For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివిధ మార్గాల్లో బరువు తగ్గించే కాకరకాయ!

|

వెజిటేబుల్స్ అంటే చాలా వరకూ అందరికీ ఇష్టమే. అయితే అందులో కాకర కాయను చూస్తే చాలా మంది భయపడుతారు. ఈ డార్క్ గ్రీన్ వెజిటేబుల్ చేదు వల్లే చాలా మంది ఈ కాకరకాయకు దూరంగా ఉంటారు. కానీ ఇందులోని ఆరోగ్యప్రయోజనాలను మరియు రుచిని తెలుసుకుంటే మాత్రం తిరగి ఎప్పటీకి వదులుకోరు. కానీ, కాకరకాయ వంటలు చేసే విధానం తెలుసుకోవాలి. కాకరకాయ రసం అంటే కాయల నుండి తీసినది లేదా కాకరకాయ ఆకుల నుండి తీసినదైన సరే అందులో అధికంగా ఔషధగుణాలున్నాయి. అయితే కాకరకాయ బరువు తగ్గించడానికి సహాయపడుతుందా?

ఎవరైతే ఆరోగ్యం మరియు వారి ఫిట్ నెస్ మీద ఎక్కువ జాగ్రత్తలు తీసుకొనే వారకి కాకరకాయ ఒక అద్భుతమైన ఔషధం అని చెప్పవచ్చు. ఆరోగ్యాన్ని ఇచ్చే కాకర చేదు అయినప్పటికీ మధుమేహానికి మందు గావాడుతున్నారు. కాయ, కాకర రసము, కాకర ఆకులు మందుగా ఉపయోగపడతాయి. కాకర రసము లో " హైపోగ్లసమిక్ " పదార్ధము ఇన్‌సులిన్‌ స్థాయిలో తేడారాకుండా నియంత్రణ చేస్తూ రక్తం లొని చెక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. అలాగే బరువు తగ్గించడంలో కూడా చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుందని కూడా చెప్పవచ్చు. ఎవరైతే బరువు తగ్గించుకొనేందుకు వెయిట్ లాస్ డైట్ ను పాటిస్తున్నప్పుడు, ఈ డార్క్ గ్రీన్ వెజిటేబుల్ కాకరకాయలో అనేక న్యూట్రియంట్స్, మినిరల్స్ మరియు ఉపయోగకరమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయని, బరువు తగ్గడానికి చాలా బలమైన వెజిటేబుల్ గా సిఫారస్సు చేస్తున్నారు.

కాకరకాయలో రెండు రకాలున్నాయి. ఒకటి డార్క్ గ్రీన్ మరియు రెండవది లైట్ గ్రీన్. అది ఈ కాకరకాయ మొక్కలు లేదా తీగలు పెరిగే ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. కాకరకాయను తాజా జ్యూస్ చేసి తీసుకోవచ్చు లేదా, కర్రీ తయారుచేయవచ్చు ఇంకా ఊరగాయకూడా పెట్టుకోవచ్చు. మరి బరువు తగ్గించడంలో ఎలా పనిచేస్తుందో చూద్దాం..

కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తుంది

కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తుంది

కాకరకాయలో శరీరంలో అనవసరపు కొవ్వును తగ్గిస్తుంది. ఇలా కొవ్వును తగ్గించుకోవడం వల్ల కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అందువల్ల బరువు తగ్గించడంలో కాకరకాయ చాలా గ్రేట్ వెజిటేబుల్ అని చెప్పవచ్చు.

నీళ్ళు

నీళ్ళు

కాకరకాయలో నీటి శాతం అధికంగా ఉంది. ఇది మీ పొట్ట నిండేలా చేస్తుంది మరియు ఇది మీరు ఎక్కువ ఆహారం తీసుకోకుండా కంట్రోల్ చేస్తుంది. మరియు కాకరకాయలోని వాటర్ కంటెంట్ లో క్యాలరీలుండవు . అందువల్ల బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

ఇన్సులిన్ లెవల్స్ ను స్థిరంగా ఉంచతుంది

ఇన్సులిన్ లెవల్స్ ను స్థిరంగా ఉంచతుంది

మన శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ ను స్థిరంగా ఉంచడంలో బాగా సహాయపడుతుంది. ఇన్సులిన్ స్థాయిలో హెచ్చుతగ్గులున్నట్లైతే, అది ఆకలిని పెంచుతుంది మరియు దాంతో ఎక్కువ ఆహారం తీసుకోవాలని కోరిక కలగడంతో ఆహారం మీద కంట్రోల్ తప్పి స్థూలకాయానికి దారితీస్తుంది. కాబట్టి, కాకరకాయను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయి స్థిరంగా ఉండి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

టాక్సిన్స్ ను శరీరం నుండి బయటకు నెట్టివేస్తుంది

టాక్సిన్స్ ను శరీరం నుండి బయటకు నెట్టివేస్తుంది

బిట్టర్ గార్డ్ (కాకరకాయ), శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్(మలినాలను) ను బయటకు నెట్టి వేయడానికి సహాయపడుతుంది. ఆ మార్గంలో బరువు తగ్గించుకోవడాని సహాయపడుతుంది.

కాలేయంను ఉద్దీపన చేస్తుంది

కాలేయంను ఉద్దీపన చేస్తుంది

కాకరకాయ మన శరీరంలోని కాలేయం(లివర్)పిత్తరసాల ఉద్దీపనకు సహాయపడుతుంది. దాంతో శరీరంలో జీవక్రియలను ఉపయోగించి పిత్తరసాలను విసర్జించడంలో సహాయపడుతుంది.

క్యాలరీలను కంట్రోల్ చేస్తుంది

క్యాలరీలను కంట్రోల్ చేస్తుంది

ఇందులో క్యాలరీలు అతితక్కువగా ఉండటం చేత, బరువు తగ్గించడంలో కాకరకాయను చేర్చుకోవచ్చు. ఈ వెజిటబుల్లో మినిమమ్ క్యాలరీలు కలిగి ఉండి బరువు తగ్గడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అందువల్లే ఇది వెయిట్ లాస్ డైట్ లో ఒక బాగం అయింది.

మెటబాలిజంను మెరుగుపరుస్తుంది

మెటబాలిజంను మెరుగుపరుస్తుంది

కాకరకాయ బరువు తగ్గించడంలో వివిధ రకాలుగా సహాయపడుతుంది. ముక్యంగా ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ వల్ల ఇది జీర్ణవ్యవస్థను మరియు జీవ క్రియలను మెరుగుపరుస్తుంది. దాంతో బరువు తగ్గడం సులభం అవుతుంది.

English summary

Is Bitter Gourd Good For Weight Loss?

Most people look upon bitter gourd with something akin to horror. We cannot blame them since this dark green vegetable with its pretty ridges on the surface is rather bitter like the name suggests. But, it is a fact that bitter gourd offers myriad health benefits.
Desktop Bottom Promotion