For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తినాల్సిందే...

|

లివర్ (కాలేయం)మన శరీరంలోని అది పెద్ద అవయవం. మన శరీరంలోని జీవక్రియల్లో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది మన శరీరంలో ఉదరంలో కుడివైపున ఉంటుంది. లివర్ జబ్బుపడినా కూడా తనను తాను బాగు చేసుకోగల సామర్థ్యం కలది . శరీరానికి కావల్సిన శక్తిని తయారుచేసుకోగలదు. జీర్ణక్రియలో అత్యంత కీలకమైన పాత్ర నిర్వర్తించే అవయం, శరీరంలోని అతి పెద్ద గ్రంథి. ఇది పెద్దగ్రంధి మాత్రమే కాదు, బరువైన అవయవం కూడా .

కాలేయం... మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడం, శరీరంలోని కొవ్వు, చక్కెర (గ్లూకోజ్), ప్రొటీన్ శాతాన్ని నియంత్రించడం, శరీరం జబ్బు బారిన పడకుండా భద్రత కల్పించడం (శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వడం), రక్తశుద్ధి చేయడం, శరీరంలోని విషాలను హరించడం, మనలో ప్రవేశించే హానికర పదార్థాలను తొలగించడం, జీర్ణప్రక్రియకు దోహదపడే బైల్‌ను ఉత్పత్తి చేయడం, విటమిన్లు-ఐరన్ వంటి పోషకాలను నిల్వ చేయడం, ఆహారాన్ని శక్తి రూపంలోకి మార్చడం, శరీరంలోని వివిధ హార్మోన్ల విడుదలను నియంత్రించడం, రక్తం గడ్డకట్టడానికీ, గాయాలు తొందరగా మానడానికీ కావాల్సిన ఎంజైమ్స్‌ను ఉత్పత్తి చేయడం వంటి కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తుంది.

ఇన్నిరకాలుగా బాధ్యతలు నిర్వహించే కాలేయం ధూమపానం, మద్యం వల్ల త్వరగా జబ్బునపడుతుంది. కాబట్టి, అలా జరగకుండా ఎప్పటికప్పుడు కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు సహాయపడుతాయి. కాలేయాన్ని శుభ్రం చేసే ఆహారాలను తినడం చాలా మంచిది. శరీరంలోని టాక్సిన్స్ అన్నీ తొలగిపోతాయి. మరియు ఈ ఆహారాలు లివర్ ఫ్రెండ్లీ ఫుడ్స్. ఇది మీ జీవక్రియలను ఆరోగ్యంగా ఉంచడానికి ముఖ్యపాత్రను పోషిస్తుంది. కాబట్టి ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన ఫుడ్స్ ను రెగ్యులర్ గా తీసుకోవాలి.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

ఘాటయిన వాసన ఇచ్చే వెల్లుల్లి గుండెకు నేస్తం, క్యాన్సర్ కు ప్రబల శత్రువు. దీన్ని నేరుగా వేయించకూడదు. వెల్లుల్లిని ఒలిచి పది నిముషాలు అలా ఉంచితే క్యాన్సర్ నిరోధించే ఎంజైమ్ ఎలెనాస్ బాగా మెరుగువుతుంది. సల్ఫర్ పరిమాణము ఎక్కువ ఉన్నందున ఘాటైన వాసన వస్తుంది .. రోజుకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తిన్నట్లయితే కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది , కాలేయము ఆరోగ్యానికి, కీళ్ళనొప్పులు తగ్గడానికి పనికివస్తుంది.

బీట్ రూట్ :

బీట్ రూట్ :

బీట్ రూట్, క్యారెట్, బంగాళా దుంప వంటివి ఎక్కుగా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వీటిలో కాలేయంలోని కణాలు పునరుత్పత్తిగికి బాగా సహాయపడుతాయి. డయాబెటిక్ లివర్ ను కాపాడును. కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్‌ తోడ్పడుతుంది.ఈ ఆరోగ్యకరమైన దుంపలను ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.

సిట్రస్ పండ్లు(ద్రాక్ష, ఆరెంజ్):

సిట్రస్ పండ్లు(ద్రాక్ష, ఆరెంజ్):

సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్ ను కాపాడుటలో బాగా పనిచేస్తుంది. కాలేయ పనితీరును మెరుగు పరచుతుంది. ద్రాక్ష పండ్లలోని టన్నీస్‌, పాలిఫినాల్స్‌ క్యాన్సర్‌ సంబంధిత కారకాలపై పోరాడుతాయి. శరీరంలో కొవ్వు స్థాయిని తగ్గిస్తాయి. ఇందులో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. అంతేకాదు..ద్రాక్ష గింజల్లో ఉండే ప్రొనాంథోసైనిడిన్‌ అనే పదార్థం కాలేయాన్ని సంరక్షిస్తుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

టీ అన్నింటిలో గ్రీన్ టీ మాత్రమే అత్యంత శక్తివంతమైనది. ముఖ్యంగా ఇందులోని 'ఇజీసీజి','కాటెచిన్స్' అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది. ఈ టీ తాగినవారిలో అన్నవాహిక క్యాన్సర్ తగ్గుతాయి. అందుకు యాంటీ ఆక్సిడేటివ్, యాంటి ప్రొలిఫరేటివ్ గుణాలే కారణం. రోజువారీగా గ్రీన్ టీని తీసుకోవడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తాయి.

 నిమ్మకాయ:

నిమ్మకాయ:

నిమ్మకాయలో అధిక శాతంలో విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ కాలేయాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగపడే గ్లూటాథియోన్ ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి నిమ్మరసంను ఒక గ్లాసు నీళ్ళతో కలిపి ఉదయం కాలీ కడుపుతో త్రాగాలి.

అవోకాడో:

అవోకాడో:

ఈ పండులో గుండెకు ఆరోగ్యానిచ్చే మోనో శాచ్యురేటెడ్ కొవ్వుపదార్థాలున్నాయి. దీనిలో ఫైటో కెమికల్స్ నోటి క్యాన్సర్ ను నివారిస్తాయి. ఇది కాలేయాన్ని శుభ్ర పచడమే కాకుండా కణజాలాలు మరియు కణాల పునరుద్దించడానికి బాగా సహాయ పడుతుంది. ప్రతి రోజూ వీటిని తీసుకోవడం వల్ల కాలేయానికి మంచి ప్రయోజం చేకూర్చుతాయి.

యాపిల్స్ :

యాపిల్స్ :

యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది.యాపిల్ తోలులోను, లోపలి గుజ్జులోను పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది గ్యులాక్టురోనిక్ యాసిడ్ తయారీకి దోహదపడుతుంది. ఈ యాసిడ్ శరీరాంతర్గతంగా సంచితమైన అనేక హానికర పదార్థాలను బహిర్గత పరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ పదార్థం పేగుల్లో ప్రోటీన్ పదార్థం విచ్ఛిన్నమవ్వకుండా నిరోధిస్తుంది కూడా. యాపిల్‌లో ఉండే మ్యాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం, మెదడు వంటి అంతర్గత కీలక అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.

 ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ విత్తనాల నుండి ఆలివ్ నూనె తీస్తారు. ఇతర నూనెలకన్నా ఖరీదు ఎక్కువే అయినా ఆలివ్ నూనె లో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి . దీనిలో మోనో అన్క్ష్ సాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అత్యధికము. ఈ నూనెలోని మోనో ఆన్ శాచ్యరేటెడ్ కొవ్వు పదార్థం కండర కణజాలాన్ని కాపాడుతుంది.

క్యారెట్స్ :

క్యారెట్స్ :

ఈ దుంపల్లో ఉండే ఫ్లెవనాయిడ్స్ కాలేయం చురుకుగా పనిచేయడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. ఈ రెండు వెజిటేబుల్స్ లివర్ క్లీనింగ్ లో చాలా గ్రేట్ గా సహాయపడుతాయి.

English summary

Best Foods That Are Healthy For Liver

The liver, weighing about 1.3 kg in healthy adults, is one among the entire body's vital organs. The liver is a gland that secretes substances needed by other parts of the body.
Story first published: Tuesday, March 22, 2016, 7:17 [IST]
Desktop Bottom Promotion