For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎఫెక్టివ్ గా మరియు వేగంగా బరువు తగ్గించే లో షుగర్ ఫ్రూట్స్

|

బరువు తగ్గించుకోవడానికి ఉపవాసాలుండాల్సిన అవసరం లేదు . సింపుల్ గా మంచి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. బరువు తగ్గించే ఆహారాలు మార్కెట్లో చాలానే ఉన్నాయి . అయితే అందులో మంచి ఆహారాలు ఎంపిక చేసుకోవడం చాలా అవసరం.

ఉదాహరణకు పండ్లు: డైలీ డైట్ లో పండ్లను చేర్చుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. పండ్లలో కొన్ని రకాల న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్ మరియు ఫైబర్స్ ఉన్నాయి. వీటితో పాటు షుగర్స్ కూడా ఉన్నాయి . ఇవి శరీరంను హెల్తీగా ఉంచుతుంది.

పండ్లలో ఉండే నేచురల్ షుగర్స్ ఉండటం వల్ల కొన్ని రకాల పండ్లు బరువును నేచురల్ గా తగ్గిస్తాయి. ఈ విషయాన్ని డాక్టర్స్ వద్ద నిర్ధారించుకొని తర్వాత తీసుకోవడం వల్ల తేలికగా బరువు తగ్గించుకోవచ్చు. అంతే కాదు దాంతో శరీరం హెల్తీగా ఉంటుంది.

బరువు తగ్గించుకోవడానికి కొన్ని నేచురల్ షుగర్స్, చాలా తక్కువ షుగర్స్ ఉన్న పండ్లు బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . ఈ పండ్లు ప్రతి సర్వింగ్ లో 7 నుండి 23 గ్రాములున్నాయి. ఇవి శరీరానికి అవసరం అయ్యే ఎనర్జీని అందివ్వడంతో పాటు, క్యాలరీలను కూడా బర్న్ చేస్తాయి. కాబట్టి, ఐడియల్ గా బరువు తగ్గించుకోవడానికి ఈ ఫ్రూట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

అదే విధంగా కొంత మంది శరీరంలో షుగర్స్ ఇతరుల్లో కంటే బెటర్ గా పనిచేస్తాయి. లోక్యార్బోహైడ్రేట్స్ కలిగి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పండ్లలో గ్లూకోజ్ లెవల్స్ ఎంత వరకూ ఉన్నాయో డాక్టర్లు కూడా చెక్ చేయమని చెబుతుంటారు . మరి బరువు తగ్గించే షుగర్ లెస్ ఫూట్స్ ఏంటో ఒక సారి చూద్దాం...

నిమ్మరసం:

నిమ్మరసం:

బరువు తగ్గించడంలో ఇది గ్రేట్ గా పనిచేస్తుంది. నిమ్మరసంను ప్రతి రోజూ ఉదయం పరగడుపున త్రాగడం వల్ల ఇది క్యాలరీలు బర్న్ చేయడానికి సహాయపడుతుంది. మరియు మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచుతుంది.

బ్లాక్ బెర్రీ:

బ్లాక్ బెర్రీ:

పండ్లలో ఉండే విటమిన్ సి మరియు మెగ్నీషియమ్ మరియు విటమిన్ కె ఒక బెస్ట్ స్నాక్ రిసిపి. చాలా ఆకలిగా ఉన్నప్పుడు బెర్రీస్ ను తీసుకోవడం వల్ల ఒక సర్వింగ్ కు 7 గ్రాముల షుగర్స్ మాత్రమే అందుతాయి. ఇది సురక్షితమైనదే.

 రాస్బెర్రీ:

రాస్బెర్రీ:

రాస్బెర్రీ శరీరంలో సెల్స్ ప్రొటక్షన్ కు సహాయపడుతుంది . మరియు ఇది ఎక్కువగా యాంటీఆక్సిడెంట్ కాంపౌడ్స్ ను అందిస్తుంది . ఇవి శరీరానికి చాలా మంచి చేస్తాయి. ఈ ఫ్రూట్ లో ఉండే లో షుగర్ కంటెంట్ వల్ల బరువు తగ్గించుకోవడంతో పాటు క్యాన్సర్ ను నివారించుకోవచ్చు.

క్రాన్ బెర్రీ:

క్రాన్ బెర్రీ:

మహిళలకు క్రాన్ బెర్రీ చాలా బెస్ట్ ఫ్రూట్ . క్రాన్ బెర్రీ జ్యూస్ ఒక సర్వింగ్ కు 23గ్రాముల షుగర్ అందుతుంది . ఇది శరీరానికి అవసరం అయ్యే ఎనర్జీని అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అదే విధంగా యూటిఐ ఇన్ఫెక్షన్ నివారించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీలో 7 గ్రాముల షుగర్స్ ఉంటుంది మరియు ఇది అధికంగా విటమిన్ సి కలిగి ఉంటుంది. ఈ ఎర్రని పండ్లు తినడం వల్ల వేగంగా బరువు తగ్గించుకోవచ్చు.

బొప్పాయి:

బొప్పాయి:

బొప్పాయి పండులో షుగర్స్ చాలా తక్కువగా ఉంటాయి. బొప్పాయిని సమ్మర్లో తినడం చాలా మంచిది. 100గ్రాము షుగర్ బొప్పాయితో అందడం వల్ల మీరు ఎనర్జిటిక్ గా ఫీలవుతారు. ఇంకా ఈ పండులో విటమిన్ సి, మరియు ఎలు పుష్కలంగా ఉన్నాయి . ఇది పొటాషియం మరియు ఫొల్లెట్ కు చాలా మంచి మూలం.

వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్:

వాటర్ మెలో ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గించడంలో 90శాతం వాటర్ కంటెంట్ ఇందులో ఉంది. ఇది పొట్టను నింపుతుంది. నేచురల్ షుగర్స్ ను అందిస్తుంది .

ఆపిల్స్:

ఆపిల్స్:

ఆపిల్స్ మన శరీరంలోని కోలన్స్ లోని బ్యాక్టీరియా మీద పాజిటివ్ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది. 17 గ్రాముల షుగర్ మరియు ఫైబర్ కలిగి ఉంటుంది. దాంతో పొట్ట ఫుల్ గా ఉండేలా చేస్తుంది. దాంతో వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

బ్లూ బెర్రీస్:

బ్లూ బెర్రీస్:

బ్లూ బెర్రీస్ లో 18 గ్రాములు షుగర్ మరియు ఎక్కువగా యాంటీఆక్సిడెంట్స్ తో నిండి ఉన్నాయి. ఇతర పండ్లతో పోల్చినప్పుడు ఈ ప్రూట్స్ లో చాలా తక్కువ క్యాలరీలు, షుగర్స్ ఉన్నాయి.

పీచెస్:

పీచెస్:

పీచెస్ లో విటమిన్ సి, ఎ మరియు బీటా కెరోటిన్ లు పుష్కలంగా ఉన్నాయి.ఇది ఒక బెస్ట్ లో షుగర్ ఫ్రూట్. బరువు తగ్గించుకోవాలని కోరుకొనే వారు సమ్మర్లో వీటిని తీసుకోవడం చాలా మంచిది.

English summary

10 Fruits Low In Sugar For A Weight Loss Diet

You don't have to eat less, you simply have to eat right if you want to lose weight. There are a zillion of foods in the market that can aid in weight loss, and choosing the right foods is important.
Story first published: Wednesday, February 24, 2016, 15:36 [IST]
Desktop Bottom Promotion