For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రీన్ టీనే కాదు గ్రీన్ కాఫీ కూడా ఉంది, అది తాగితే ఎన్ని లాభాలో తెలుసా, మీరు టేస్ట్ చేయండి

|

అసలు గ్రీన్ కాఫీ అంటే ఏమిటి ?

గ్రీన్ కాఫీ బీన్స్, సాధారణ కాఫీ బీన్స్ వలె రోస్ట్ చేయబడినవి కావు. రోస్ట్ చేసే ప్రక్రియలో క్లోరోజెనిక్ యాసిడ్ సమ్మేళనాల మొత్తం తగ్గుదలకు గురవుతుంది. క్రమంగా, సాధారణంగా కాల్చిన కాఫీ బీన్స్ తీసుకునే మనం, క్లోరోజెనిక్ యాసిడ్ స్థాయిలను తక్కువ మొత్తంలో స్వీకరించడం జరుగుతుంది. కానీ ఇది గ్రీన్ కాఫీ మాదిరిగా, అంత ప్రయోజనకరమైనది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్ కాఫీ బీన్స్ లో అధికంగా ఉండే ఈ క్లోరోజెనిక్ యాసిడ్స్ ఉనికి అనేక ఆరోగ్య ప్రయోజనాలకు మూలంగా ఉంటుందని విశ్వశిస్తున్నారు.

what is green coffee and its benefits

గ్రీన్ కాఫీ బీన్స్ శరీరానికి ఏవిదంగా సహాయపడగలవు ?

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఈ సమ్మేళనాలు యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉన్నాయని భావిస్తున్నారు. క్రమంగా రక్తపోటును తగ్గించడంలో మరియు బరువు తగ్గడంలో ఉత్తమంగా సహాయపడుతాయని చెప్పడం జరిగింది. గ్రీన్ కాఫీ యొక్క వినియోగం ద్వారా, మీ శరీరం సంగ్రహించే ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్లను క్రమబద్దీకరిస్తుంది. క్రమంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా డయాబెటిస్ నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తుంది.

గ్రీన్ కాఫీ బీన్స్ మీ ఆరోగ్యానికి ఏవిధమైన ప్రయోజనాలను అందిస్తుందో తెలుసుకోడానికి ఈ వ్యాసం సహకరిస్తుంది.

what is green coffee and its benefits

గ్రీన్ కాఫీ ప్రయోజనాలు :

1. జీవక్రియలను పెంచుతుంది :

గ్రీన్ కాఫీలోని క్లోరోజెనిక్ ఆమ్లం శరీర జీవక్రియలను పెంచే బూస్టర్ వలె పనిచేస్తుంది. ఇది శరీరం యొక్క మెటబాలిక్ రేట్ (BMR) ను ఒక విస్తారమైన స్థాయికి పెంచుతుంది. ఇది కాలేయం నుండి విడుదలయ్యే గ్లూకోజు అధిక స్థాయిలను రక్తములోకి చేరనీయకుండా, నిలువరించగలుగుతుంది. క్రమంగా, శరీరంలో గ్లూకోజ్ అవసరాలను తీర్చడానికి, కొవ్వు కణాలలో నిల్వ చేసిన అదనపు కొవ్వును కరిగించడం ప్రారంభిస్తుంది.

what is green coffee and its benefits

2. గుండె ఆరోగ్యాన్ని నిర్వహిస్తుంది :

LDL (చెడు) కొలెస్ట్రాల్, హృదయ సంబంధిత వ్యాధికి, అనగా., ప్రధానంగా కార్డియో వస్క్యులర్ సమస్యలకు కారకంగా ఉంటుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ నిర్మాణం ధమని ద్వారాలను సన్నగిస్తుంది. ఈ పరిస్థితిని అథెరోస్క్లెరోసిస్ అని వ్యవహరిస్తారు. ఈ పరిస్థితిలో ధమని మార్గాలలో ఫలకాలు ఏర్పడి., రక్త ప్రవాహం నియంత్రించబడడం జరుగుతుంది. గ్రీన్ కాఫీలోని క్లోరోజెనిక్ ఆమ్లం చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అందుచేతనే, గుండెకు ప్రయోజనకరంగా చెప్పబడుతుంది.

what is green coffee and its benefits

3. శరీరం నుండి విషతుల్య పదార్ధాలను తొలగించే డీటాక్సిఫయర్ వలె పనిచేస్తుంది :

నిల్వచేయబడని మరియు రోస్ట్ చేయని, గ్రీన్ కాఫీ బీన్స్, అధిక మొత్తంలో అనామ్లజనకాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీసే, హానికరమైన స్వేచ్ఛా రాశులను (ఫ్రీరాడికల్స్) తొలగించడంలో సహాయం చేస్తుంది. దీని సహజ సిద్దమైన డిటాక్సిఫికేషన్ లక్షణంలో భాగంగా, కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. మరియు శరీరం నుండి విషతుల్య రసాయనాలను, మరియు అనవసరమైన కొవ్వులని తొలగిస్తుంది.

what is green coffee and its benefits

4. ఆకలిని అణచివేస్తుంది :

మీరు బరువుని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారా ? అయితే ఈ గ్రీన్ కాఫీ మీకు ఖచ్చితంగా సహాయం చేయగలదు. ఇది మీ ఆకలిని అరికట్టే క్రమంలో భాగంగా, మీ అవాంఛిత ఆహార కోరికలను నియంత్రించడం మరియు అతిగా తినడం నుండి మిమ్మల్ని నిరోధించడం ద్వారా, బరువు తగ్గడంలో సహాయం చేయగలదు. గ్రీన్ కాఫీ బీన్స్లో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లం, ఆకలిని అణచివేసే మందుగా పనిచేస్తుంది.

what is green coffee and its benefits

5. రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది :

గ్రీన్ కాఫీ బీన్స్ రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. మీరు డయాబెటిక్ అయితే, గ్రీన్ కాఫీని తీసుకోవడం మూలంగా, అది శరీరంలో చక్కెర లభ్యతను తగ్గిస్తుంది. క్రమంగా, మీ చిన్న ప్రేగులలో చక్కెరల శోషణ తగ్గుతుంది. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది మరియు రక్తంలోని చక్కెర స్థాయిలు రక్త ప్రవాహంలోకి అధికంగా చేరడాన్ని, తగ్గించడంలో సహాయపడుతుంది.

గ్రీన్ కాఫీ బీన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ :

ప్రతి ఆహారంలోనూ ప్రయోజనాలు ఎలా అయితే ఉంటాయో, అదేవిధంగా కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. దేనికి కూడా ఒక పరిమితి అనేది ఉంటుంది. కావున, అవసరమైన మోతాదులను నిర్ధారించుకుని వినియోగించడమే అత్యంత కీలకమైన అంశంగా ఉంటుంది. అదేవిధంగా గ్రీన్ కాఫీ సురక్షితమే కాని, ఇది కూడా సాధారణ కాఫీలోని కెఫీన్ నిల్వలతో సమానంగా ఉంటుందని అర్థం చేసుకోవడం ముఖ్యం.

అనేకమంది వ్యక్తులు తరచుగా, అదనపు కెఫీన్ కారణంగా, నరాల బలహీనత, అవిశ్రాంతత, తలనొప్పి మరియు హృదయ స్పందనలలో అసాధారణ మార్పులు, ఆందోళనలు మొదలైనవి తలెత్తుతుంటాయి. క్లోరోజెనిక్ యాసిడ్ అధిక మోతాదులు, ప్లాస్మా హోమోసిస్టీన్ స్థాయిలను పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇది గుండె జబ్బుతో ముడిపడి ఉంటుంది. కావున, ఏది కూడా పరిమితికి లోబడే ఉండాలని నిర్ధారించుకోండి.

గ్రీన్ కాఫీని తీసుకోడానికి సూచించదగిన ఉత్తమ సమయం ?

మీ భోజనం తర్వాత గ్రీన్ కాఫీ తీసుకోడానికి అనువైన సమయంగా ఉంటుంది. ఎందుకంటే తిన్న తర్వాత సాధారణంగా, మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం సహజం. కార్బోహైడ్రేట్లు మరియు ఆహారంలో ప్రోటీన్ కంటెంట్ కూడా పెరుగుతుంది. గ్రీన్ కాఫీ, రక్తంలో చక్కెర స్థాయిలలో వచ్చే ఆకస్మిక మార్పులను నిరోధించగలవు. క్రమంగా రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది. ఏది ఏమైనా కెఫీన్ స్థాయిలను అధికంగా తీసుకోవడం లేదని నిర్ధారించుకోవడం మంచిది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

గ్రీన్ కాఫీ అంటే ఏమిటి ? దానివలన చేకూరే లాభాలేమిటి?

what is green coffee and its benefits
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more