For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాడీలో ఎక్సట్రా క్యాలరీను కరిగించి, బరువు తగ్గించే 4 గ్రీన్ షేక్స్ ..

|

అధిక బరువుతో బాధపడుతున్నారా?ఎక్స్ ట్రా క్యాలరీలను కరిగించుకోవాలని చూస్తున్నారా? అయితే మీకోసం ఒక అమేజింగ్ ఐడియా..!బరువు తగ్గించుకోవడంలో గ్రీన్ షేక్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది . ఇది బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గడంతో పాటు, యంగర్ లుక్ ను అందిస్తుంది. 60శాతం గ్రీన్ వెజిటేబుల్స్ మరియు 40శాతం ఫ్రూట్స్ ను ఉపయోగించి ఈ గ్రేట్ జ్యూస్ ను తయారుచేసుకుంటారు .

గ్రీన్ స్మూతీ మరియు గ్రీన్ షేక్స్ లు, జ్యూసులకు వ్యతిరేకం. ఎందుకంటే జ్యూసుల్లో కేవలం నీరు, చాలా తక్కువ పరిమాణంలో న్యూట్రీషియన్స్, షుగర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అదే గ్రీన్ షేక్స్ మరియు గ్రీన్ స్మూతీస్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. గ్రీన్ స్మూతీస్ ను తీసుకోవడం , గ్రీన్స్ తినడం అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

Top 5 Green Shakes For Weight Loss

గ్రీన్ షేక్స్ అండ్ స్మూతీస్ వాటిని చూడటాని కంటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇది తయారుచేయడంలో ఒక చిన్నట్రిక్ ఉపయోగించాలి. గ్రీన్ తీసుకునేటప్పుడు గ్రీన్ లీఫ్స్, గ్రీన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది. దీన్ని శరీరం ఉపయోగించుకుని, ప్రయోజనాలను అందిస్తుంది . గ్రీన్ డ్రింక్ స్వీట్ నెస్ ను బ్యాలెన్స్ చేస్తుంది. విటమిన్స్ మరియు మినిరల్స్ అందిస్తుంది. శరీరానికి కావల్సిన కనీసపు ఆరోగ్యప్రయోజనాలను అందిస్తుంది .

గ్రీన్ లీఫ్స్ ఆరోగ్యకరమైన ఆల్కైన్స్ ను శరీరంలో రీస్టోర్ చేయడానికి సహాయపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల జంక్ ఫుడ్, స్వీట్ మరియు ప్రొసెస్డ్ ఫుడ్స్ తినాలనే కోరికను తగ్గిస్తుంది. దాంతో బరువు తగ్గడం సులభమవుతుంది, . ఇది శరీరంను శుభ్రం చేస్తుంది. టాక్సిన్స్ తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

బరువు తగ్గించే గ్రీన్ షేక్స్

Top 5 Green Shakes For Weight Loss

1. సెలరీ -ఆపిల్ షేక్
కావల్సిన పదార్థాలు: నీరు -1కప్పు, లెట్యుస్: 1కట్ట(సన్నగా తరిగిపెట్టుకోవాలి), ఆర్గానిక్ సెలరీ: 3కట్టలు, ఆకుకూర: 1కప్పు(మీకు నచ్చిన ఆకుకూర సన్నగా తరిగిపెట్టుకోవాలి) . బేరి పండు: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి), గ్రీన్ ఆపిల్: 1, నిమ్మకాయ: 1(జ్యూస్ తియ్యాలి)

తయారుచేయు విధానం:
మిక్సీ జార్ లో లెట్యుస్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
తర్వాత ఆకుకూర, సెలరీ, బేరిపండు మరియు గ్రీన్ ఆపిల్ ముక్కలు వేసి మొత్తగా గ్రైండ్ చేసుకోవాలి .
బ్లెండ్ చేసుకున్న తర్వాత అందులో నిమ్మరసం చేర్చి చల్లగా తాగాలి.

Top 5 Green Shakes For Weight Loss

2. కీరదోస -మింట్ షేక్
కావల్సిన పదార్థాలు: ఆకుకూర: 1 కట్ట(సన్నగా కట్ చేసుకోవాలి., పుదీనా: 1/2కప్పు (సన్నగా కట్ చేసుకోవాలి), పార్ల్సే కొద్దిగా, నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్, కీరదోసకాయ 1 (సన్నగా కట్ చేసుకోవాలి, సెలరీ : 1కప్పు, సన్నగా తరిగి పెట్టుకోవాలి, అల్లం: చిన్న ముక్క, ఐస్ క్యూబ్స్ 4

తయారుచేయు విధానం:
ఐస్ క్యూబ్స్ మినహాయించి మొత్తం పదార్థాలన్నీ మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి.
హై స్పీడ్ లో బ్లెండ్ చేసిన తర్వాత స్మూత్ షేక్ తయారువుతుంది.

దీన్ని పెద్దగ్లాసులోకి మార్చుకుని , ఐస్ వేసి సర్వ్ చేయాలి.

Top 5 Green Shakes For Weight Loss

3. పైనాపిల్ స్పినాచ్ షేక్ :
కావల్సిన పదార్థాలు: పైనాపిల్ : 1 కప్పు(సన్నగా తరిగి పెట్టుకోవాలి), ఆకుకూర: 1 కప్పు(సన్నగా తరిగిపెట్టుకోవాలి), ఫ్రెష్ పార్ల్సీ: 1/4కప్పు, అల్లం: 1/2టీస్పూన్(సన్నగా తరిగినది)

తయారుచేయు విధానం:
పైన సూచించిన పదార్థాలన్ని మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. తర్వాత సర్వింగ్ గ్లాసులోకి మార్చుకుని ఐస్ వేసి తీసుకోవచ్చు.

Top 5 Green Shakes For Weight Loss

4. మిక్స్డ్ గ్రీన్ షేక్
కావల్సిన పదార్థాలు: నీళ్ళు: 3/4కప్పు, ద్రాక్ష: 1కప్పు, పైనాపిల్ : 1/4కప్పు, ఆకుకూర: 1కప్పు(సన్నగా తరిగిపెట్టుకోవాలి), లెట్యూస్ : 1కప్పు, ఐస్ క్యూబ్స్ 1 కప్పు

తయారుచేయు విధానం:
ఐస్ క్యూబ్స్ తప్పించి ,సూచించిన మొత్తం పదార్థానలు మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. స్మూత్ షేక్ తయారైన తర్వాత చల్లా ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి.

English summary

Top 4 Green Shakes For Weight Loss

Looking out for some fabulous drinks that will help you burn those extra calories? You are at the right place. Green shakes are excellent drinks that can help you lose weight, at the same time gift you with a rejuvenated and younger look.
Story first published: Friday, June 24, 2016, 16:16 [IST]
Desktop Bottom Promotion