For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీరో సైజ్..!.సిక్స్ ప్యాక్...! అధ్భుత ఫలితాల ‘ఒకినవ డైట్’!

By B N Sharma
|

Okinawa Diet
నేటి ఫ్యాషన్ ప్రపంచంలో, మహిళలుకానీ, లేదా పురుషులు కానీ సన్నగా, నాజూకుగా వుండటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. యువతులకు... జీరో సైజుల క్రేజ్ కాగా యువకులకు సిక్స్ ప్యాక్ పొట్ట క్రేజ్! దేశంలోని ప్రధాన దుస్తుల తయారీ కంపెనీలు కూడా అధిక సైజుల దుస్తులను వివిధ రకాలుగా తయారు చేయటం లేదు. ఇక మన డైటీషియన్లు కూడా సింపుల్ డైట్ తో యువతులు సన్నగా, నాజూకుగా, యువకులు తాము కలలు కనే సిక్స్ ప్యాక్ యాబ్..లతో తయారయేటందుకు తమవంతు కృషిగా అద్భుత ఫలితాలనిచ్చే జపాన్ దేశపు 'ఒకినవ డైట్' ప్లాన్ సూచిస్తున్నారు.

చాలామంది, జపాన్ ద్వీపాల ప్రజలు ఆచరించే 'ఒకినవ డైట్' ప్లాన్ సన్నబడటానికి ఉత్తమమైందని చెపుతున్నారు. దీనిలో పోషకాలు ఎక్కువ, కేలరీలు తక్కువ. అందుకేనేమో జపాన్ దేశ ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజలకంటే కూడా ఆరోగ్యంగాను, దీర్ఘకాలంగాను జీవిస్తూంటారు. ఒకినవ డైట్ తీసుకుంటే జీవితకాలం పెరుగుతుందని పోషకాహార నిపుణులు కూడా సలహానిస్తున్నారు.

ఒకినవ డైట్ ప్రత్యేకతలు పరిశీలిస్తే....
1. కేలరీలు తక్కువ: తక్కువ కేలరీలు తీసుకుంటే వయసు త్వరగా మీదపడదు. బాడీ మాస్ ఇండెక్స్ తక్కువ. జపాన్ ద్వీపవాసులు సగటు జపాన్ దేశ వ్యక్తి కంటే కూడా ఈ డైట్ ప్లాన్ తో 20 శాతం తక్కువ కేలరీలు తీసుకుంటున్నారు.

2. యాంటీ ఆక్సిడెంట్ డైట్: ఇందులో తీసుకునే కూరగాయలు, పండ్లులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుంటాయి. ఇవి ఆరోగ్యాన్నివ్వటమే కాక జీవితకాలాన్ని పెంచుతాయి.

3. షుగర్, కొవ్వులు వుండవు - ఈ ఆహారంలో మూడువంతులు ధాన్యాలు, ఒకవంతు షుగర్ మాత్రమే వుంటాయి. ఈ రకమైన ఆహారం గుండెజబ్బులను దూరంగా వుంచుతుంది.

4. తక్కువ కేలరీలు కల ఈ ఆహారం ప్రధానంగా నీరు కలిగిన పుచ్చకాయ, మొలకెత్తిన విత్తనాలు కలిగి వుంటుంది. ఇక సీఫుడ్స్ లో చేప వుంటుంది. గుడ్లు, మాంసం లేదా పాల ఉత్పత్తులు అసలే వుండవు. వీరి ఆహారంలో అత్యధిక పోషకాలు కల సోయా కూడా ఉపయోగిస్తారు.

English summary

How To Get Leaner With Okinawa Diet? | జీరో సైజ్..!.సిక్స్ ప్యాక్...! అధ్భుత ఫలితాల ‘ఒకినవ డైట్’!

Okinawa diet, the famous Islander diet is the best diet to get lean say many followers. The nutrient rich diet is low calorie and originated from the Okinawa Islands in Japan. The popular weight loss diet is gaining popularity even in the scientific field as the Japanese are comparatively healthy and live longer than the rest of the world.
Story first published:Saturday, August 20, 2011, 11:49 [IST]
Desktop Bottom Promotion