For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీనేజ్ గర్ల్స్ లో చిరు బొజ్జ తగ్గించడానికి చిట్కాలు...

|

To Reduce Belly Fat for Teen Girls....
టీనేజ్ గర్ల్స్ అంటే నాజూగ్గా... అందంగా ఉంటారు. టీన్ గర్ల్స్ బెల్లీ(చిరు బొజ్జ) తగ్గించడానికి కొన్ని మంచి మార్గాలున్నాయి. చాలా మంది టీనేజ్ గర్ల్స్ లో శీఘ్ర జీవక్రియ కలిగి ఉంటారు. వారిలో బొడ్డుక్రింద చిరు బొజ్జ ఆటోమాటిక్ గా పెరిగిపోతుంటుండి. టీనేజ్ గర్ల్స్ బరువుతో పాటు కొన్ని అవయవాలు అభివద్ది చెందుతుంటాయి. దాంతో పాటు పొట్టకూడా పెరుగుతుంది. దాంతో టీనేజ్ గర్ల్స్ తమ నచ్చిన డ్రెస్ లు వేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. కొన్ని సందర్భానిరాశ చెందుతుంటారు. అలా నిరాశ చెందకుండా టీనేజ్ గర్ల్స్ బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి...

1. ముఖ్యంగా టీనేజ్ లో ఉన్న అమ్యాయిలైన... అబ్బాయిలైన సరే స్వీట్ ను తగ్గించాలి. పంచదారతో తయారు చేసి వంటలు దూరంగా ఉండాలి. ముఖ్యంగా టీనేజ్ లో వున్నవాళ్ళు ఎక్కువగా కేక్స్, కుక్కీస్, మరియు ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి చిరు తిండ్లకు అడ్డుకట్ట వేస్తే తప్పకుండా మీ చిరు బొజ్జను తగ్గించుకోవచ్చు. బయటతినేటప్పుడు తప్పకుండా వాటి మీద ఉన్న లేబుల్స్ ను తప్పకుండా దృష్టి పెట్టాలి. అప్పుడు షుగర్ ఫుడ్ కి, శీతలపానీయాలను పరిమితం చేసుకోగలుగుతారు.

2. ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయమం చేయాలి. అందుకు ఒక సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి. ప్రతి రోజూ అరగంట పాటు వ్యాయామం చేయడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. వాకింగ్, జాగింగ్, ఆడే క్రీడలు, లేదా ఈత కొట్టడం వంటి అతి తర్వగా ప్రయోజనాలను చూపెట్టే వ్యాయామాలను ఎంపిక చేసుకోవాలి. అలాగే శరీరానికి నీటి అవసంర చాలా ఉంటుంది కాబట్టి ఎక్కువ నీటిని సేవించడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది.

3. ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఎక్కువగా పచ్చిని ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకొంటుండాలి. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బాగా పనిచేసి కొవ్వును నిల్వనియకుండా అడ్డుకుంటుంది. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఫ్రైడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉంటే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.

4. ముఖ్యంగా బరువు తగ్గాలనుకొనే వారు. చిరు బొజ్జను తగ్గించాలనుకొనే వారు కనీసం వారానికి ఒక సారి తప్పనిసరిగా బరువును చెక్ చేసుకుంటుండాలి. ఇలా చేయడం వల్ల మిమ్మల్ని మీరు అలర్ట్ చేసుకొంటారు. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడిని ఆహారపు అలావాట్లు, వ్యాయామం తప్పనిసరిగా క్రమం తప్పకుండా పాటిస్తే బరువును క్రమంగా తగ్గుతారు. దానికోసం ప్రతిరోజూ సమతుల్య ఆహారం తీసుకోవాలి.

English summary

To Reduce Belly Fat for Teen Girls.... | టీనేజ్ గర్ల్స్ లో ‘చిరు బొజ్జ’

Best way To Reduce Belly Fat for Teen Girls. Many teen girls have a fast metabolism. For teenage girls, belly fat can be a huge disaster. Some teenage girls struggle with their weight, and they look for effective ways to lose belly fat. Every girl in this stage wants to appear their best. If you are in your teens, and if you are obese, there’s no real need to despair. There are many several techniques to help teenagers reduce stomach bulge.
Story first published:Wednesday, August 1, 2012, 13:22 [IST]
Desktop Bottom Promotion