప్పుల నుంచి ఉపశమనం

అయితే, ఆర్థరైటిస్ ఫౌండేషన్ ప్రకారం, గౌట్ యొక్క ఇతర కారణాలుగా లింగం, వయస్సు, జన్యువులు, ఆరోగ్య పరిస్థితులు, ఆహారం, మందులు, ఊబకాయం, ఆల్కహాల్, సోడా మరియు బైపాస్ సర్జరీలు ఉన్నాయి.

|

గౌట్ అనేది ఒక రకమైన కీళ్ల నొప్పి సమస్యగా చెప్పబడుతుంది. ఆకస్మిక నొప్పి, వాపు మరియు అధిక సున్నితత్వం, తరచుగా కీళ్ళ భాగాలలో సంచలనం, బ్రొటన వేలి అనుసంధాన కీళ్లలో నొప్పి మొదలైనవి దీని లక్షణాలుగా ఉంటాయి. ఈ వ్యాసంలో, గౌట్ సమస్యకు గల కారణాలు మరియు ఉపశమనానికి సూచించదగిన చిట్కాల గురించిన విశ్లేషణను పొందుపరచడం జరిగింది.

10 Essential Oils For Relieving Gout Pain

సాధారణంగా, గౌట్ సమస్య బొటన వేలు యొక్క కీళ్ళను ప్రధానంగా ప్రభావితం చేస్తుంది. కానీ మోచేతులు, మణికట్టు, బ్రొటన వేళ్లు, చీలమండ మరియు చెవి వంటి ఇతర శరీర భాగాల జాయింట్లలో కూడా సంభవించవచ్చు. మూత్రపిండాలలోని స్ఫటికాలు కూడుకున్నప్పుడు మీ కీళ్ళలో గౌట్ సమస్య తలెత్తవచ్చు. క్రమంగా వాపు మరియు తీవ్రమైన నొప్పికి కారణంగా మారుతుంది. మీ శరీరంలో యురిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా పెరిగిన కారణంగా యురేట్ స్పటికాలు ఏర్పడతాయి.

అయితే, ఆర్థరైటిస్ ఫౌండేషన్ ప్రకారం, గౌట్ యొక్క ఇతర కారణాలుగా లింగం, వయస్సు, జన్యువులు, ఆరోగ్య పరిస్థితులు, ఆహారం, మందులు, ఊబకాయం, ఆల్కహాల్, సోడా మరియు బైపాస్ సర్జరీలు ఉన్నాయి.

శోథతో కూడిన సమస్య కావున, గౌట్ అత్యంత బాధాకరమైన వ్యాధిగా ఉంటుంది. మీరు గౌట్ నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందే క్రమంలో భాగంగా కొన్ని ఎసెన్షియల్ నూనెలను ఉపయోగించవచ్చు.

గౌట్ నొప్పి ఉపశమనానికి సూచించదగిన ఎసెన్షియల్ నూనెల జాబితా ఇక్కడ పొందుపరచబడి ఉన్నది.

ఎసెన్షియల్ నూనెలను ఉపయోగించి పాటించదగిన చిట్కాలు :

• చికిత్సలో భాగంగా, కొబ్బరి నూనె, ఆలివ్ నూనె లేదా జోజోబా నూనె వంటి సజల నూనెలనే ఉపయోగించడం మంచిది. మరియు ఎసెన్షియల్ నూనెలను నేరుగా చర్మంపై వర్తించడం సరికాదని గుర్తుంచుకోండి.

• ఏదైనా ఎసెన్షియల్ నూనె మీకు అలెర్జీ రియాక్షన్ కారకాలుగా ఉన్నాయో లేదో పరీక్షించడానికి, మీ చేతి మీద నూనెల మిశ్రమాన్ని చిన్న మొత్తాలలో వర్తించి, ఫలితాలను తనిఖీ చేయడానికి రెండు రోజులు వేచి ఉండండి.

• వాటిలో అనేక రకాలు విషపూరితమైనవిగా ఉన్న కారణాన, వాటిని నోటి ద్వారా తీసుకోకుండా జాగ్రత్త వహించండి.

• ఈ ఎసెన్షియల్ నూనెలను వినియోగించే ముందు మీ వైద్యుని సంప్రదించడం కూడా మంచిది.

10 Essential Oils For Relieving Gout Pain

1. రోజ్మేరీ ఎస్సెన్షియల్ ఆయిల్ :

రోజ్మేరీ మన వంటింటిలో కనిపించే, ఒక సాధారణ మూలిక అయినప్పటికీ, అనేక ఉత్తమ ఔషధ గుణాలను కలిగి ఉంటుందని చెప్పబడింది. రోజ్మేరీ ఎసెన్షియల్ నూనెలో రక్తస్రావ నివారణా లక్షణాలు, యాంటీ బాక్టీరియల్, అనామ్లజనకాలు, అనాల్జేసిక్ మరియు యాంటీ ఆర్థ్రిటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి గౌట్ చికిత్సకు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి. ఈ నూనెలను చర్మం మీద దరఖాస్తు చేసినప్పుడు, అది ఆ ప్రాంతంపై వేడిని కలిగిస్తుంది. మరియు నరములకు స్వాంతన కలిగించడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం ఇవ్వడంలో అత్యుత్తమంగా సహాయపడగలదు.

10 Essential Oils For Relieving Gout Pain


2. ఫ్రాన్కిన్సెన్స్ ఎస్సెన్షియల్ ఆయిల్ :

ఈ ఎసెన్షియల్ నూనె వేల సంవత్సరాల నుండి పర్ఫ్యూమ్స్ లో సువాసనల కోసం ఉపయోగించడం జరుగుతుంది. కానీ, ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ రీసనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పరిశోధకులు మాత్రం, ఈ నూనెలలోని బోస్విలిక్ ఆమ్లాల కారణంగా, వాపు మీద దీని ఫలితాలను పరీక్షించినప్పుడు, అది గౌట్ సమస్యపై యాంటి ఇన్ఫ్లమేటరీ ప్రభావాన్ని కలిగి ఉంటుందని కనుగొన్నారు. బోస్వెలీయా చెట్టు నుండి సంగ్రహించిన జిగురు పదార్ధం నుండి, ఫ్రాన్కిన్సెన్స్ నూనెను సంగ్రహించడం జరుగుతుంది.

10 Essential Oils For Relieving Gout Pain

3. బాసిల్ ఎసెన్షియల్ ఆయిల్ :

బాసిల్ ఎసెన్షియల్ ఆయిల్, అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడుకుని ఉన్నందువలన అనేక సంవత్సరాలుగా ఔషధపరమైన మూలికగా వినియోగించడం జరుగుతుంది. గౌట్ సమస్య, తీవ్రమైన మండే అనుభూతిని కలిగించే కీళ్ళలోని వాపుకు కారణమవుతుంది. మరియు బాసిల్ ఎసెన్షియల్ ఆయిల్ వాపు మరియు శోథ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది వాపును మరియు శోధ నుండి ఉపశమనం కలిగించి దాని శీతలీకరణ లక్షణాలతో మంట మరియు సంచలనాలను తగ్గించగలదు.

10 Essential Oils For Relieving Gout Pain

4. లెమన్గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్ :

లెమన్గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్ దానిలోని యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా గౌట్ చికిత్సలో సహాయపడుతుందని చెప్పబడింది. ఇంటర్నేషనల్ ఫుడ్ రీసెర్చ్ జర్నల్లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో “లెమన్గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్ యొక్క బయో యాక్విటివిటీ” (Cymbopogon cytrutus)' విశ్లేషణ ప్రకారం ఈ ఎసెన్షియల్ నూనెను వినియోగించినప్పుడు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించగలదని పేర్కొంది. క్రమంగా మూత్రపిండాలలో స్పటికాలు ఏర్పడకుండా చూడగలదు.

10 Essential Oils For Relieving Gout Pain

5. థైమ్ ఎసెన్షియల్ ఆయిల్ :

థైమ్ ఎసెన్షియల్ ఆయిల్ ఒక స్వచ్చమైన సువాసనను కలిగి, వంటలలో మంచి రుచిని జోడిస్తుంది. థైమ్ ఎసెన్షియల్ నూనెలలో, శోథ వ్యతిరేక లక్షణాలను ప్రేరేపించే ఫ్లేవనాయిడ్స్, అర్సోలిక్ మరియు ఓలియానోలిక్ ఆమ్లాల వంటి సమ్మేళనాలను కలిగి ఉంటుంది. దీనిలోని నైట్రిక్ ఆక్సైడ్, వాపును తగ్గించడంలో సహాయం చేస్తుంది. జర్నల్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఫార్మకాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం వాపు లక్షణాలను తగ్గించడంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్తమంగా పనిచేస్తుంది.

10 Essential Oils For Relieving Gout Pain

6. ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ నూనెలో శోథ నిరోధక మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాల గనిగా చెప్పబడుతుంది. మధ్యధరా ప్రాంతంలో, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనెను గొంతు మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సల కోసం వినియోగించే ఒక ఆయుర్వేదిక్ ఔషధంగా పరిగణించబడుతుంది. దీనిలో ఓలియోకాన్తల్, ఓలియూరోపీన్, హైడ్రాక్సీటైరోసాల్ మరియు లిగ్నన్స్ వంటి పాలీఫెనోల్స్ ఉంటాయి. ఇవి గౌట్ నొప్పిని తగ్గించడంలో అత్యుత్తమంగా పనిచేస్తాయని చెప్పబడింది.

10 Essential Oils For Relieving Gout Pain

7. చమోమిలే (చామంతి) ఎసెన్షియల్ ఆయిల్ :

చామంతిలో క్వెర్సెటిన్, లుటిటోలిన్, మరియు యాపిజెనిన్ వంటి ఫ్లేవనాయిడ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది అనాల్జేసిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది, ఇది గౌట్ నొప్పిని తగ్గిస్తుంది, తద్వారా గౌట్ సమస్య నుండి ఉపశమనం అందిస్తుంది.

10 Essential Oils For Relieving Gout Pain

8. అల్లం నూనెల సారం :

అల్లాన్ని ఒక మసాలా దినుసుగానే కాకుండా, ఒక ఔషధంగా కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటు గౌట్ వ్యతిరేక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. జర్నల్ ఆఫ్ ఎథ్నోఫార్మాకాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించగలవు మరియు భవిష్యత్తులో గౌట్ సమస్యలను నిరోధించగలదు. కేవలం అల్లం నూనెను, కారియర్ నూనెలతో విలీనం చేసి, ఆ ప్రాంతంలో వర్తించడం ద్వారా, ఉత్తమ ప్రయోజనాలను పొందగలరు.

10 Essential Oils For Relieving Gout Pain


9. సెలరీ సీడ్ నూనె :

ఒక అధ్యయనంలో, 'సమ్మేళన శోథ నిరోధక చికిత్స : NSAIDs / మూలికలతో కూడిన కార్టికోస్టెరాయిడ్స్ / జంతు సంబంధిత పదార్ధాలు', ప్రకారం ఇండియన్ సెలెరీ సీడ్ ఆయిల్ గౌట్ చికిత్సలో వాపు, మరియు శోధను తగ్గించగలిగేలా, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుందని పేర్కొంది.

10 Essential Oils For Relieving Gout Pain

10. టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్

టీ ట్రీ ఎసెన్షియల్ నూనెలో క్రిమిసంహారక మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి గౌట్ వంటి పరిస్థితులకు ఉత్తమ చికిత్సగా ఉండగలవు. క్యారియర్ నూనెతో టీ ట్రీ ఎసెన్షియల్ నూనెను బ్లెండ్ చేసి, ప్రభావిత ప్రాంతం నందు సమయోచితంగా దరఖాస్తు చేసుకోవడం ద్వారా, వాపుకు గురికాబడిన నరాలకు, గౌట్ నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

గౌట్ సమస్యతో బొటన వేలు బాగా నొప్పి పుడుతుంది, ఈ పది ఎసెన్షియల్ నూనెలతో గౌట్ నొప్పుల నుంచి ఉపశమనం

10 Essential Oils For Relieving Gout Pain
Desktop Bottom Promotion