For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రాపింగ్ బెల్లీతో ఇబ్బంది పడుతున్నారా..? ఐతే మార్నింగ్ డ్రింక్స్ తో చెక్ పెట్టండి...!

|

మనం అందరం కూడా ఫ్లాట్ గా మరియు అందంగా, కాంతివంతమైన బెల్లీ(పొట్ట) ఉండాలని కోరుకుంటాము, మీరు కూడా అంగీకరిస్తారా? ఇలా అందంగా ఉన్న బెల్లీ చూడటానికి అట్రాక్టివ్ గా ఉండటం మాత్రమే కాదు, మంచి ఆరోగ్యవంతులని తెలిపే సంకేతం కూడా. బెల్లీ ఫ్యాట్ ఒక్కసారి వచ్చిందంటే చాలు, దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం.

పొట్టఉదరంలో ఉండే ఫ్యాట్ కరిగించుకోవడం చాలా కష్టం, అంత సులభం కరగదు మరియు పొట్ట ఉదరంలో ఉండే ఫ్యాట్ కరిగించుకోవడానికి చాలా ఎఫోర్ట్ పెట్టాల్సి వస్తుంది. అయితే ఒక మంచి ఉపాయం ఉంది, బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి కొన్ని రకాల జ్యూసులున్నాయి. ఈ జ్యూసులతో బెల్లీ ఫ్యాట్ ను త్వరగా 15 రోజుల్లోనే కరిగించుకోవడానికి అవకాశం ఉన్నది.

బొజ్జతో అనర్థాలు: బొజ్జ తగ్గించే చిట్కాలు

బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి, బెల్లీఫ్యాట్ కరిగించే జ్యూసులు త్రాగడంతో పాటు, మంచి ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ను కూడా మెయింటైన్ చేస్తే మరింత మంచిది . రెగ్యులర్ డైట్ నుండి ఆయిల్ మరియు జంక్ ఫుడ్స్ ను నివారించాలి. ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

బెల్లీ ఫ్యాట్ ను కరిగించే 22 పవర్ ఫుల్ ఆహారాలు

వీటితో పాటు, ఒక గంట పాటు బ్రిస్క్ వాక్ , శారీరక వ్యాయామాలు చేయడం వల్ల క్యాలరీలు అధికంగా కరిగించుకోవచ్చు . ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి ఇలాంటివి ఒక మంచి మార్గం. బెల్లీ ఫ్యాట్ డయాబెటిస్, హైబ్లడ్ ప్రెజర్ వంటి అనేక వ్యాధులకు కారణం అవుతుంది.

ఉదయాన్నేలెమన్ వాటర్ తాగితే: గొప్ప ప్రయోజనాలు

బెల్లీ మెల్టింగ్ డ్రింక్స్ ను మీకోసం కొన్నింటిని పరిచయం చేస్తున్నాము. వీటిని ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడానికి 1గంట ముందు తీసుకోవడం ద్వారా మీ బెల్లీ ఇట్టే కరిగిపోతుంది.

బెల్లీఫ్యాట్ కరిగించే డ్రింక్ 1:

బెల్లీఫ్యాట్ కరిగించే డ్రింక్ 1:

కావల్సిన పదార్థాలు:

కీరదోసకాయ 1,

2నిమ్మరసం,

పుదీన కొద్దిగా,

కొద్దిగా అల్లం,

కొద్దిగా నీరు

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

కీరదోసకాయను మిక్స్ లో వేసి జ్యూస్ చేయాలి. అందులో నిమ్మరసం పిండి, అందులో పుదీనా ఆకులు, అల్లం తురుము వేయాలి. తర్వాత మీకు ఎంత అవసరం అనిపిస్తే అంత నీరు జోడించాలి. ఈ జ్యూస్ ను ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ఒక గంట ముందు 15 రోజుల పాటు త్రాగాలి.

బెల్లీ ఫ్యాట్ కరిగించే డింక్ 2:

బెల్లీ ఫ్యాట్ కరిగించే డింక్ 2:

కావల్సినవి:

వెల్లుల్లి రెబ్బలు: 3

తేనె: 1చెంచా

నిమ్మరసం: 1

గోరువెచ్చని నీరు: 1గ్లాసు

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, మరియు తేనె మిక్స్ చేయాలి. తర్వాత మొదట నోట్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని నమిలి మింగాలి. తర్వాత ఈ గోరువెచ్చని లెమన్ వాటర్ త్రాగాలి. గార్లిక్ ను నేరుగా తినలేనివారు, కచపచ దంచి లెమన్ వాటర్లో మిక్స్ చేసి , కాలీపొట్టతో తీసుకోవాలి.

బెల్లీ ఫ్యాట్ మెల్టింగ్ డ్రింక్ 3:

బెల్లీ ఫ్యాట్ మెల్టింగ్ డ్రింక్ 3:

కావల్సినవి: ముల్లంగి: 100గ్రాములు అల్లంముక్కలు: కొద్దిగా నిమ్మరసం : 1 తేనె: 1చెంచా దాల్చిన చెక్క పొడి: 1చెంచా

తయారుచేయు విధానం :

తయారుచేయు విధానం :

ముల్లంగా మరియు అల్లం మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత ఇందులో తేనె, నిమ్మరసం, దాల్చిన చెక్క పౌడ్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులో మీకు ఎంత అవసరం అవుతుందో అంత నీళ్ళు మిక్స్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు తీసుకోవాలి.

.బెల్లీ ఫ్యాట్ మెల్టింగ్ డ్రింక్ 4:

.బెల్లీ ఫ్యాట్ మెల్టింగ్ డ్రింక్ 4:

బెల్లీ ఫ్యాట్ ను కరిగించడంలో అలోవెర గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది ప్రేగులను కూడా శుభ్రం చేస్తుంది . మరియు కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది . రెండు చెంచాలా అలోవెరజ్యూస్ ను ఒక గ్లాసు నీటిలో వేసి , అందులో తేనె మిక్స్ చేయాలి. బ్రేక్ ఫాస్ట్ కు 1 గంట ముందు దీన్ని త్రాగాలి.

ఆపిల్ సైడర్ డ్రింక్:

ఆపిల్ సైడర్ డ్రింక్:

ఒక పెద్ద గ్లాసులో చల్లటి నీరు, రెండు చెంచాల ఆపిల్ సైడర్ వెనిగర్ , మీడియం సైజ్ లెమన్ 1(నిమ్మరసం), దాల్చిన చెక్క పౌడర్ , ఒక చెంచా తేనె మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల ఎఫెక్టివ్ గా బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది.

Story first published:Tuesday, February 2, 2016, 18:14 [IST]
Desktop Bottom Promotion