For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ అందాన్ని..ఆరోగ్యాన్ని పాడుచేస్తున్న మీ పొట్ట

|

లావుగా ఉన్నవారినే కాదు సన్నగా ఉన్నవారిని కూడా విసిగించే సమస్య పొట్ట. చాలామంది అనుకున్నట్టు లావుగా ఉన్నవారికే పొట్ట ఉంటుందనేది కరెక్ట్‌ కాదు. మిగిలిన శరీర భాగాలతో పోల్చుకుంటే ఉదరభాగంలో అధికంగా కొవ్వు పేరుకుపోవడం అనేది ఎవరికైనా జరగవచ్చు. అందులో ప్రస్తుత ఆహారపు అలవాట్ల కారణంగా వయసులకు అతీతంగా ప్రతి ఒక్కరినీ వేధిస్తోందీ ఉదరభాగపు ఉబ్బు. మొత్తం బాడీషేప్‌ని పాడుచేసే శక్తి ఉన్నఈ సమస్య పరిష్కారం కోసం నిపుణులు ఏం చెప్తున్నారంటే...

Lower Belly Fat

పొట్ట పెరిగేందుకు దోహదం చేసే ఆహారంలో ముఖ్యంగా తెల్లని బియ్యం కారణంగా ఉదరభాగం ఉబ్బుగా మారే అవకాశాలు బాగా ఎక్కువ. కాబట్టి దానికి బదులుగా గోధుమలు, దంపుడు బియ్యం, జొన్నలు, కొర్రబియ్యం... వంటివి వాడడం మొదలు పెట్టాలి. చిన్న చిన్న పరిమాణాలలో పలు దఫాలుగా ఆహారం తీసుకునే వేళలు సవరించుకోవాలి. ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌ కాస్త ఎక్కువగా తీసుకన్నా పర్లేదు. అక్కడి నుంచి తగ్గిస్తూ వెళ్లాలి. రాత్రి 7-8గంటల లోపు తినే కార్యక్రమం ముగించడం అవసరం. అలాగే నిద్రపోయే వేళలు కూడా వీలున్నంత వరకూ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా కనీసం 6వారాల పాటు క్రమం తప్పకుండా పాటించాలి.

Lower Belly Fat

ముందుగా మీ నడుము చుట్టుకొలత కొలుచుకోవాలి. బరువు ఎంత అధికంగా ఉన్నామో కూడా పరీక్షించుకోవాలి. అది నిర్దేశించిన పరిమాణాన్ని దాటినట్టు గుర్తించగనే ముందుగా చేయాల్సింది వైద్యుని సంప్రదించడం. వారి సూచనల మేరకు ఉదరభాగం పెరగడానికి కారణాలేమిటో గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు చేయించుకోవడం. పరీక్షల ఫలితాల ప్రకారం వైద్య సలహా మేరకు 'బెల్లీ'పై వార్‌ ప్రకటించాలి.

Lower Belly Fat

వర్క్‌వుట్స్‌కి కంగారొద్దు...
పొట్ట పెరుగుతోందనగానే జిమ్‌లు, వర్కవుట్లు అంటూ కంగారుగా పరుగులు పెట్టడం సరికాదు. ఆహారపు అలవాట్లలో అవసరమైన మార్పుచేర్పులు చేయకుండా పొట్ట తగ్గించడం అసాధ్యం. ఆహారపు అలవాట్లు మార్చకుండా జిమ్‌లకు పరిగెడితే...అదనపు శారీరక శ్రమ వల్ల మనకు తెలీకుండానే మనం అదనంగా తింటాం. దాంతో పొట్ట తగ్గే అవకాశాలు మరింత తగ్గుతాయి. అందుకని ముందుగా పొట్ట పెరిగేందుకు దోహదం చేస్తున్న ఆహారాన్ని త్యజించాల్సిందే.

Lower Belly Fat

వ్యాయామం దిశగా...
అనంతరం బరువు చెక్‌ చేసుకుంటే ఎంతో కొంత మార్పు తప్పకుండా కన్పడుతుంది. అలా కనపడితేనే మనం ఖచ్చితమైన దారిలో వెళుతున్నట్టు. బరువు తగ్గినట్టు తెలిశాక... అవసరమైన షూస్‌, తగిన డ్రెస్‌ సిద్ధం చేసుకుని వాకింగ్‌ మొదలుపెట్టాలి. ప్రారంభంలో ఉదయం పూట కనీసం 20నిమిషాలు తరువాత దశలవారీగా దాన్ని 40-60 నిమిషాల దాకా తీసుకెళ్లాలి. సాధారణ వాకింగ్‌ రెండు వారాల పాటు మానకుండా చేశాక బ్రిస్క్‌ వాకింగ్‌ మొదలుపెట్టాలి. ఆ తర్వాత వాకింగ్‌, బ్రిస్క్‌వాకింగ్‌ కలిపి చేయాలి. మరో 2 వారాలు గడిచాక నిపుణుల పర్యవేక్షణలో అబ్డామినల్‌ క్రంచెస్‌ ప్రారంభించాలి. వీటిలో విభిన్నరకాలున్నాయి. వీటిలో నుంచి అనువైనవి ఎంచుకుని సాధన చేయాలి. వీటితో పాటుగా సైడ్‌ బెండ్స్‌, యోగాసనాలు, లైట్‌ వెయిట్స్‌తో స్ట్రెంగ్త్‌ ట్రయినింగ్‌, స్విమ్మింగ్‌, సైక్లింగ్‌ వంటివి కూడా వీలుని బట్టి అపుడపుడు జతచేస్తుండాలి. రోజుకి 30 నిమిషాలతో ప్రారంభించి గంట, గంటన్నర దాకా సమయాన్ని పెంచాలి. ఇలా 3 నెలలు చేశాక పొట్ట ప్రాంతంలో వచ్చిన మార్పుని, బరువు పరంగా వచ్చిన ఫలితాల్ని బేరీజు వేసుకోవాలి. వాటిపై నిపుణులతో చర్చించి మరింత మెరుగైన ఫలితాల కోసం ఎక్సర్‌సైజ్‌ రొటీన్‌లో అవసరమైన మార్పుచేర్పులు చేసుకోవాలి.

Lower Belly Fat

గుర్తించుకోవల్సిన విషయాలు:
1. శరవేగంగా మార్పును ఆశించవద్దు. అలాగే మొదట్లోలాగే త్వరగా బరువు తగ్గుతామని అనుకోవద్దు. లేదా కృత్రిమ పద్ధతుల్లో తగ్గించేసుకోవాలని ఆరాటం వద్దు.
2. ఆహారపు అలవాట్లలో మార్పు చేర్పులను కొనసాగిస్తూ, వ్యాయామం చేస్తుంటే నిదానంగా పొట్ట కరగడం ప్రారంభిస్తుంది. అయితే ఒకసారి కరిగిన పొట్ట తిరిగి రాకుండా శారీరక శ్రమని దినచర్యలో భాగం చేయడం అవసరం.

Lower Belly Fat


3. లిఫ్ట్‌ వాడకుండా మెట్లు ఎక్కి దిగడం, చిన్న చిన్న దూరాలకు నడిచి వెళుతుండడం, ఆఫీసు, ఇంట్లో ఇలా ఎక్కడైనా సరే శరీరం కదిలేలా చలాకీగా పనులు నిర్వర్తిస్తుండడం...వంటివి చేస్తూ...పొట్ట తగ్గడం వల్ల మీరెంత చలాకీగా మారామనేది తెలుసుకుంటూ, చెప్పకనే చెప్పాలి.
4. పొట్ట తగ్గిపోయాక కూడా వ్యా యామాన్ని కొనసాగిస్తూ పోతే... ఇక భవిష్యత్తులో ఉదర భాగంలో ఫ్యాట్‌ అనే ప్రమాదం రాదు. అంతే కాకుండా మంచి బాడీషేప్‌ కూడా స్వంతం అవుతుంది.

Lower Belly Fat

5. పొట్ట భాగంలో కొవ్వు కరగడానికి, కండరాలు మంచి షేప్‌ తిరగడానికి యాబ్స్‌ ఎక్సర్‌సైజ్‌లు, క్రంచెస్‌ మాత్రమే మార్గం అనుకుని వాటికే పరిమితం కాకూడదు. అబ్డామినల్‌ వ్యాయామాలలో విభిన్న రకాలను సాధన చేయాలి.
6. అలాగే వెల్లకిలా పడుకుని చేసే బైసికిల్‌ ఎక్సర్‌సైజ్‌ను అత్యుత్తమమైనదిగా అమెరికన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎక్సర్‌సైజ్‌ నిర్థారించింది. ది ప్లాంక్‌ (పుషప్‌ చేయడానికి చేతులు నేలకు ఆన్చి అదే భంగిమలో నిశ్చలంగా ఉండిపోయే వర్కవుట్‌) అనే వెరైటీ వ్యాయామం కూడా పొట్ట భాగాన్ని చదును చేసేందుకు చక్కని మార్గం.

English summary

How to Get Rid Of Lower Belly Fat

Having belly fat is a testament to the unhealthy lifestyle choices made by you. You will not be able to look attractive in most of your clothes, due to your prominent paunch of muffin top. Having lower belly fat means you are eating too much junk food and not exercising enough. Do not worry; when it comes to losing weight, getting rid of lower belly fat is the easiest.
Story first published: Saturday, October 3, 2015, 16:59 [IST]
Desktop Bottom Promotion