For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిస్ వారు కొబ్బరి నీళ్ళు త్రాగవచ్చా? లేదా? మీ సందేహానికి సమాధానం ఇక్కడ ఉంది!!

|

ప్రకృతి మనకు అందించే స్వచ్ఛమైన పదార్ధాలలో ఒకటి కోకనట్ వాటర్. అనేక ప్రయోజనాలను కలిగి ఉన్న ఈ కోకనట్ వాటర్ సహజంగా తీయ్యగా ఉంటాయి. బరువు తగ్గడానికి మరియు ఎనర్జిటిక్ గా ఉండటం కోసం ముఖ్యంగా కొబ్బరి నీరు త్రాగుతారు. ఈ నీరు తీపి రుచి కలిగి ఉన్నప్పటీకీ వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి మరియు కేలరీలు తక్కువగా ఉన్నందున బరువు తగ్గడానికి కోకనట్ వాటర్ ను సిఫార్సు చేయబడింది.

డయాబెటిస్ ఉన్నవారు కోకనట్ వాటరు త్రాగవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. వీటి వల్ల ప్రయోజనాలున్నాయా? లేవా? అనేది చర్చనీయాంశం. కోకనట్ వాటర్ తీపి రుచి కారణంగా, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని చాలా మంది వీటిని త్రాగడానికి భయపడుతుంటారు, అయితే కేలరీలను తగ్గించడం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని కొందరి వాదన. మరి వీటిలో ఏది నిజమో చూద్దాం.

కొబ్బరి నీరు ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరూ ఇష్టపడే సహజసిద్దమైన పానీయం, ఇది సాధారణమైన పానీయం, కృత్రిమ పదార్థాలు మరియు కృత్రిమ స్వీటెనర్లను చేర్చబడి ఉండవు. కోకనట్ వాటర్లో కాల్షియం, భాస్వరం, జింక్, మాంగనీస్, ఐరన్, కాపర్ మరియు ప్రాథమిక అమైనో ఆమ్లాలు, పొటాషియం మరియు సోడియం యొక్క రెండు ముఖ్యమైన లవణాలు ఇందులో ఉన్నాయి. కొబ్బరి నీటిలో ఫ్రక్టోజ్ (15%), గ్లూకోజ్ (50%) మరియు సుక్రోజ్ (35%) వంటి సహజ చక్కెరలు కూడా ఉన్నాయి. డయాబెటిస్ బాధితులు కొబ్బరి నీళ్ళు తాగవచ్చో లేదో చూద్దాం..

మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొబ్బరి నీరు సురక్షితమేనా?

మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొబ్బరి నీరు సురక్షితమేనా?

డయాబెటిస్ ఉన్నవారు నిరభ్యంతరంగా తాగవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 2015 లో డయాబెటిస్ పై జరిపిన అధ్యయనంలో డయాబెటిస్ ఉన్న యువకులకు డైట్ పరీక్షను విజయవంతంగా ఆమోదించింది. చక్కెర ఉన్నవారికే కాకుండా ఇతరులు కూడా ప్రతిరోజూ కొబ్బరి నీళ్ళు త్రాగవచ్చు. అయితే మీరు ఎంత మోతాదులో తీసుకుంటున్నారన్న విషయంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. కొబ్బరి నీళ్ళలో ఉండే ఫ్రక్టోజ్ ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ కొబ్బరి నీటిలో తక్కువ ఫ్రక్టోజ్ (సుమారు 15%) ఉంటుంది, మరియు ఫ్రక్టోజ్ మీ రక్తంలో చక్కెర స్థాయికి ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి మితంగా మాత్రమే తీసుకోవాలి.

ఎంత తాగాలి?

ఎంత తాగాలి?

రోజుకు రెండుసార్లు సగటున 8 ఔన్సుల నీరు, 250 మి.లీ వరకు త్రాగాలి. ఈ మోతాదు మించితే కనుక మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కొబ్బరి బోండాంకు ఇతర పదార్ధాలను జోడించకుండా నీరును దాని సహజ రూపంలో తాగడం మంచిది. కోకనట్ వాటర్ మధుమేహానికి ఎందుకు మంచివో పరిశీలిద్దాం.

పోషకాలు

పోషకాలు

ముందే చెప్పినట్లుగా, మన శరీరానికి అవసరమైన పోషకాలు, అమైనో ఆమ్లాలు మరియు ఖనిజాలు ఉంటాయి. ఈ రుచిగల పానీయం ప్రతి కప్పులో 5.8 మి.గ్రా విటమిన్ సి, 0.1 మి.గ్రా రిబోఫ్లేవిన్, 57.6 మి.గ్రా కాల్షియం, 60 మి.గ్రా మెగ్నీషియం, 600 మి.గ్రా పొటాషియం, 252 మి.గ్రా సోడియం మరియు 0.3 మి.గ్రా మాంగనీస్ ఉన్నాయి. ఈ పోషకాలు, ముఖ్యంగా సోడియం మరియు పొటాషియం, రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులను నియంత్రించడంలో సహాయపడతాయి.

అధిక ఫైబర్ మరియు తక్కువ కార్బోహైడ్రేట్లు

అధిక ఫైబర్ మరియు తక్కువ కార్బోహైడ్రేట్లు

డయాబెటిస్ ఉన్నవారు తాము తీసుకునే కార్బోహైడ్రేట్ల గురించి జాగ్రత్తగా ఉండాలి. వాస్తవానికి, డయాబెటిస్ ఉన్నవారు ఫైబర్ అధికంగా మరియు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఈ కార్బోహైడ్రేట్లు సహజంగా చక్కెరలలో అధికంగా ఉంటాయి మరియు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని వేగంగా పెంచుతాయి, ఇది డయాబెటిస్ ఉన్నవారికి హానికరం. కొబ్బరి నీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది (240 గ్రాముల కొబ్బరి నీటికి 2.6 గ్రాములు), ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

రక్త ప్రవాహం మెరుగుపరుస్తుంది

రక్త ప్రవాహం మెరుగుపరుస్తుంది

డయాబెటిస్ ఉన్నవారు రక్త ప్రవాహ సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్య కారణంగా, వారు తరచుగా కాళ్ళలో అసౌకర్యం, దృష్టి మసకబారడం మరియు మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతుంటారు. రోజూ తగినన్ని మంచినీరు తాగడం వల్ల, కొబ్బరి నీళ్ళు త్రాగడం వల్ల ఈ సమస్యలను నయం చేయవచ్చు. ఇది రక్త నాళాలను విస్తరించడం ద్వారా రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. అథెరోస్క్లెరోసిస్ అనే డయాబెటిక్ రుగ్మతలను నయం చేసే శక్తి కూడా దీనికి ఉంది.

బరువు మెయింటైన్ చేయడానికి

బరువు మెయింటైన్ చేయడానికి

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య క్రమంగా బరువు పెరగడం. మంచినీరు తాగడం వల్ల అనవసరమైన ఆకలి నుండి ఉపశమనం లభిస్తుంది. ఇందులో అవసరమైన లవణాలు మరియు ఖనిజాలు వంటి పోషకాలతో సంపూర్ణ సమ్మేళనం మరియు కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. కోకనట్ వాటర్ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మరియు యాంటీఆక్సిడెంట్ల యొక్క అద్భుతమైన మూలం. చక్కెర మరియు బరువు స్థిరంగా మెయింటైన్ చేయడం డయాబెటిస్‌ వారికి రెండూ చాలా అవసరం.

జీవక్రియను పెంచుతుంది

జీవక్రియను పెంచుతుంది

కొబ్బరి నీరు జీవక్రియను ప్రేరేపించడానికి సహాయపడుతుంది, ఇది శరీరంలో కొవ్వును కరిగించడానికి జీవ ప్రక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ వారు కొబ్బరి నీటిని త్రాగడం వల్ల వారిలో రోగులకు మరింత ఎనర్జీని అందివ్వడానికి సహాయపడుతుంది.

ఏ సమయంలో ఎలాంటి కొబ్బరి నీరు త్రాగాలి:

ఏ సమయంలో ఎలాంటి కొబ్బరి నీరు త్రాగాలి:

కోకనట్ వాటర్ ను ఉదయం పరగడపున త్రాగితే మంచిది, వీటిలోని ఖనిజలవణాలు శరీరానికి పుష్కలంగా అంది, మెండైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. డయాబెటిస్ వారు గుర్తించుకోవల్సిన మరో ముఖ్యమైన విషయం కొబ్బరి బోంఢాం చాలా లేతగా కొబ్బరి లేని కాయలను ఎంపిక చేసుకోవాలి. లేత కొబ్బరి బొంఢాంలోని నీరు వగరుగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటుంది.

English summary

Is Drinking Coconut Water Safe For Diabetics?

Read to know is drinking coconut water safe for diabetics.