For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గాలంటే ఈ 10 ఆహారాలు తినడం మానుకోండి

|

బరువు తగ్గడం లేదా తగ్గించుకోవడం అనేది ప్రస్తుత రోజుల్లో ఒక కష్టమైన పనిగా మారింది. ప్రతి మనం కొన్ని పౌండ్ల బరువు తగ్గించుకోవాలి అని అనుకుంటాం. కానీ, రోజు చివరన ఈ పనిలో విఫలమవుతుంటారు. అందుకు సరైన సమయం, లేదా సరైన వ్యాయామం లేదా సరైన డైట్ నియమాలు పాటించకపోవడం వల్ల, బరువు తగ్గించుకోవడం లో ఇలా విఫలం అవ్వడం జరగుతుంది. బరువు తగ్గించుకోవడంలో డైటింగ్ చాలా ఎఫెక్టివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. అంతే కాదు, ఇది అత్యంత కఠినమైన పని. కాబట్టి డైట్ విషయంలో మనం తీసుకొనే ఆహారాల గురించి(ఏవి తినాలి, ఏవి తినకూడదనే) సరైన అవగాహన కల్పించుకోవడం డైటర్స్ కు చాలా అవసరం. ఎందుకంటే, మీరు డైట్ ఫాలో చేస్తున్నప్పుడు మీ శరీరం పొందే పోషకాంశాలు, శరీరంలో ఎనర్జీస్థాయిలను నింపుతుంది.

అయితే, మీరు తినే కొన్నిఆహారాలు లోఫ్యాట్ కలిగినవి, అదే సమయంలో ఎక్కువ న్యూట్రీషియన్స్ కలిగి ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అదే సమయంలో కొన్ని ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఈ ఆహారాలు నిశ్శబ్దంగా బరువు వారించటానికి వెళ్ళి కోల్పోయే ప్రయత్నాలు చేయవచ్చు. అటువంటి ఆహారాలు అనేకం ప్రమాదకరమైనవిగా అనిపించకపోవచ్చు, కానీ, అవి మీరు పరిపూర్ణ శరీరం పొందడానికి సహాయపడవచ్చు . అందువల్ల మీరు ఖచ్చితంగా కొన్ని పౌండ్ల బరవును తగ్గించాలనుకుంటుంటే మీరు తీసుకొనే ఆహారం మీద ఒక ఖచ్చితమైన నిఘాను అనుసరించడం చాలా ముఖ్యం..

మీరు బరువు తగ్గించుకొనేందుకు ప్రయత్నిస్తుంటే, మీరు ఖచ్చితంగా నివారించాల్సిన 10 ఆహారాలు క్రింది విధంగా ఉన్నాయి...

వైట్ రైస్:

వైట్ రైస్:

చాలా తక్కువ న్యూట్రీషియన్స్ మరియు హై క్యాలరీ కౌంట్, కలిగి ఉండటం వల్ల మీరు అన్నంను తీసుకోవడానికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. అంతే కాదు, వైట్ రైస్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ఎక్కువగా పెరిగేలా చేస్తుంది. అందువల్ల, వైట్ రైస్ కు బదులు, బ్రౌన్ రైస్ ను ఎంపిక చేసుకొని ఆరోగ్యంగా ఉండండి.

ద్రాక్ష:

ద్రాక్ష:

సాధారణంగా పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తుంటారు. అయితే, ద్రాక్షలో అధిక షుగర్ కంటెంట్ ఉంటుంది. అందువల్ల మీ రెగ్యులర్ డైట్ లిస్ట్ నుండి ద్రాక్షను తొలగించండి. బరువు తగ్గించుకోవాలనుకొనేవారు, ద్రాక్షకు దూరంగా ఉండటం మంచిది.

సోడా:

సోడా:

డైట్ సోడాలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ను ఉపయోగించడం వల్ల బరువు తగ్గడానికి బదులు అతి తేలికగా బరువు పెరిగేలా చేస్తాయి. అందువల్ల, మీ మెను నుండి డైట్ సోడాను పూర్తిగా నివారించండి.

క్యాన్డ్ ఫుడ్స్:

క్యాన్డ్ ఫుడ్స్:

డబ్బాల్లో నిల్వ చేసిన ఆహారాలు మనం చూడగానే మనల్ని ఆకర్షిస్తుంటారు. మనం ఆకలిగా ఉన్నప్పుడు వాటిని వెంటనే తినేయాలని టెప్ట్ చేసేస్తాయి. అయితే డబ్బాల్లో, బాటిల్స్ లో నిల్వ చేసిన ఆహారాల్లో అధికంగా సోడియం (ఉప్పు) చేర్చబడి ఉంటుంది. డైటింగ్ చేసేవారికి ఇది చాలా చెడు ప్రభావాన్ని తలపెడుతుంది.

సాల్ట్ నట్స్:

సాల్ట్ నట్స్:

నట్స్ లో ప్రోటీనులు పుష్కలంగా ఉంటాయి. అయితే, ఉప్పుతో తయారుచేసిన నట్స్ మీకు అతి ప్రమాధకరమైన శత్రవుగా భావించాలి. సాల్ట్ నట్స్ ను ఒక సారి తినడానికి ప్రయత్నిస్తే, ఇక వాటిని తింటూనే ఉంటారు. తినడం మానడం చాలా కష్టం అవుతుంది. దాంతో మీరు అనుకొన్నదానికంటే రెంటింపుగా మీ శరీరం అధిక క్యాలరీలను గ్రహించబడుతుంది. దాంతో బరువు తగ్గడానికి బదులు బరువు పెరుగుతారు. కాబట్టి సాల్ట్ నట్స్ కు పూర్తి దూరంగా ఉండండి.

మద్యం:

మద్యం:

ప్రస్తుత ట్రెండ్ లో వీకెండ్ పార్టీలు బాగా ప్రాచుర్యం పొందాయి.చిన్న చిన్న నగరాల మొదలు, పెద్ద పట్టణాల వరకూ వీకెండ్ పార్టీలు, మద్యం తాగడం, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం జరగుతుంటాయి. ఫ్రెండ్స్ తో తాగినప్పుడు మీరు ఎంత తాగుతున్నారో మీకే తెలియదు. అటువంటప్పుడు మీ శరీరంలోనిక అధిక కాలరీలు చేర్చబడుతాయి. దాంతో మీ శరీరం మరిన్ని పౌండ్ల బరువును పెరగడం జరుగుతుంది. కాబట్టి, వీకెండ్ పార్టీలు కట్టిపెట్టండి, సులభంగా బరువు తగ్గించికోండి.

వైట్ బ్రెడ్:

వైట్ బ్రెడ్:

బ్రెడ్ లో వివిధ రకాలున్నాయి. వైట్ బ్రెడ్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను వేగంగా పెంచుతుంది. మరియు ఇంకా మీరు వైట్ బ్రెడ్ తో పాటు బటర్ ను కూడా తీసుకోవడం వల్ల మీ శరీరంలోక్యాలరీ కౌంట్ అమాంతం పెరిగిపోతుంది. కాబట్టి వైట్ బ్రెడ్ కు బదులు, గోధుమతో తయారుచేసే బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ నుఎంపిక చేసుకోండి.

సోయా సాస్:

సోయా సాస్:

సోయా సాస్ తో తయారుచేసే వంటల రుచి చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే, సోయా సాస్ లో కూడా అధిక మొత్తంలో సోడియం అంశం ఉంటుంది. ఇది కచ్చితంగా మీ శరీరంలో క్యాలరీ కౌంట్ ను తగ్గించడానికి ఏమాత్రం పనిచేయదు. అందుకే, సోయా సాస్ కు దూరంగా ఉండటం మంచిది.

చీజ్:

చీజ్:

ఫ్యాటీ చీజ్ ను పూర్తిగా నివారించాలి, మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఎంత తక్కువ చీజ్ తీసుకొన్నా, అది మీ శరీరంలో క్యాలరీలను చేర్చుతుంది. దాంతో మీ శరీరంలో ఎక్స్ ట్రా పౌండ్స్ చేర్చబడుతుంది.

రెడ్ మీట్:

రెడ్ మీట్:

రెడ్ మీట్ ఆరోగ్యకరం మరియు ఫుల్ న్యూట్రీషియన్ ఫుడ్. కానీ దీన్ని చాలా లిమిటెడ్ గా మాత్రమే మీ డైట్ లో చేర్చుకోవాలి. రెడ్ మీట్ లో ఉండే ఫ్యాట్ కంటెంట్ మీలో క్యాలరీల కౌంట్ ను పెంచేస్తుంది. అందువల్ల, మీ రెగ్యులర్ డైట్ లో రెడ్ మీట్ ను చేర్చుకొనే ముందు జాగ్రత్తగా ఉండండి...

English summary

'Avoid'These 10 Foods To Lose Weight!

Losing weight is a herculean task. Everyday we embark on the resolution of loosing those extra pounds and we eventually fail by the end of the day. Dieting is the most effective and the most tough job. Knowing about the right foods to eat and to avoid is absolutely necessary before you start dieting.
Desktop Bottom Promotion