Latest Updates
-
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే -
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026 -
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా
డయాబెటిక్ పేషంట్స్ వాటర్ మెలోన్ తినవచ్చా..? తింటే ఏమౌతుంది
సమ్మర్ సీజన్ అంటే వాటర్ మెలోన్ సీజన్, జ్యూసీగా, నోరూరించే టేస్టీ, స్వీట్ ఫ్రూట్ వాటర్ మెలోన్.సమ్మర్లో వాటర్ మెలోన్ ను చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు.
వాటర్ మెలోన్ బ్లడ్ షుగర్ లెవల్స్ మీద ప్రభావం చూపుతుందా? మొదట డయాబెటిస్ కు కారణమయ్యే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం...
ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో, శరీరంలోని ఇన్సులిన్ ఆహారాలు జీర్ణమైన తర్వాత గ్లూకోజ్ ను విడుదల చేస్తుంది. ఇది ఎనర్జీ(శక్తి)గా మారుతుంది. హైబ్లడ్ షుగర్ లెవల్స్ ఎక్కువైతే ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అనేక వ్యాధులకు దారితీస్తుంది.
ఎండల నుండి చర్మ నల్లగా మారకుండా..రక్షణ కల్పించే వాటర్ మెలోన్
సహజంగా డయాబెటిక్ పేషంట్స్ కు ఆహారాల మీద చాలా అపోహలుంటాయి. ఎలాంటి ఆహారాలను తినాలి. ఎలాంటి ఆహారాలు తినకూడదనే అపోహాలు చాలా మందిలో ఉంటాయి. మీరు డయాబెటిక్ అయితే, ఖచ్చితంగా కొన్ని ఆహారాలు దూరంగా ఉండాలి, కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఫ్రూట్ విషయంలో ఇప్పుడు సమ్మర్లో ఎక్కువగా అందుబాటులో ఉండే వాటర్ మెలోన్ (పుచ్చకాయ లేదా కర్భూజ). డయాబెటిస్ పేషంట్స్ వాటర్ మెలోనో తినొచ్చా తినకూడదా అని అపోహ ఉంటుంది.
సమ్మర్లో వాటర్ మెలోన్ మిస్ కాకుండా తినాలి అనడానికి ఫర్ఫెక్ట్ రీజన్స్
ఫ్రూట్స్ అన్నింటిలోకి వాటర్ కంటెంట్ అధికంగా ఉండే ఫ్రూట్ వాటర్ మెలో, కేవలం వాటర్ కంటెంట్ మాత్రమే కాదు, న్యూట్రీషియన్స్ కూడా ఎక్కువ. అయితే డయాబెటిక్ వారు దీన్ని తినకపోవడమే మంచిది. లేదా డాక్టర్ ను సంప్రదించి తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే వాటర్ మెలోన్ బ్లడ్ షుగర్ లెవల్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ను తెలుసుకుందాం...

ఫ్యాక్ట్ #1
బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవాలంటే, ప్రతి మీల్స్ లో 40నుండి 60 కార్బోహైడ్రేట్స్ మన శరీరానికి అందుతాయి. కాబట్టి ఒక కప్పు వాటర్ మెలోన్ లో ఆల్రెడీ 14 గ్రాముల కార్బోహైడ్రేట్స్ అందుతాయి, అందువల్ల మీరు తీసుకునే తర్వాత భోజనంలో కార్బోహైడ్రేట్స్ ను ఖచ్చితంగా తగ్గించుకోవాల్సి ఉంటుంది.

ఫ్యాక్ట్ #2
వాటర్ మెలోన్ లో గ్లిజమిక్ ఇండెక్స్ 72 . అంటే ఇది ఖచ్చితంగా బ్లడ్ షుగర్ లెవల్స్ మీద తప్పకుండా ప్రభావం చూపుతుంది. ఇది ఫాస్ట్ గా జీర్ణమవుతుంది, కాబట్టి, ఖచ్చితంగా బ్లడ్ షుగర్ లెవల్స్ అసమతుల్యతల మీద ప్రభావం చూపుతుంది.

ఫ్యాక్ట్ #3
వాటర్ మెలోన్ తినాలనుకునే వారు, బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్థిరంగా ఉంచుకోవాలంటే, లో గ్లిజమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తో పాటు వాటర్ మెలోన్ కూడా తీసుకోవచ్చు.

ఫ్యాక్ట్ #4
వాటర్ మెలోన్ తిన్న తర్వాత భోజనం తీసుకోవాలంటే, క్యాలరీలను మరియు ఇతర కార్బోహైడ్రేట్ కంటెంట్ ను బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే వాటర్ మెలోన్ కూడా తీసుకోవచ్చు.

ఫ్యాక్ట్ #5
ఒక కప్పు వాటర్ మెలోన్ లో దాదాపు 12 గ్రాముల షుగర్ కంటెంట్ ఉంటుంది, 55 క్యాలరీలు మరియు 15 గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాగే ప్రోటీన్ ఫుడ్స్ లేదా లో గ్లిజమిక్ ఫుడ్స్ ఉన్న ఆహారాలతో పాటు వాటర్ మెలోన్ తీసుకోవాలని సూచన. ఓట్ మీల్ మంచి చాయిస్. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్థిరంగా ఉంచుతుంది.



Click it and Unblock the Notifications