For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు త్వరగా తగ్గాలంటే....!

By B N Sharma
|

బరువు త్వరగా తగ్గాలని షుగర్ సంబంధిత ఆహారాలు మానేస్తున్నారా? మానకండి...వాటిని తక్కువ షుగర్ వుండే సహజ ఆహారాలతో, హాని కలిగించని ఆహారాలతో మార్పు చేయండి.

1. తేనె - తినే ఆహారంలో షుగర్ కు బదులు తేనె వాడండి. తేనెలో వుండే తీపి మీ ఆరోగ్యానికి హాని కలిగించదు. తాగే పానీయాలు...టీ, కాఫీ, జ్యూసులు మొదలైనవాటిలో మీకు తెలియకుండానే ప్రతిరోజూ అధిక షుగర్ వాడేస్తారు. వీటిలో కనుక షుగర్ కు బదులు తేనె వాడితో ఎన్నో అధిక కేలరీలు తగ్గించవచ్చు.

2. బ్రౌన్ రైస్ - బియ్యం, ప్రత్యేకించి తెల్లటి బియ్యం, గోధుమ బ్రెడ్ మొదలైనవి వాడకండి. వీటిలో కార్బో హైడ్రేట్లు అధికంగా వుంటాయి. వీటికి బదులుగా బ్రౌన్ రైస్, లేదా బ్రౌన్ బ్రెడ్ వంటివి వాడండి.

3. డైరీ ఉత్పాదనలు - షుగర్ వేయని ఒక గ్లాసెడు పాలు తాగవచ్చు. తక్కువ కొవ్వు కల ఆల్మండ్ బటర్, చీస్ వంటివి తినండి.

4. దుంప కూరలు - బంగాళ దుంప, ఉల్లిపాయలు, బీట్ రూట్ మొదలైన దుంప కూరలలో షుగర్ అధికం. బంగాళ దుంప పూర్తిగా నిలిపివేయండి. మిగిలినవి కొద్ది మొత్తాలలో తీసుకోండి. బ్రక్కోలి, గోంగూర, బఠాణి, బేబీ కార్న్ వంటివి తినవచ్చు.

5. తక్కువ షుగర్ పండ్లు - అరటిపండ్లు, మామిడిపండు, పైన్ ఆపిల్ తినవద్దు. వాటి స్ధానంలో ఆపిల్స్, బెర్రీలు (స్ట్రాబెర్రీ, గూస్ బెర్రీ, మొదలైనవి), పుచ్చకాయ, ఇంకా నిమ్మజాతి పుల్లటి పండ్లు తినవచ్చు.

బరువు తగ్గాలనుకునేవారు ఈ రకమైన జాగ్రత్తలు పాటించి షుగర్ తినటం మానేస్తే, ఫలితం చాలా త్వరగా వుంటుందని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.

English summary

What Is A Perfect Low Sugar Diet? | బరువు త్వరగా తగ్గాలంటే....!

Fruits are always good for your health but not all fruits are low in sugar content. If you are trying to loose weight or diabetic then your low sugar diet must not contain bananas, mangoes, pineapples as they are very fattening. You can have apples, all the berries (strawberry, gooseberry, etc), watermelon and most of the citrus fruits that are low in sugar. Have fruits with more water and fiber content; it will be filling and the sugar percentage will automatically come down.
Story first published:Monday, November 21, 2011, 14:37 [IST]
Desktop Bottom Promotion