For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎసిడిక్ డైట్ ఫుడ్స్ వల్ల ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు

|

ఆల్కలైన్ డైట్ తీసుకోవడం చాలా అవసరం. అసిడిక్ డైట్ లో కొన్ని ఆరోగ్య దుష్ప్రభావాలున్నాయి. ఎసిడిక్ ఫుడ్స్ ను తినడం వల్ల శరీరంలో ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి.

చాలా వరకూ అసిడిక్ ఫుడ్స్ వల్లే వివిధ రకాల వ్యాధులకు గురి అవుతున్నారి నిపుణుల అభిప్రాయం. అయితే అయిడిక్ డైట్ లో ఉన్న ఆహారాలేంటి? చేపలు, డైరీప్రోడక్ట్స్, రెడ్ మీట్ మరియు కొన్ని గ్రీన్ వెజిటేబుల్స్ కూడా అసిడిక్ ఫుడ్స్ గా ఉన్నాయి. కాబట్టి, ఆరోగ్యానికి హాని కలిగించే ఇలాంటి అసిడిక్ ఫుడ్స్ ను పరిమితంగా తీసుకోవడం చాలా మంచిది.

అసిడిక్ డైట్ వల్ల ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలేంటంటే? శరీరంలోని పొటాషియం, కాల్షియం, సోడియం వంటి ఖనిజాలు క్షీణించబడుతాయి..

READ MORE: పొట్ట ఉబ్బరం..గ్యాస్..ఎసిడిటిని తగ్గించే ఆహారాలు..!

అసిడిక్ ఫుడ్స్ తినడం వల్ల కండరాలు మరియు కండరాల పటిష్టతలోపాలు లేదా సమస్యలు తలెత్తవచ్చు. అంతే కాదు, ఈ అసిడిక్ ఫుడ్స్ తినడం వల్ల మరికొన్ని హెల్త్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అవి ఈ క్రింది విధంగా....

బ్లడ్ షుగర్:

బ్లడ్ షుగర్:

అసిడిక్ ఫుడ్స్ ను తినడం వల్ల రక్తంలోని చెక్కర్లో ఒడిదుడుకులు వల్ల మధుమేహం ప్రమాధం పెరుగుతుంది.

 గుండె:

గుండె:

అసిడిక్ డైట్ గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అసిడిక్ ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల హార్ట్ డిసీజ్, హార్ట్ స్ట్రోక్, హార్ట్ అటాక్ వంటి సమస్యలు పెరగవచ్చు.

ఇతర సమస్యలు:

ఇతర సమస్యలు:

తరచూ అసిడిక్ ఫుడ్స్ తినడం వల్ల చర్మం పొడిబారడం, వ్యాధినిరోధకత లోపించడం మరియు తలనొప్పి వంటి సాధారణ జబ్బులను ఎదుర్కోవాలి. అసిడిక్ డైట్ వల్ల ఇవి కొన్ని ఆరోగ్యదుష్ప్రభావాలు.

. బరువు :

. బరువు :

ఎవరైతే ఎసిడిక్ డైట్ కు అలవాటు పడి ఉంటారో అలాంటి వారు, అదనపు బరువును తగ్గించుకోవడానికి చాలా కష్టం అవుతుంది.

జీర్ణ సమస్యలు:

జీర్ణ సమస్యలు:

ఎసిడిక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అనేక జీర్ణ సమస్యలతో పాటు ముఖ్యమైనటువంటి మలబద్దక సమస్యను ఎదుర్కోవల్సి వస్తుంది. ఎసిడిక్ డైట్ వల్ల ఇది ఒక మేజర్ హెల్త్ ఎఫెక్ట్.

English summary

Health Effects Of Acidic Diet in Telugu

Health Effects Of Acidic Diet in Telugu. Most of the diseases are said to be a result of imbalances caused by acidic foods. What foods are in an acidic diet? Well, fish, dairy products, meat and even grains are acidic foods. It is better to consume them in limited quantities.
Story first published: Thursday, June 4, 2015, 17:52 [IST]
Desktop Bottom Promotion