For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెయిట్ లాస్ ప్లాన్ లో చేర్చుకోకూడని, చేర్చుకోవాల్సిన చిప్స్..!!

By Swathi
|

కరకరలాడుతూ.. తింటుంటే తినాలనిపించే చిప్స్ అంటే అందరికీ నోరూరిపోతుంది. జర్నీలో ఉన్నా, స్నాక్స్ విషయానికి వచ్చినా, ఆఫీస్ లో చిరుతిండి లిస్ట్ అయినా, భోజనంలో సైడ్ డిష్ గా నైనా.. చిప్స్ ని చేర్చుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. చిప్స్ ని తినడానికి చిన్నా పెద్దా అందరూ ఇష్టపడతారు. అలాగే.. బేక్డ్ చిప్స్ అంటే అమితంగా ఇష్టపడే వాళ్లు చాలామందే ఉంటారు.

పొట్ట మాత్రమే కాదు, టోటల్ బాడీ ఫ్యాట్ కరిగించే టాప్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్ పొట్ట మాత్రమే కాదు, టోటల్ బాడీ ఫ్యాట్ కరిగించే టాప్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్

అయితే బరువు తగ్గాలనే టార్గెట్ మైండ్ లో ఉన్నప్పుడు.. తీసుకునే ఆహారంపై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకలిగా ఉందని ఏది పడితే అది తింటే.. మీ టార్గెట్.. టార్గెట్ లానే మిగిలిపోతుంది. కాబట్టి.. ఏది తినాలి, ఏది తినకూడదు, ఎంత పరిమాణంలో తినాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అనేదానిపై ఓ కన్నేసి ఉంచాలి. లేదంటే.. మీ ప్రయత్నమంతా వృధా అవుతుంది.

బరువు తగ్గించుకోవడానికి ఉదయం తీసుకొనే టాప్ 10 ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ...బరువు తగ్గించుకోవడానికి ఉదయం తీసుకొనే టాప్ 10 ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ...

బరువు తగ్గాలని పట్టుదలగా ఉన్నవాళ్లు ఎక్కువ వెజిటబుల్స్ తినాలి. కానీ.. చిప్స్ కి మాత్రం నో చెప్పాల్సిందే. చిప్స్ మాత్రమే కాదు ఫ్రెంచ్ ఫ్రైస్ తో పాటు ఫ్రై చేసిన ఐటమ్స్, సాల్ట్, స్వీట్ తో ఉన్న ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. అయితే బేక్డ్ చిప్స్, ఎక్కువ ఫ్రై చేసిన చిప్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి పోషకాలు అందకపోగా.. క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొన్ని రకాల చిప్స్ లో ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ వాడతారు. దీనివల్ల.. న్యూట్రీషన్స్ తగ్గిపోతాయి. కాబట్టి.. బరువు తగ్గాలనే ప్లాన్ లో ఉన్నవాళ్లు.. ఖచ్చితంగా తినకూడని చిప్స్ ఏంటి ? డైట్ లో చేర్చుకోవాల్సిన చిప్స్ ఏంటో తెలుసుకుందాం..

ఆలూ చిప్స్

ఆలూ చిప్స్

తింటుంటే తినాలనిపించే.. ఆలూ చిప్స్ చాలా ఖచ్చితంగా నో చెప్పాల్సిందే. పొటాటో చిప్స్ లో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటిని తినడం వల్ల శరీరానికి ఎలాంటి ఉపయోగం ఉండదు.

బనానా చిప్స్

బనానా చిప్స్

బనానా చిప్స్ అంటే చాలా హెల్తీ అని.. వాటిల్లో న్యూట్రీషన్స్ ఉంటాయని, బేక్ చేస్తే మరింత హెల్తీ అని చాలామంది పీలవుతారు. కానీ అది తప్పు. ఆలూ, బనానా చిప్స్ లో షుగర్, సాల్ట్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవాళ్లు వీటిని తీసుకోకూడదు.

టాపికా టిప్స్

టాపికా టిప్స్

కర్రపెండలంతో తయారు చేసే చిప్స్ ని కూడా వెయిట్ లాస్ ప్రాసెస్ లో ఉన్నవాళ్లు తీసుకోకూడదు. వీటిల్లో స్టార్చ్, ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇవి కూడా పొటాటో, బనానా చిప్స్ లాంటివే. కాబట్టి.. వీటికి దూరంగా ఉండటం మంచిది.

పనస చిప్స్

పనస చిప్స్

జాక్ ఫ్రూట్ ( పనస ) చిప్స్ టేస్టీగానే కాదు.. ఇందులో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. అలాగే.. ఎనర్జీ కూడా అందుతుంది. కానీ వీటిని ఫ్రై చేయడం వల్ల ఇందులో మైక్రోన్యూట్రియంట్స్ నాశనం అవుతాయి. కాబట్టి.. బరువు తగ్గాలనుకునేవాళ్ల డైట్ లో వీటిని చేర్చుకోకపోవడమే మంచిది.

రాగి చిప్స్

రాగి చిప్స్

రాగి చిప్స్ లో క్యాల్షియం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవాళ్లు వీటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. రాగిలో ఐరన్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల.. అనీమియా సమస్యను నివారిస్తుంది.

సోయా చిప్స్

సోయా చిప్స్

సోయా స్టిక్స్ లేదా చిప్స్ బరువు తగ్గాలనుకువాళ్ల డైట్ లో చేర్చుకోవడం చాలా సేఫ్. ఎందుకంటే వీటిలో ప్రొటీన్ ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటిని ఫ్రై చేయడం వల్ల మరింత ఆరోగ్యకరం.

నాచో చిప్స్

నాచో చిప్స్

కార్న్ మీల్ తో తయారు చేసే చిప్స్ ని నాచో చిప్స్ అని పిలుస్తారు. వీటిల్లో గ్లూటెన్ ఉండదు. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా ఒకసారి వీటిని తీసుకోవచ్చు. అయితే ఫ్రై చేసినవి కాకుండా.. బేక్ చేసినవి అయితే మంచిది.

English summary

4 types of chips to avoid and should eat when trying to lose weight

4 types of chips to avoid and 3 types you should eat when trying to lose weight. Lose weight while eating chips! Yes, you can, given that you eat the right kind of chips.
Story first published: Monday, May 9, 2016, 13:21 [IST]
Desktop Bottom Promotion