For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరల్డ్ డయాబెటిస్ డే: డయాబెటిస్ ను కంట్రోల్ చేసే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!

వరల్డ్ డయాబెటిస్:ప్రమాధకరమైన వ్యాధిని నివారించుకోవడానికి, కంట్రోల్ చేసుకోవడానికి చాలా మార్గాలున్నాయి. సమయానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్‌గా డాక్టర్‌తో చెకప్‌ చేయిస్తూ, సూచనలు పాటిస్తే..

|

వరల్డ్ డయాబెటిస్ డే: మధుమేహం...ప్రపంచవ్యాప్తంగా మానవాళికి పెను ఆరోగ్య సమస్యగా మారుతున్న వ్యాధి. ఒకప్పుడు అరవై ఏళ్లు పైబడిన వారికి వచ్చే వృద్దుల వ్యాధిగా దీనిని భావించే వారు. ఇప్పుడు ఇది యువకుల వ్యాధిగా రూపాంతరం చెందుతోంది. డయాబెటిస్‌ జబ్బు కాదు. కానీ ఎన్నో జబ్బులకు కారణం. ఇది ఒక శారీరక స్థితి.. డైజెస్టివ్‌ డిజార్డర్‌. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. ఈ ప్రాణాంతకమైన వ్యాధికి ముఖ్య కారణం ఒబేసిటి. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ అధికంగా ఉండే వారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఇలాంటి ఊబకాయస్తుల్లో ఉండే ఫ్యాట్ ఇన్సులిన్ కు అనుసందానం కలిగి ఉంటుంది.

1985లో ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ల డయాబెటిస్‌ కేసులుంటే 2013 నాటికి 382 మిలి యన్లకు పెరిగాయి. 2035 నాటికి 592 మిలియన్‌ డయాబెటిస్‌ కేసులు నమోదయ్యే ప్రమాదముందని అంచనా. దాదాపుగా మన దేశంలో ప్రతీ కుటుంబంలో ఒక్కరైనా డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. ప్రతీ నలుగురిలో ఒకరు డయాబెటిస్‌ బాధితులు. ప్రపంచ వ్యాప్తంగా మనదేశమే డయాబెటిస్‌కి కేపిటల్‌ గా ఉంది. ప్రస్తుతం దేశంలో సుమారు 50 మిలియన్ల డయాబెటిస్‌ కేసులున్నాయని తెలుస్తోంది. 2025 నాటికి 60 మిలియన్లు దాటే అవకాశాలున్నాయి.

World Diabetes Day: Home Remedies To Control Diabetes

ప్రమాధకరమైన వ్యాధిని నివారించుకోవడానికి మరియు కంట్రోల్ చేసుకోవడానికి చాలా మార్గాలున్నాయి. సమయానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్‌గా డాక్టర్‌తో చెకప్‌ చేయిస్తూ, సూచనలు పాటిస్తే డయాబెటిస్‌ పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. మరి డాక్టర్స్ సలహా ప్రకారం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? రెగ్యులర్ డైట్ ఏంటి అనేది చాలా మందిలో మెదిలో ఆలోచన? డాక్టర్స్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలని సూచించినా మీరు రెగ్యులర్ డైట్ లో ఎలాంటి ఆహారం ఉండాలని తెలుసుకోవడం చాలా అవసరం. మరి డయాబెటిస్ ను కంట్రోల్ చేసే ఆహారాలేంటోచూద్దాం...

ఆమ్లా:

ఆమ్లా:

ఆమ్లాను ఇండియన్ గూస్బెర్రీ అని కూడా పిలుస్తారు., టైప్ 2 డయాబెటసి్ ను నివారించడంలో ఇది ఒక అమ్మమ్మల మెడిస్ . ఆమ్లాలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ప్యాక్రియాటిస్ ను డిటాక్సిఫై చేస్తుంది. జీక్రియలను మెరుగుపరుస్తుంది. కాబట్టి, ఇన్సులిన్ ఉత్పతి క్రమబద్దం చేస్తుంది. ఆమ్లా జ్యూస్ లేదా ఆమ్లా పౌడర్ ను గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి.

తులసి:

తులసి:

తులసి ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే శక్తిని కలిగి ఉంటాయి. తులసి ఆకులలో ఆక్సీకరణ ఒత్తిడి ఉపశమనానికి శక్తివంతమైన యాంటీఆక్సిడాంట్స్ కలిగి ఉంటాయి. మధుమేహం సమస్యల కాంపౌండ్స్ ఒత్తిడిని తగ్గిస్తుంది. తులసి ఆకులను నేరుగా తినడం కానీ, లేదా ఆకులను పేస్ట్ చేసి, కాలీపొట్టతో తినడం కానీ చేయాలి.

ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్స్ సీడ్స్ లో ఫైబర్ అత్యధికంగా ుంటుంది. ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ను ఒక గ్లాసు నీటిలో మిక్స చేసి తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. కాక్టస్ రసం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాక్టస్ రసం రక్తంలో గ్లూకోజ్ మరియు ఇన్సులిన్ స్థాయిలను స్థిరీకరించేందుకు మరియు తగ్గించుటకు సహాయం చేస్తుంది. అవిసె గింజలను తీసుకుంటే భోజనం తర్వాత చక్కెర స్థాయి 28 శాతం తగ్గుతుంది.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్కలో అనేక ప్రయోజనాలు దాగున్నాయి. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించి, ఇన్సులిన్ ని మెరుగుపరుస్తుంది. కాబట్టి.. కాఫీ, బ్రెడ్ వంటి వాటిపై కాస్త చెక్క పొడి చల్లుకుని తింటే మంచిది.

మునగాకు :

మునగాకు :

ఈ ఆకులలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండుట వలన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మునగాకును మెత్తగా పేస్ట్ చేసి, అందులోని రసాన్ని ఒక గిన్నెలో నిల్వచేసుకుని, రోజూ ఒక టీస్పూన్ పరగడపున తాగితే మంచి ఫలితం ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

 కాకరకాయ :

కాకరకాయ :

కాకరకాయ జ్యూస్ ను ప్రతి రోజూ రెగ్యులర్ గా ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే షుగర్ లెవల్స్ ను (బ్లడ్ మరియు యూరిన్ లో)కంట్రోల్లో ఉంచుతుంది .దీనిలో ఉండే ఇన్సులిన్ పోలిపెప్టైడ్-P అనే బయో-రసాయనం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం కొరకు ఉపయోగకరంగా ఉంటుంది. కాకరకాయతో కాకరకాయ వంటకం, కాకరకాయ టీ, వంటలు, కూర మరియు సూప్ లు వంటివి తయారుచేసుకోవచ్చు. కాకరకాయలో ఫైటోన్యూట్రీయంట్స్ అధికంగా ఉన్నాయి. ఇది రక్తంలోని గ్లూకోజ్ ను కాలేయం, మజిల్స్ వంటి ఇతర బాగాలకు అందేలా చేస్తుంది . డయాబెటిక్ ఉన్నవారిలో ఇన్సులిన్ లెవల్స్ తగ్గించడానికి అందేలా చేస్తుంది . అలాగే ఆల్ఫా గ్లూకోసిడైజ్ ఎంజైమ్ ను తగ్గిస్తుంది ఇది హైపర్ గ్లూకోమియా లెవల్స్ తగ్గిస్తుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి

వేప:

వేప:

మధుమేహం చికిత్స కోసం, వేప లేత ఆకులను ఉపయోగిస్తారు. మధుమేహంనకు మంచి పరిష్కారంగా ప్రతి రోజు ఉదయం వేప ఆకుల జ్యూస్ తీసుకోవాలి.వేపాకులను రెండు మూడు నోట్లో వేసుకుని నమిలి మింగడం లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం మంచిది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడం వల్ల ఇది గ్రేట్ ఆయుర్వేదిక్ రెమెడీ. వేపలో ఉండే ఔషధలక్షణాల వల్ల , ఇది ఒక ఉత్తమం యాంటీ హైపర్ గ్లిసిమక్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉన్నది.

మెంతులు:

మెంతులు:

మెంతిఆకులు మరియు ఇతర కొన్ని రకాల హెర్బ్ ను డయాబెటిస్ లక్షణాలను కూడా నివారిస్తుంది. కానీ అన్ని రకాల హెర్బ్స్ లోకి మెంతిఆకులు బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్టెబుల్ గా ఉంచతుంది . గ్లూకోజ్ టాలరెన్స్ ను మరియు గ్లూకోజ్ ఎక్సెర్సన్ ను క్రమబద్దం చేస్తుంది. మెంతులను రాత్రంతా ఒక గ్లాసు నీటిలో నానబెట్టి, ఉదయం పరగడపున తాగాలి. మెంతులతో పాటు తాగితే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

English summary

World Diabetes Day: Home Remedies To Control Diabetes

The number of diabetes cases has been rising across the country at such an alarming rate that according to a few reports India has already been tagged as the diabetes capital. Hence, it is high time that people become conscious and take immediate steps to control diabetes.
Story first published: Monday, November 14, 2016, 13:01 [IST]
Desktop Bottom Promotion