For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తేలికగా బరువు తగ్గించే బాడీని స్లిమ్ గా మార్చే లెమన్ డైట్..!

|

నిమ్మకాయ గురించి బహు ప్రయోజనాల గురించి మనం వినే ఉంటాం. అందులో ముఖ్యంగా బ్యూటీ మరియు హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. పుల్లగా ఉండే సిట్రస్ పండ్ల రసాన్నిచర్మ, జుట్టు, మరియు ఆరోగ్య రుగ్మతల చికిత్సలకు అనేక దశాబ్దాల నుండి ఉపయోగిస్తున్నారు. కొవ్వు కరిగించడంలో నిమ్మ అద్భుతమైన పండుగా భావిస్తారు. డైటర్స్ బరువును సులభంగా తగ్గించుకోవడానికి తేనె మరియు నిమ్మరసాన్ని ఎక్కువగా తీసుకుంటారు. ముఖ్యంగా, నిమ్మకాయ డిటాక్స్(నిర్విషీకరణ)ఫ్రూట్. నిర్విషీకరణ పండు అంటే ఇది శరీరంలో హానికరమైన టాక్సిన్స్ ను మరియు ప్రమాదకరమైన ఫ్రీరాడిక్స్ ను తొలగించడానికి బాగా సహాయపడుతుంది.

కాబట్టి, మీ డైయట్ లో నిమ్మకాయను చేర్చుకోవడం వల్ల మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డైటర్స్ లెమన్ డైయట్ ను ఫాలో అవుతారాని మీకు తెలియకపోవచ్చు. లెమన్ డైట్ చాలా పాపులర్ కాబట్టి చాలా మంది సెలెబ్రెటీలు ఉదా: జెన్నిఫర్ అనిసన్, బేయాన్స్ మరియు హెడీ క్లమ్ వంటి ప్రముఖులతో ఈ లెమన్ డైట్ చాలా ప్రాచుర్యం పొందింది. లెమన్ డైట్ చాలా సులభంగా ఫాలో చేయవచ్చు. మరియు ఇది చాలా ప్రభావవంతమైనది. లెమన్ డైట్ ఫాలో అవ్వడం వల్ల స్లిమ్ గా మారడంతో పాటు, ముఖం మెరిపించేలా ప్రకాశవంతంగా మారడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

ఒక గ్లాసు నిమ్మరసం మరియు తేనె తీసుకోవడం ఒక్కటే సరిపోదు..నిమ్మకాయను తీసుకోవడానికి మరికొన్ని ఆరోగ్యకరమైన పద్దతులు కూడా ఉన్నాయి. వాటిని ఒక సారి పరిశీలించి మీ బాడీని స్లిమ్ గా మార్చుకోండి.

తేలికగా..ఎఫెక్టివ్ గా.. బరువు తగ్గించే లెమన్ డైట్...!

సాలిడ్ ఫుడ్ లేకుండా: ఎప్పుడైతే మీరు లెమన్ డైట్ పాటించాలనుకుంటున్నారో, అప్పుడు మీరు అన్నం మరియు గోధుమలు వంటివి కొన్ని రోజులు తీసుకోకపోడం మంచిది. ఇలా చేయడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను పూర్తిగా తొలగించడానికి, మలినం లేని శరీరంగా మార్చడానికి ఇది బాగా సహాయపడుతుంది.

తేలికగా..ఎఫెక్టివ్ గా.. బరువు తగ్గించే లెమన్ డైట్...!

మసాలాలు: మసాలాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ (విషాలను)ఎక్కువ చేస్తుంది. అవి జీర్ణవ్యవస్థకు ప్రభావితం చేస్తాయి. కాబట్టి లెమన్ డైట్ ఫాలో చేసేటప్పుడు మసాలా పదార్థాలను తీసుకోవడంను పూర్తిగా నిలిపేయాలి.

తేలికగా..ఎఫెక్టివ్ గా.. బరువు తగ్గించే లెమన్ డైట్...!

ఎక్కువ పానియాలు: ఎప్పడైతే మీరు లెమన్ డైట్ ఫాలో చేయడం మొదలు పెడగారు..అప్పుటి నుండి ఆరోగ్యకరమైన పానియాలను తీసుకోవాలి. ఉదా: ఫ్యాట్ బర్నింగ్ సిట్రస్ జ్యూస్ లేదా సూపులు ఎక్కువగా తీసుకోవాలి. అవి శరీరంలోని విషాలను మలినాలను తొలగించి జీర్ణక్రియను క్రమబద్ద చేయడం మరియు మీ కడుపు నిండుగా ఉన్నట్లు చేస్తుంది.

తేలికగా..ఎఫెక్టివ్ గా.. బరువు తగ్గించే లెమన్ డైట్...!

తేనె: తేనెలో పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి మరియు ఇందులో ఉండే ఫ్యాట్ బర్నింగ్ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది బరువు తగ్గడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

తేలికగా..ఎఫెక్టివ్ గా.. బరువు తగ్గించే లెమన్ డైట్...!

బ్రేక్ ఫాస్ట్: లెమన్ డైట్ ఫాలో చేసే వారికి ఉదయం తీసుకొనే అల్పాహారంలో లెమన్ పాన్ కేక్స్ తీసుకోవడం ఒక మంచి బ్రేక్ ఫాస్ట్ ఐడియా. ఇది కడుపు నిండుగా ఉంచుతుంది, మరియు రుచికరంగా ఉంటుంది. ఇంకా బరువును కూడా తగ్గిస్తుంది.

తేలికగా..ఎఫెక్టివ్ గా.. బరువు తగ్గించే లెమన్ డైట్...!

లెమన్ హని: లెమన్ హని జ్యూస్ లో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది, శరీరాన్నిశుభ్రం చేస్తుంది. ఫ్రీరాడికల్స్ తొలగిస్తుంది మరియు బరువును సులభంగా తగ్గిస్తుంది. ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే పరగడుపుతో నిమ్మ తేనెమిశ్రంతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని త్రాగాలి.

తేలికగా..ఎఫెక్టివ్ గా.. బరువు తగ్గించే లెమన్ డైట్...!

లెమన్ జ్యూస్: లెమన్ జ్యూస్ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. బరువు తగ్గిస్తుంది. శరీరాన్ని శుభ్రం చేస్తుంది మరియు ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గించుకోవాలనుకుంటే నిమ్మజ్యూస్ లో పంచదార వేసుకోకుండా త్రాగాలి.

తేలికగా..ఎఫెక్టివ్ గా.. బరువు తగ్గించే లెమన్ డైట్...!

లెమన్ పీ: మీరు లెమన్ డైట్ లో ఉన్నట్లైతే, క్రీమ్ డిజర్ట్ ను తీసుకోకూడదు. మరీ ముఖ్యంగా కృత్రిమ స్వీటెనర్లను తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు మరియు రక్తంలో చక్కర స్థాయిలను పెంచుతుంది. కాబట్టి, లెమన్ పీ(నిమ్మను ఈవిధంగా )ని తీసుకోవడం ఒక ఆరోగ్యకరమైన మార్గం.

తేలికగా..ఎఫెక్టివ్ గా.. బరువు తగ్గించే లెమన్ డైట్...!

లెమన్ సూప్: లెమన్ డైట్ ఫాలో అవుతున్న సమయంలో..మీరు నిమ్మతో తయారు చేసే అనేక రకాలైన పానియాలు తీసుకోవచ్చు. ఒక బౌల్ వేడి లెమన్ సూప్ తీసుకోవడం వల్ల రిఫ్రెష్ అవ్వొచ్చు మరియు బరువు కూడా తగ్గవచ్చు.

తేలికగా..ఎఫెక్టివ్ గా.. బరువు తగ్గించే లెమన్ డైట్...!

లెమన్ ఓవొర్ సలాడ్: రోజూ తిన్నవే తిని బోరుగా ఫీలవుతన్నా, లేదా ఒకే రుచికరమైన తిని బోరుకొడుతున్నా..లెమన్ సలాడ్ ను ట్రైచేయండి. సలాడ్స్ మీద కొన్ని చుక్కల నిమ్మరసం చిలకరించి తీసుకోవాలి.

English summary

Lemon Diet For Weight Loss.. | తేలికగా..ఎఫెక్టివ్ గా.. బరువు తగ్గించే లెమన్ డైట్...!

We all have heard the numerous health and beauty benefits of lemon. The tangy citrus fruit juice has been used since decades to treat several skin, hair and health ailments. Lemon is very popularly known as the fat burning fruit.
Story first published: Saturday, June 1, 2013, 16:07 [IST]
Desktop Bottom Promotion