For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియన్ ఖచ్చితంగా తినాల్సిన ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్!

|

ప్రపంచవ్యాప్తంగా చూస్తే, మన ఇండియాలో ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ తీసుకొనే వారి సంఖ్య చాలా తక్కువ. చాలా మంది మధ్యధరా ఆహారాలను లేదా ఇతర అన్యదేశపు ఆహార ప్రణాళికలను తీసుకుంటూ బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ నిజానికి, మన ఇండియన్ ఫుడ్స్ లో చాలా వరకూ ఫ్యాట్ బర్నింగ్ (కొవ్వు కరిగించే సామర్థ్యం)కలిగిన ఆహారాలు చాలా ఉన్నాయి. ఈ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ మరెక్కడో లేవు. మన వంటగదిలోనే ఉన్నాయి. బహుశా వాటిని మనం గమనించి ఉండం లేదా వాటి గురించి మనకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. మన ఇండియన్ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ ను ప్రపంచంలోని ఇతరులు కూడా ప్రయత్నించవచ్చు.

మన ఇండియాలోని ఫ్యాట్ బర్న్స్ (కొవ్వు కరిగించే)వస్తువులను గురించి తెలుసుకోవాలంటే, ముఖ్యంగా అవి చాలా ఆరోగ్యకరమైన వస్తువులు మాత్రమే కాదు, మన ఇండియాలో చాలా మంది ఫ్యాట్ బర్నింగ్ వస్తువులను బరువు తగ్గడానికి ఉపయోగించారు. ఈ ఆరోగ్యకరమైన పదార్థాలను మన ఇండియన్ వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు: మస్టర్డ్ ఆయిల్. ఇది మన ఇండియాలో ఫ్యాట్ బర్న్ కోసం చాలా ఉపయోగకరమైనదిగా ఉపయోగిస్తుంటారు. కానీ, ప్రపంచంలోనే వారందరూ మాత్రం ఆలీవ్ ఆయిల్ ఆరోగ్యకరమైన ఒక నూనె మాత్రమనే తెలిసుంటారు. కానీ ఇందులో ఫ్యాట్ బర్నింగ్ లక్షణాలుంటాయని ఎవ్వరి తెలిసుండకపోవచ్చు. అంతే కాదు, మస్టర్డ్ ఆయిల్ కూడా ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్ గా ఉంది.

చాలా రకాల సుగంధ ద్రవ్యాలను ఫ్యాట్ బర్నర్స్ గా మన ఇండియాలో ఉపయోగిస్తున్నారు. మన భారతీయ వంటకాల్లో కొన్ని వెరైటీ మసాలా దినుసులను ఉపయోగిస్తారని మనందరికీ తెలిసిన విషయమే. మరియు ఈ సుగంధ పదార్థాలు, ఆరోగ్యకరమైన పదార్థాలుగానే కాదు ప్రధానంగా గణనీయంగా బరువును కోల్పోవడానికి కూడా సహాయపడుతాయి. ఉదాహరణకు: కొవ్వు కరిగించే సుగంధ ద్రవ్యం-దాల్చిన చెక్క. దీన్ని మరో విధంగా కూడా ఉపయోగిస్తారు. పంచదారకు ప్రత్యామ్నాయంగా చెక్కను ఉపయోగిస్తుంటారు.

మన ఇండియాలో విరివిగా ఉపయోగించే అటువంటి ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్, మన ఇండియన్స్ ఖచ్చితంగా ఉపయోగించాల్సినవి కొన్ని మీకోసం...

పసుపు:

పసుపు:

మన భారతి వంటిగది సుగంధ పరిమళ వస్తువు పసుపు. ఇది ఒక హెల్తీ స్పైసీ పదార్థం. పసుపు టాక్సిక్ ఫ్యాట్స్ ను కరిగించడంలో, బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో అల్లిసిన్(allicin)అనే అంశం కలిగి ఉండి యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండి శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది.

రెడ్ మిర్చి:

రెడ్ మిర్చి:

పచ్చిమిర్చిలో క్యాప్సైసిన్ అనే అంశం కలిగి ఉండటం వల్ల శరీరంలోని జీవక్రియల రేటును పెంచుతుంది మరియు వీటిని తిన్న 15నిముషాలకే క్యాలరీలను కరిగిస్తుంది. స్పైస్ ఫుడ్ ఐటమ్స్ ఖచ్చితంగా బరువును తగ్గిస్తాయి. బాడీ ఫ్యాట్ ను తగ్గించానుకొంటే రెడ్ చిల్లి, బ్లాక్ పెప్పర్, చిల్లీ పెప్పర్ ఇటువంటి స్పైసీ ఫుడ్స్ కు ప్రాధాన్యతను ఇవ్వండి. ఇవి శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచి బరువును తగ్గిస్తుంది.

గుడ్డు:

గుడ్డు:

గుడ్లలో అధిక ప్రోటీనులు మరియ ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఉండి అతి తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. మీ శరీరాన్ని, కండర పుష్టిని పెంచుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది. అధిక కొవ్వును నియంత్రించడానికి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచుకోవడానికి గుడ్లు బాగా సహాయపడుతాయి. గుడ్డు ఆరోగ్యం, పోషక విలువలు కల బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే శరీర కొవ్వు కరిగి ఎనర్జీ వస్తుంది. గుడ్డు పొట్ట నింపుతుంది. కొవ్వును కరిగించి ఎనర్జీగా మార్చి శరీరానికిస్తుంది.

నిమ్మ:

నిమ్మ:

సిట్రస్ పండ్లు నిమ్మ, ఆరెంజ్, ద్రాక్ష వంటివి ఫ్యాట్ బర్నింగ్ ఫ్రూట్స్ . ఎందుకంటే వీటిలో అధికంగా ఫైబర్ మరియు విటమిన్ సి ఉండి క్రొవ్వు నిల్వలను కరిగించడానికి సహాయపడుతుంది.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

మసాలాలో వాడే దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది తీయగా, ఘాటుగా ఉంటుంది. దాల్చిన చెక్క నుండి సేకరించే నూనెలో యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలున్నాయి. అందుకే, వాటి నుండి సోకే ఏ వ్యాధులైనా సరే ఇట్టే మాయం అవుతాయి.

కాఫీ:

కాఫీ:

కాఫీ ఒక స్పెషల్ ఇండియన్ డ్రింక్ అనే చెప్పొచ్చు. ముఖ్యంగా సౌత్ లో. సహజంగా కాఫీ జీవక్రియలకు బూస్ట్ వంటిది. అందుకు రోజుకు రెండు కప్పులు కాఫీ తాగడం వల్ల బరువు తగ్గవచ్చు.

క్యాబేజ్:

క్యాబేజ్:

మన ఇండియాలో క్యాబేజ్ ను సలాడ్స్, కర్రీస్, ఫ్రైస్ వంటి వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సలాడ్స్ లో ఉపయోగించే పచ్చిక్యాబేజ్ అధనపు కొవ్వుకు కారణం అయ్యే షుగర్ మరియు కార్భోహైడ్రేట్స్ ను నిరోధిస్తుంది.

అరటి:

అరటి:

నీటి శాతం అధికం. పీచు ఉంటుంది. కడుపు నింపుతాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. మూడ్ మంచిగా ఉండేలా చేస్తాయి. గ్రీన్ గా ఉండే బనానాలో స్ట్రాంచ్ అధికంగా ఉండే ఫ్యాట్ బర్నింగ్ ప్రొసెస్ ను వేగవంతం చేస్తుంది. అరటిపండ్లు కడుపు నిండుగా ఉండేట్లు చేస్తుంది. బనానా తిని అప్పుడప్పుడూ నీళ్ళు తాగడం వల్ల రోజంతా కడుపు నిండుగా ఉండేట్లు చేస్తుంది.

టమోటో:

టమోటో:

కొవ్వు త్వరగా తగ్గాలంటే పచ్చి టమాటాలు తినండి. టమాట సలాడ్ కేన్సర్ కూడా నివారిస్తుంది. కనుక కొద్ది ఆకలి వేస్తే టమాటాలు తినండి.

మస్టర్డ్ ఆయిల్:

మస్టర్డ్ ఆయిల్:

బరువు తగ్గడానికి మీరు తీసుకొనే ఆహారంలో ఆవాలను లేదా ఆవనూనెను చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆవాల్లో ఫ్యాటీ యాసిడ్స్ (ఒలియిక్, యురిసిక్ మరియు లినోలెనిక్ ఆమ్లం)లో సాచ్యురేటెడ్ ఫ్యాట్ మరియు యాంటీఆక్సిడెంట్స్ ఉండి క్యాలొరీస్ ను బర్న్ చేస్తాయి. మరియు బరువు తగ్గిస్తాయి.

మజ్జిగ:

మజ్జిగ:

బరువు తగ్గించే ప్రోటీన్ డ్రింక్. జిమ్ లేదా ఇంట్లో వ్యాయామం చేసిన తర్వాత ఇక గ్లాసు వెన్నతీసిన మజ్జిగ త్రాగడం వల్ల బరువు సులభంగా తగ్గించుకోవచ్చు. శరీరాన్ని తేమగా ఉంచుకోవడంతో పాటు శరీరంలో నిల్వ ఉన్న మలినాలను తొలగించుకోవచ్చు. కాబట్టి లోఫ్యాట్ పెరుగు ను తీసుకోవడం వల్ల లోక్యాలరీస్ కలిగి ఉంటుంది.

ఆపిల్స్:

ఆపిల్స్:

యాపిల్స్ లో ఉన్న పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ మరియు పోషకాంశాలను అటుంచితే..యాపిల్స్ లో నీటితో కూడిన పెక్టిన్ అధికంగా ఉండటం వల్ల ఇవి ఫ్యాట్ సెల్స్ ను ఘననీయంగా తగ్గిస్తుంది.

పెసరపప్పు:

పెసరపప్పు:

ఈ పసుపు వర్ణంలో ఉండే పప్పు ధాన్యం చాలా ఆరోగ్యకరం మరియు డైటర్స్ కు ఇది పౌష్టికాహారం. పెసరపప్పులో విటమిన్ ఎ, బి, సి మరియు ఇ, ప్రోటీనులు మరియు ఫైబర్ అధికంగా ఉండి, హైబ్లడ్ ప్రెజర్ ను మరియు హై కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

తేనె:

తేనె:

కొవ్వు తగ్గించుకోవడానికి ఉదయం పూటీ తీసుకొనే తేనె ఉత్తమమైన మార్గం. తేనెను వేడినీటిలో వేసి బాగా గిలకొట్టి ఉదయం పరగడుపున సేవించాలి. ఇది ఊబకాయస్తులకు ఒక దివ్వ ఔషదం వంటిది. ఈ పద్దతిని పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. వేడి నీటిలో తేనె కలిపి తాగితే కొవ్వు కరుగుతుంది. తియ్యనైన తేనెను ఏదీ కలపకుండా కూడా తీసుకోవచ్చు. తేనెలోని కార్బో హైడ్రేట్లు జీర్ణక్రియ మెరుగుపరచి బ్లడ్ షుగర్ స్ధాయి నియంత్రిస్తాయి. బరువు వేగంగా తగ్గాలంటే, షుగర్ కు బదులు తేనెవాడండి.

పెరుగు:

పెరుగు:

లోఫ్యాట్ పెరుగులో అధికశాతంలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఫ్యాట్స్ ను కరిగిస్తుంది. ఇంకా ఇందులో కొద్దిగా క్యాలరీలు కూడా ఉంటాయి. పెరుగు ఇంకా జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. జీవక్రియ రేటును పెంచుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో బాగా సహాయపడుతుంది.

కరివేపాకు:

కరివేపాకు:

బరువు తగ్గించడంలో చాలా ప్రభావవంతగా పనిచేసే హెర్బ్స్ లో ఇది ఒకటి. ఈ కరివేపాకు ఆకులు జీర్ణక్రియను క్రమబద్దంచేయడానికి మరియు జీవక్రియలు శుభ్రపరచడానికి బాగా సహాయపడుతుంది. ఇంకా ఇది శరీరంలోని కొవ్వు నిల్వలను తొలగిస్తుంది.

యాలకులు:

యాలకులు:

సువసన భరితమైన ఈ యాలకలు బరువు తగ్గించడంలో ఉపయోగిస్తారు . దీన్ని వివిధ రకాల వంటకాల్లో మంచి ఫ్లేవర్ కోసం వినియోగిస్తారు. ఇది శరీర జీవక్రియలను మెరుగు పరిచి, నోటి దుర్వాసను దూరం చేస్తుంది.

ఎండు ద్రాక్ష:

ఎండు ద్రాక్ష:

కొన్ని డ్రై ఫ్రూట్స్ అంటే, ఖర్జూరం, ఎండుద్రాక్షవంటి పండ్లు మీ రెగ్యులర్ డైట్లో ఒక చిన్న మెత్తంలో తీసుకోవడం చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్, తాజాగా ఉండే పండ్లు కొవ్వు కరిగించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. దాంతో బరువు తగ్గవచ్చు.

అల్లం:

అల్లం:

వాపు గుండెపోటుతో అనేక కారణాలు ఒకటి. అందువలన, శోథ నిరోధక పదార్ధాలు సహా బే వద్ద వాస్కులర్ అంటువ్యాధులు ఉంచటం పారామౌంట్ ఉంది. జీర్ణవ్యవస్థను క్రమబద్దం చేసి అదనపు క్రొవ్వును కరిగిస్తుంది.

English summary

20 Fat Burners In India You Should Try

Fat burners eaten in India are usually not taken very seriously on the global front. Most people look up to Mediterranean diets or other exotic food plans to lose weight. But actually, many Indian foods have the capacity to help you slim down.
Desktop Bottom Promotion