For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డైటింగ్ ప్రియులూ..ఈ లాభాలను గ్రహించారా?

By B N Sharma
|

Dieters Must Know These Diet Tips & Benefits!
డైటింగ్ చేసేవారంతా బరువును కోల్పోవాలని చక్కని షేప్ పొందాలని అనుకుంటారు. ఈ ప్రక్రియలో డైటర్లు తక్కువ తినటం...అధికంగా వ్యాయామం చేయటం చేస్తారు. కాని వీరికి మరికొన్ని టిప్స్ తెలిస్తే అతి తక్కువ సమయంలోనే మంచి ఫలితాలను కూడా పొందగలరు. ఆరోగ్యకర ఆహారం వలన ప్రయోజనాలు చూడండి. ఆరోగ్యకర ఆహారం మీ బరువు తగ్గించటమే కాదు...బాడీకి చక్కటి షేప్ ఇస్తుంది. శరీరాన్ని వ్యాధులనుండి సంరక్షిస్తుంది. అంతేకాక డైటింగ్ చేసేవారు ఆకర్షణీయమైన ముఖ వర్ఛస్సు కూడా కలిగి ఎంతో ఫిట్ గాను, చురుకుగాను వుంటారు.

మీరు చేసే డైటింగ్ మంచి ఫలితాలనివ్వాలంటే కొన్ని ఆహార నియమాలు చూడండి. అసలు మీరు డైటింగ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? దీనికి జవాబు మీరు గ్రహించడం ఒక మంచి టిప్ కాగలదు. బరువు తగ్గాలా? సన్నబడాలా? లేక శారీరక వ్యాధులనుండి రక్షణ పొందటానికా లేక గుండె పోట్లు, హార్టు బ్లాకేజీలు రాకుండా కాపాడుకోడానికా? ఈ సమాచారం ఏదైనప్పటికి, కఠోరమైన మీ ఆహార నియమావళి ఏదైనప్పటికి మేము ఇచ్చే అదనపు సమాచారాన్ని పరిశీలించండి.

అధికంగా నమలటం, తక్కువమొత్తంలో ఆహారం తినటం చేయండి. సరి అయిన పోషక పదార్ధాలను కావలసిన పరిమాణంలో మాత్రమే తీసుకోండి. అతి తక్కువ తీసుకుంటే బలహీనం, జీర్ణవ్యవస్ధకు హాని కలుగుతాయి. ప్రొటీన్లు అధికంగా కల పచ్చటి ఆకు కూరలు, పండ్లు తీసుకోండి. తక్కువ కొవ్వుకల పాల ఉత్పత్తులు కాల్షియం బాగా ఇచ్చేవి తీసుకోండి. నీరు అధికంగా తాగండి. పోషకాహారాలు తీసుకోవడమే కాదు. శరీరం ఎల్లపుడూ నీటితో కూడా నిండివుండాలి. పొట్ట భర్తీగా వుండటంలచే మీ ఆకలి కూడా నియంత్రించబడుతుంది. భోజనం అయిన గంట తర్వాత వేడి నీరు తాగండి. అనవసరమైన కేలరీలు ఖర్చు అయిపోతాయి. అన్నిటికంటే ప్రధానమైంది, మీరు ఏ ఆహారం తిన్నప్పటికి వెంటనే నీరు తాగవద్దు. సరిగ్గా గంట తర్వాత తాగండి. దాహమనిపిస్తే కొద్ది నీరు మాత్రమే తీసుకోండి.

బాదం పప్పులు, పిస్తాలు, మొదలైన ఎండు ఫలాలను తినండి. పప్పులలో కేలరీలు వుంటాయనే అపోహను పక్కన పెట్టండి. అది నిజం కాదు. ఇవి మీకు విటమిన్లను, ప్రొటీన్లను అందించి శక్తినిస్తాయి. ఆకలిని నియంత్రిస్తాయి. ఎపుడు ఆకలి అయినా కొన్ని పప్పులు తినండి. మీ కిష్టమైన ఆహారాలను పూర్తిగా వదిలేయకండి. అయితే, వాటి పరిమాణం తగ్గించండి. ఒక చాక్లెట్ బాక్స్ కొనేబదులుగా ఒక చిన్న చాక్లెట్ చప్పరించేయండి. ఆహారం సరియైనది కాకున్నా మీకు ఇష్టం అనిపిస్తే వారానికోసారి తినటం హాని కలిగించదు. మీ కిష్టమైన మసాలాలు, ఇతర రుచులతో, రుచికరమైన ఆహారాన్ని భుజించి మానసిక తృప్తి పొందండి. ఈ చర్య మీరు అధికంగా తినటాన్ని నియంత్రిస్తుంది. అంతేకాదు మీ డైటింగ్ ఆహారానికి అపుడపుడూ కొద్దిపాటి రుచిని అందిస్తుంది.

English summary

Dieters Must Know These Diet Tips & Benefits! | డైటింగ్ ప్రియులూ..ఈ లాభాలను గ్రహించారా?

Don't quit your favorite food completely: It is not necessary to leave your favorite food completely. Reduce the quantity. Instead of buying a chocolate box, go for a slice of chocolate. Having your favorite food once in a week is not wrong if the quantity is less.
Story first published:Wednesday, October 5, 2011, 10:11 [IST]
Desktop Bottom Promotion