For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉందా ? ఐతే ఈ జాగ్రత్తలు కంపల్సరీ..

By Nutheti
|

నయం చేయడం కంటే ముందుగానే నిరోధించడం చాలా మంచిదని చాలా మంది చెబుతుంటారు. నిజమే ఎందుకంటే.. సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించడం కష్టమవుతుంది. అదే ముందు జాగ్రత్త పాటిస్తే ఎలాంటి సమస్య దరిచేరదు.

డయాబెటీస్ లేదా మధుమేహం అనేది అంటువ్యాధిలా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ కంటే ఎక్కువ మంది ఈ డయాబెటీస్ తో బాధపడుతున్నారు. ఇది కుటుంబంలో ఎవరికైనా ఉంటే చాలా ఇబ్బందికర పరిస్థితే. ఎందుకంటే వంశపారంపర్యంగా ఇది సోకే ప్రమాదం ఉంది.

READ MORE: షుగర్ (డయాబెటిస్) ను కంట్రోల్ చేసుకోవడానికి ఇంటి చిట్కాలు

ఒకవేళ పేరెంట్స్ కి లేదా తోబుట్టువులకు ఎవరికైనా టైప్ టు డయాబెటీస్ ఉంటే.. జీవితంలో ఎప్పుడో ఒకసారి డయాబెటీస్ వచ్చే అవకాశాలున్నాయి. ఇతర అనారోగ్య సమస్యల కంటే టైప్ టు డయాబెటీస్ అనేది జన్యుపరంగా రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి.

కాబట్టి ఫ్యామిలీలో ఎవరైనా డయాబెటీస్ తో బాధపడుతుంటే ముందుగానే దాన్ని అరికట్టే ప్రయత్నం చేయాలి. సహజమైన రెమిడీస్ తో డయాబెటీస్ ని నిరోధించవచ్చు. ఇంట్లో ఎవరో ఒకరు మధుమేహంతో బాధపడుతున్నప్పుడు దాన్ని అరికట్టడాన్ని చాలెంజింగ్ గా తీసుకోవాలి. మధుమేహం మీ వరకు రాకుండా ఉండాలంటే.. ఈ సింపుల్ పద్ధతులు ఫాలో అవడం మంచిది.

డైట్

డైట్

కుటుంబ సభ్యుల్లో ఎవరైనా డయాబెటీస్ తో బాధపడుతుంటే.. ముందుగా చేయాల్సిన పని.. మంచి డైట్ ఫాలో అవడం. ఫైబ్ ఫుడ్, తృణధాన్యాలు, గుండెకు మేలు చేసే ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి. ఈ మూడు రకాల ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకుంటే.. మధుమేహం రాకుండా కాపాడుకోవచ్చు.

శ్యాచురేటెడ్ ఫుడ్స్ కి దూరంగా

శ్యాచురేటెడ్ ఫుడ్స్ కి దూరంగా

శ్యాచురేటెడ్ ఫుడ్స్, ఫ్యాట్ ఫుడ్స్ ని అసలు తీసుకోకూడదు. ఇంట్లో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే.. అది వేగంగా ఇతరులకు వ్యాపించడానికి కారణమవతాయి. ఆరోగ్యకరమైన, తక్కువ ఫ్యాట్ ఉన్న ఆహారం తీసుకోవడం చాలా మంచిది.

వ్యాయామం

వ్యాయామం

డయాబెటీస్ ని నిరోధించడానికి వ్యాయామం చాలా అవసరం. స్విమ్మింగ్, మెట్లు ఎక్కుడం, జిమ్ కి వెళ్లడం వంటి వ్యాయామాలు రెగ్యులర్ గా చేయడం వల్ల డయాబెటీస్ ని నియంత్రించవచ్చు. రోజుకి కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తారు.

చెడు అలవాట్లను మానేయడం

చెడు అలవాట్లను మానేయడం

మద్యంతాగడం, పొగతాగడం వంటి అలవాట్ల కారణంగా టైప్ టు డయాబెటీస్ కి కారణమవుతాయి. ముఖ్యంగా వంశపారంపర్యంగా వేగంగా సోకే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ అలవాట్లు ఉంటే నెమ్మదిగా మానేయడం మంచిది.

చక్కెర

చక్కెర

చక్కెర తీసుకోవడం ఎంత తగ్గిస్తే అంతమంచిది. షుగర్ కి బదులు తేనె, బెల్లం వంటివి తీసుకుంటూ ఉండాలి. ఫ్యామిలీలో ఎవరైనా డయాబెటీస్ తో బాధపడుతున్నప్పుడు చక్కెర తీసుకోవడంలో చాలా జాగ్రత్త వహించాలి.

ఆయిల్స్ విషయంలో

ఆయిల్స్ విషయంలో

కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉన్నప్పుడు టైప్ టు డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. దీనికి మనం తీసుకునె నూనెలు కూడా కొన్ని సందర్భాల్లో కీలకపాత్ర పోషిస్తాయి. ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె వంటివి ఆరోగ్యానికి మంచిది. కాబట్టి వీటినే తీసుకోవాలి. ఇందులో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది... ఆరోగ్యానికీ మంచిది.

బీపీ కంట్రోల్

బీపీ కంట్రోల్

ఫ్యామిలీలో ఎవరికైనా మధుమేహం ఉన్నప్పుడు బీపీ కంట్రోల్ లో ఉండేలా జాగ్రత్త పడాలి. హై బ్లడ్ ప్రెజర్ కారణంగా టైప్ టు డయాబెటీస్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి.

ఒత్తిడికి దూరంగా

ఒత్తిడికి దూరంగా

ఒత్తిడి రకరకాల అనారోగ్య సమస్యలకు కారనమవుతుంది. ప్రశాంతంగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా డయాబెటీస్ ఉన్నప్పుడు ఒత్తిడి సాధ్యమైనంత వరకు దరిచేరకుండా చూసుకుంటే డయాబెటిస్ కు దూరంగా ఉండవచ్చు.

English summary

How To Prevent Genetics of Diabetes: health in telugu

Diabetes has become an epidemic and has affected more than a million people in the world. This common disease becomes all the more difficult and complicated when it runs in the family.
Desktop Bottom Promotion