For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిస్ ఉన్న మహిళలకు ఎక్కువ రోజులు జీవించేందుకు కెఫిన్ సహాయపడుతుందట..

|

కాఫీ లేదా టీ త్రాగటం వల్ల మీ ఆరోగ్యానికి హానికరమని మీరు ఎల్లప్పుడూ వింటూనే ఉన్నారు. కానీ ఆశ్చర్యకరంగా, కెఫిన్ ఒకరి ఆరోగ్యానికి మంచిది అని ఒక అధ్యయనం ప్రకారం కనుగొనబడింది.

ప్రతిరోజూ టీ (లేదా) కాఫీ తాగుతున్నప్పుడు, డయాబెటిక్ స్త్రీలలో మరణం సంభవించే అవకాశాలను తగ్గిస్తుంది అని కొత్త పరిశోధన ప్రకారం బట్టబయలయ్యింది.

<br><strong>అలర్ట్: కాఫీ తాగితే పిల్లలు పుట్టే అవకాశం లేదా!?</strong>
అలర్ట్: కాఫీ తాగితే పిల్లలు పుట్టే అవకాశం లేదా!?

ఈ అధ్యయనంలో పోర్చుగల్ లోని పోర్టో విశ్వవిద్యాలయ పరిశోధకులు, అమెరికాలోని మధుమేహంతో ఉన్న 3,000 మంది స్త్రీ మరియు పురుషులకు - కెఫిన్ ను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వారి మరణాల మధ్య గల వివిధ స్థాయిల మధ్య సంబంధాన్ని పరిశీలించారు.

health benefits of coffee

1999 నుండి 2010 వరకు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. ఈ అధ్యయనం కనుగొన్న వాస్తవాల ప్రకారం; రోజుకు 100mg వరకు కాఫీని తీసుకునే, మధుమేహం ఉన్న మహిళలు - కెఫీన్ వినియోగించనివారి కంటే 51 శాతం తక్కువగా చనిపోయే అవకాశం ఉంది.

రోజువారీ కాఫీని 100-200mg లుగా వినియోగించిన డయాబెటిక్ స్త్రీలు - వినియోగించని వారితో పోల్చితే 57 శాతం తక్కువ చనిపోయే అవకాశం కలిగి ఉన్నారని రుజువయ్యింది. అలాగే రోజుకు కాఫీని 200mg కి పైన వినియోగించేవారికి చనిపోయే అవకాశం 66 శాతం ఉందని గుర్తించారు.

మరోవైపు, టీ నుండి మరింత ఎక్కువ కెఫిన్ను తీసుకునే మహిళలను, టీ నుండి 0% కెఫిన్ వినియోగంతో టీ త్రాగే మహిళలతో పోలిస్తే - కెఫిన్ను తీసుకునే మహిళల్లో క్యాన్సర్ ప్రమాదాన్ని 80 శాతం వరకూ తగ్గిస్తుంది.

ఇటీవలి ఈ అధ్యయనాన్ని, 2017 యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ (EASD) లిస్బన్లో నిర్వహించిన వార్షిక సమావేశంలో సమర్పించబడింది.

డయాబెటిక్స్ (షుగర్ వ్యాధి) నుండి తప్పించుకోవటానికి అవసరమైన కొన్ని ఆహారాల పదార్థాలను కూడా పరిశీలించండి.

1. చక్కెర :

1. చక్కెర :

ఎన్నో రూపాలలో బాధపడుతున్న మధుమేహం వ్యాధిగ్రస్తులకు 'చక్కెర' అనేది కఠినమైనది కాదు. శరీరంలో చక్కెర స్థాయిని సమతౌల్యంగా ఉంచడానికి, చక్కెరను నివారించడం సహాయపడుతుంది.

2. పాల ఉత్పత్తులల్లో కొవ్వు :

2. పాల ఉత్పత్తులల్లో కొవ్వు :

పాలు, వెన్న మరియు జున్ను వంటి పాల ఉత్పత్తులలో పరిపూర్ణమైన కొవ్వు అధిక మొత్తంలో ఉంటాయి. ఈ పాల ఉత్పత్తుల వల్ల డయాబెటిక్స్ సమస్య ఇంకా మరింత క్రిందకు దిగజారుతున్నాయి. అందువల్ల ఈ పాల ఉత్పత్తులను నివారించడం ఎల్లప్పుడూ మంచిదే.

3. ప్రాసెస్ చేసిన ఆహారాలు :

3. ప్రాసెస్ చేసిన ఆహారాలు :

ప్రాసెస్ చేసిన ఆహారాలు ముఖ్యంగా మాంసం అధికంగా తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. మీరు మధుమేహంతో బాధపడుతున్నట్లయితే ఇది సమస్యను మరింత ఎక్కువ వేగవంతం చేస్తుంది.

4. మద్యపానం (ఆల్కహాల్) :

4. మద్యపానం (ఆల్కహాల్) :

రక్తంలో చక్కెర మరియు ఇన్సులిన్ స్థాయిలను పరిరక్షించడానికి "కాలేయం" ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి, మద్యపాన-వినియోగం అధికంగా ఉంటే అది కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది, అలాగే ఇది (కాలేయం) రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది.

5. బాగా వేయించిన ఆహార పదార్థాలు :

5. బాగా వేయించిన ఆహార పదార్థాలు :

నూనెలో బాగా వేయించిన ఆహార పదార్థాలు అధిక స్థాయి కొవ్వులను కలిగి ఉంటాయి, దీని వల్ల అదనపు బరువును పొందటానికి ఇది ఒక మార్గముగా ఉంటుంది. అందువల్ల ఇది ఇన్సులిన్ నిరోధకతను ప్రభావితం చేస్తుంది.

English summary

Caffeine To Help Diabetic Women Live longer - Study; Foods Diabetics Should Avoid

Drinking tea or coffee on a regular basis helps lower the risk of death in diabetic women, finds a new research.
Story first published:Tuesday, September 19, 2017, 11:17 [IST]
Desktop Bottom Promotion