For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టమ్మీ ఫ్యాట్(చిరుబొజ్జ)కరిగించే10 సాధారణ ఆహారాలు

బరువు తగ్గడానికి వ్యాయామానికి బదులు, సరైన ఆహారంను సరైన టైమ్ లో తీసుకోవడం వల్ల టమ్మీ(చిరు బొజ్జ)ను కరిగించుకోవచ్చు. అందువల్ల అధిక ప్రోటీలున్న ఈ ఫుడ్స్ ను మీ డైట్ లో చేర్చుకొని, శరీరం నుండి నీరు కోల్పోక

|

బరువు తగ్గడానికి వ్యాయామానికి బదులు, సరైన ఆహారంను సరైన టైమ్ లో తీసుకోవడం వల్ల టమ్మీ(చిరు బొజ్జ)ను కరిగించుకోవచ్చు. అందువల్ల అధిక ప్రోటీలున్న ఈ ఫుడ్స్ ను మీ డైట్ లో చేర్చుకొని, శరీరం నుండి నీరు కోల్పోకుండా మరియు మీ జీవక్రియలు వేగవంతంగా జరిగేలా చూసుకోండి.

లోయర్ బెల్లీ ఫ్యాట్ కరిగించే 15 టిప్స్ అండ్ ట్రిక్స్: క్లిక్ చేయండి

ఈ ఆహారాలు మీ పొట్టను ఫ్లాట్ గా మార్చడమే కాదు, ఇవి మీ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. అందుకోసం ఇక్కడ కొన్ని ఉత్తమమైన ఆహారాలను ఇస్తున్నాం. పొట్ట ఫ్లాట్ గా పొందాలంటే ఈ క్రింది ఆహారాలు మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాల్సిందే...

2 వారాల్లో పొట్ట కరిగించే ఉత్తమ మార్గాలు:క్లిక్ చేయండి

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్ డిటాక్సిఫైయింగ్ లక్షణాలు ఇందులో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఇది హానికరమైన బ్యాక్టీరియాను ప్రేగుల్లో నివారిస్తుంది . మరియు ఇది వాటర్ రిటన్షెన్ తగ్గిస్తుంది. మరియు శరీరం మరియు పొట్ట నుండి టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తుంది.

బాదం:

బాదం:

బాదంలో అధిక క్యాలరీలు కలిగి ఉండి బెల్లీ ఫ్యాట్ వద్ద కొవ్వు పెరగడానికి దోహదం చేయదు. అలాగే ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ చర్మానికి చాలా మేలు చేస్తుంది అలాగే ఇందులో ఫైబర్ మరియు ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇందులోని ప్రోటీనులు మీ ఆకలిని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది మరియు ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంద.

అరటి పండ్లు:

అరటి పండ్లు:

బరువు తగ్గాలనుకొనే వారు, అరటిపండ్లను తినకూడదని సలహాలిస్తుంటారు. కానీ, ఇక్కడో ట్విస్ట్ ఉంది. అరటిపండ్లలో అధికంగా పొటాషియం కలిగి ఉంది. ఇది శరీరంలో వాటర్ రిటెన్షన్ తగ్గిస్తుంది. మరియు ఇందులోని ఫైబర్ ఎక్కువ సమయం ఆకలికాకుండా సహాయపడుతుంది.

గ్రీన్ టీ: గ్

గ్రీన్ టీ: గ్

రీన్ టీ లో పోలిఫెనోల్స్ మరియు కాటెచిన్స్ వంటి కొన్ని రసాయనాలు జీవక్రియను పెంచడానికి మరియు కొవ్వును కరిగించటానికి సహాయం చేస్తాయి. మీరు ప్రతి రోజు 2 కప్పుల గ్రీన్ టీ ని తీసుకోవాలి. నడుమభాగం తగ్గించేందుకు సహాయం,అలాగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

ఈ ఫ్యాట్ తగ్గించే ఆహారాలను తీసుకొని, కొన్ని వారల్లో మీ పొట్టను ఫ్లాట్ చేసుకోవడానికి ప్రయత్నించండి..

మష్రుమ్(పుట్టగొడుగులు):

మష్రుమ్(పుట్టగొడుగులు):

మష్రుములో మనం రోజంత స్నాక్స్ తీసుకోకుండా సహాయపడుతుంది. అంది మిమ్మల్ని ఎక్కువ సమయంలో ఆకలి కాకుండా సంతృప్తిపరుస్తుంది. దాంతో మీ ఆకలి కంట్రోల్లో ఉంటుంది. ఇదే కాకుండా ఇందులో ఉండే డైటరీ ఫైఫర్ బౌల్ మూమెంట్ సరిగా అయ్యేట్లు ప్రోత్సహిస్తుంది.

ఓట్స్:

ఓట్స్:

ప్రతి రోజూ మీ దినచర్యను ప్రారంభించడానికి బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి ఇది ఒక ఉత్తమ ఆహారం. ఓట్స్ మీ పొట్టనింపడం మాత్రమే కాదు , ఆరోజుకు సరిపడే శక్తిని నిధానంగా విడుదల చేస్తూపోతుంది. ఇందులో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి మరియు మీలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

చాలా మందికి ఈ విషయంలో సందేహం ఉన్నది. ఆలివ్ ఆయిల్ కొవ్వు గలదని, అదనపు కొవ్వును కరిగించుకోవాలంటే ఆలివ్ ఆయిల్ కు దూరంగా ఉండాలని భావిస్తారు . కానీ ఆలీవ్ ఆయిల్లో కోలిక్ యాసిడ్ ఉండి, ఇది శరీరంలో అదనపు కొవ్వు కరిగించడానికి సహాయపడుతుంది. మరియు ఆలివ్ ఆయిల్లో మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ను కనుగొనబడింది. ఇది మీలో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది.

బొప్పాయి:

బొప్పాయి:

జీర్ణక్రియకు ఒక ఉత్తమమైన ఫ్రూట్ ఇది. ఇందులో పెపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణాశయంలో తిన్న ఆహారాన్ని త్వరగా విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. బెల్లీ ఫ్యాట్ ను తగ్గిస్తుంది మరియు కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది.

టమోటో:

టమోటో:

మీ బెల్లీ చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడానికి టమోటోలు బాగా సహాయపడుతాయి. ఇటి రుచికరంగా మాత్రమే కాదు, ఇవి యాంటీఆక్సిడెంట్స్ ను ప్యాక్ చేసి ఉంటాయి. శరీరంలో నీటి శాతం తగ్గిపోకుండా టమోటోలు అడ్డుకుంటుంది. మరియు ఇది లెప్టిన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మీకు ఎక్కువ సమయం ఆకలి కాకుండా మీ మెటబాలిజం ఆరోగ్యంగా ఉండేట్లు చేయడానికి సహాయపడుతుంది.

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్:

పుచ్చకాయ: వాటర్ మెలోన్ (పుచ్చకాయల్ )దాదాపు 91శాతం నీరు ఉంటుంది. ఇది లోక్యాలరీలను చాలా గొప్పగా కలిగి ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ కు కారణం అయ్యే అదనపు నీటిని శరీరం నుండి తొలగిస్తుంది. కాబట్టి, వాటర్ రిటెన్షన్ తగ్గించుకోవాలంటే మీ డైట్ లో ద్రవాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. మరియు ఇందులో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది.

English summary

10 Common Foods that Burn Tummy Fat

Protein is the most important macronutrient, when it comes to weight loss, which is why health experts state that if you add more of protein foods to your diet, there is a positive chance of you losing weight in less than 48 hours. Protein foods like whole grains, wheat, oats, brown rice, etc, are some of the foods that you should add to your daily meal.
Desktop Bottom Promotion