అక్కడ కొవ్వు ఉందా? వీటిని తింటే వారంలోనే తగ్గుతుంది!

By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

ఆహారం విషయంలో ఎన్ని నియమాలు పాటించినా పొట్ట దగ్గర మాత్రం కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. ఇక ఆడవాళ్లలో నడుము దగ్గర ఉండే షేప్స్ వారికి అందానికి చిరునామా ఉంటాయి. వీటినే లవ్ హ్యాండిల్స్ అంటూరు. ఇలియానాలాంటి నడుము ఉండాలని ప్రతి అమ్మాయి ఆశపడుతుంది.

కానీ లవ్ హ్యాండిల్స్ చుట్టూ చాలామందికి కొవ్వు పేరుకొని పోయి ఉంటుంది. అలాగే పిరుదుల భాగంలో కూడా కొవ్వు ఉంటుంది. మగవారికైతే పొట్ట చుట్టు ఇలాంటి కొవ్వు ఉంటుంది. మొత్తానికి అందరినీ వేధించే ఈ కొవ్వు సమస్యను ఒక వారంలో తగ్గించుకోవొచ్చు. 32 రకాల ఆహారాలను నిత్యం తీసుకుంటే చాలు.. మీరు స్లిమ్ గా మారొచ్చు.

నాజుగ్గా తయారుకావొచ్చు. అప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా పక్కవారు అదుర్స్ అనాల్సిందే. మీకు ఆ ప్రాంతంలో కొవ్వు ఉన్నట్లయితే మీరు ఏదైనా స్లిమ్ ఫిట్ డ్రెస్ వేసుకోవాలంటే కాస్త ఇబ్బందిపడుతుంటారు కూడా. అయితే ఫ్యాట్ తగ్గించుకునేందుకు చేసే వ్యాయామంతోపాటు కింద సూచించిన విధంగా పలు ఆహార పదార్థాలను కూడా రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుది. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

1. ఓట్స్

1. ఓట్స్

ఓట్స్ లో పిండి పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని కొద్దిగా తీసుకుంటే చాలు కడుపు నిండిన భావనను కలుగుతుంది. చాలా సేపటి వరకు ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఫలితంగా బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ తగ్గి కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. పొట్టచుట్టు పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.

2.క్వినోవా

2.క్వినోవా

ఓట్స్ మాదిరిగా క్వినోవా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్స్ ఇందులో సమృద్ధిగా ఉంటాయి. కొవ్వు కరగడానికి క్వినోవా బాగా ఉపయోగడపడుతుంది. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల పొట్ట చుట్టు ఉండే కొవ్వు తగ్గుతుంది. వంద గ్రాముల క్వినోవాలో కేలోరీలు 368 గ్రా, ప్రొటీన్లు 14 గ్రా, పిండిపదార్థాలు 64గ్రా, పీచు 7గ్రా, కొవ్వులు 6 గ్రా, శ్యాచురేటేడ్ కొవ్వులు 0.7 గ్రా, మోనో అన్‌శ్యాచురేటెడ్ 1.6 గ్రా, పాలీ అన్‌శ్యాచురేటెడ్ కొవ్వులు 3.3గ్రా, విటమిన్ ఈ 2.44 మిగ్రా, క్యాల్షియం, 47మి గ్రా, ఐరన్ 4.6 మిగ్రా, మెగ్నీషీయం 197 మిగ్రా, ఫాస్పరస్ 457 మిగ్రా, పొటాషియం 563 మిగ్రా, జింక్ 3.1 మిగ్రా ఉంటుంది. అందువల్ల వీటిని ఆహారంగా ఎక్కువగా తీసుకోండి.

3. చిలగడదుంపలు

3. చిలగడదుంపలు

చిలగడదుంపలు ఎక్కువగా తినాలి. వాటిలోని యాంటీఆక్సిడెంట్లు ఈ సమస్యని తగ్గిస్తాయి. క్వినో లాగానే వీటిలో కూడా ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి పొట్ట చుట్టే కాకుండా, పిక్కల్లో ఉన్న కొవ్వుల్ని కూడా కరిగిస్తాయి. చిలగడదుంపల్లో పీచు మోతాదు చాలా ఎక్కువ. దీంతో నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువసేపు కేలరీలు విడులయ్యేలా చేస్తాయి. విటమిన్‌ బీ6 ఎక్కువగా ఉంటుంది. రక్తనాళాలు బలంగా ఉండేందుకు తోడ్పడే హోమోసిస్టీన్‌ను విటమిన్‌ బీ6 విడగొడుతుంది. చి లగడదుంపల్లో ఎక్కువగా ఉండే సహజ చక్కెరలు రక్తంలో నెమ్మదిగా కలుస్తాయి. రక్తంలో ఒకేసారి చక్కెర మోతాదు పెరగకుండా చూస్తాయి. బరువు పెరగకుండా, నిస్సత్తువ రాకుండా కాపాడతాయి. నలుపు మరకలు లేని, గట్టి దుంపలు మంచి రుచిగా ఉంటాయి

4. బ్లాక్ రైస్

4. బ్లాక్ రైస్

బ్లాక్ రైస్ లోఎక్కువగా ప్రోటీన్లు, ఫైబర్ ఉంటాయి. ఈ రెండూ కలిసి ఉన్న వీటిని తీసుకోవడం వల్ల మీ లవ్ హ్యాండిల్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది. అలాగే మీ బెల్లీ ఫ్యాట్ కూడా ఇది తగ్గిస్తుంది.

5. పప్పుధాన్యాలు

5. పప్పుధాన్యాలు

పప్పు ధాన్యాల్లో విటమిన్ B1, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుది. ఇది పిరుదుల దగ్గర పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుంది. జీవక్రియ వేగంగా సాగేలా చేస్తుంది. దీంతో మీలో ఫ్యాట్ పేరుకుపోదు.

6. షెర్ డెడ్ వీట్

6. షెర్ డెడ్ వీట్

షెర్ డెడ్ వీట్ కు సంబంధించిన ఆహారం శరీరంలో కొవ్వును తగ్గించేందుకు బాగా ఉపయోగపడుుతంది. బరువు తగ్గేందుకు లవ్ హ్యాండిల్ మంచి షేప్ లోకి వచ్చేందుకు ఈ ఫుడ్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అలాగే రోజూ ఉదయాన్నే పరగడుపున 30 ఎంఎల్ మోతాదులో గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగాలి. దీంతో పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి.

7. బ్లాక్ బీన్స్

7. బ్లాక్ బీన్స్

బ్లాక్ బీన్స్ లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ పిరుదులు, నడుములను స్లిమ్ గా చేస్తాయి. అందువల్ల వీటిని రోజూ తింటూ ఉండండి. దీంతో చాలా తక్కువ కాలంలోనే మీరు మంచి షేప్ లోకి వస్తారు.

8. వైట్ టీ

8. వైట్ టీ

చక్కెర లేకుండా వై టీ తాగితే చాలా మంచిది. ఇది కూడా పిరుదుల చుట్టు ఉన్న కొవ్వు తగ్గించేందుకు బాగా సహాయపడుతుంది. ఈ టీని తాగటం వలన నాజుగ్గా మారి అందం మీ సొంతం అవుతుంది.

9. చిక్ పీస్

9. చిక్ పీస్

చిక్ పీస్ లేదా చన్నా అని పిలవబడే వీటిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఈ ప్రోటీన్లు పిరుదుల దగ్గర పేరుకుపోయిన కొవ్వును తగ్గించేందుకు సహాయపడతాయి. అందువల్ల వీలైనంత వరకు వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

10. చియా విత్తనాలు

10. చియా విత్తనాలు

వీటిలో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్ లను అధికంగా ఉంటాయి. బరువు తగ్గించుటలో సహాయపడతాయి. ఈ రకం ఆహార పదార్థాలను తప్పక ఆహార ప్రణాళికలో చేర్చుకోవాలి. వీటిలో ఉండే ప్రోటీన్స్ మీ హృదయ స్పందన రేటు పెంచడానికి సహాయపడతాయి. కొవ్వును ఈజీగా కరిగిస్తాయి.

11. జనపనార విత్తనాలు

11. జనపనార విత్తనాలు

చియా గింజల మాదిరిగానే జనపనార విత్తనాల్లోనూ ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మీ లవ్ హ్యాండిల్స్ దగ్గర ఏర్పడ్డ కొవ్వును తగ్గించడంలో బాగా సహాయపడతాయి. వీటిని ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయి. అలాగే ఇవి మన శరీరానికి కావాల్సిన ఇరవై అమినో ఆమ్లాలను అందిస్తాయి. శరీరంలోని హానికర యాసిడ్స్ బయటకు వెళ్లేలా తోడ్పడుతాయి.

12. గుమ్మడికాయ విత్తనాలు

12. గుమ్మడికాయ విత్తనాలు

గుమ్మడికాయ విత్తనాలను మీ ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఫైబర్, ప్రోటీన్స్ ఇందులో సమృద్ధిగా ఉంటాయి. పొట్ట దగ్గర పిరుదుల వద్ద ఉన్న కొవ్వు తగ్గడానికి ఇవి బాగా సహాయపడతాయి. ఇందులో పుష్కలమైనటువంటి న్యూట్రీషియన్స్, విటమిన్స్, మరియు మినరల్స్ ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ, సి, ఇ, కె, యాంటీయాక్సిడెంట్స్, ఇంకా జింక్, మెగ్నీషియం ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడి గింజలను వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. గింజలను ఒలిచి లోపల ఉన్న పప్పును తినవచ్చు. లేదా దంచి లోపల ఉన్న పప్పును పొడి చేసి, పాలలో మిక్స్ చేసి తీసుకోవచ్చు. లేదంటే, రోజంతా అప్పుడప్పుడు గుమ్మడి గింజలను కొరుకుతుండటం కూడా ఆరోగ్యకరమే. గుమ్మడి గింజలను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకొనే వారు, ఎక్కువగా నీళ్ళు, పండ్ల రసాలు తీసుకోవాలి.

13. టైగర్ నట్స్

13. టైగర్ నట్స్

టైగర్ నట్స్ లో కూడా ఆరోగ్యకరమైన కార్పొహైడ్రేట్లు , ప్రోటీన్లు ఉంటాయి. ఇవి పిరుదుల చుట్టు ఉన్న ఉన్న కొవ్వు కణాల్ని బర్న్ చేసేందుకు ఉపయోగపడతాయి. నడుము, పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును బాగా తగ్గిస్తాయి. అందువల్ల టైగర్ నట్స్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.

14. బాదం

14. బాదం

బాదంలలో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటాయి. ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. అలాగే పీచు, ఒమేగా-3- ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. బాదం ఎక్కువగా మోనో సాచ్యురేటెడ్ ఫాట్, ఆరోగ్యాన్ని పెంచే ఫాట్ ని కలిగి ఉంటుంది. బాదం తినటం వల్ల కొవ్వు కరిగిపోతుంది. బాదం ఎక్కువగా కాల్షియమ్, మెగ్నేషియం, ఫాస్ఫరస్'ను కలిగి ఉండటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే బాదంను నానబెట్టి తొక్కను తీసేసి తినడంవల్ల అందులోని పోషకాలన్నీ పూర్తిగా ఒంటపడతాయి. నానబెట్టిన బాదం పప్పులు జీర్ణశక్తికి అవసరమైన ఎంజైమ్‌ల విడుదలను వేగవంతం చేస్తాయి. ముఖ్యంగా లైపేజ్‌ అనే ఎంజైమ్‌ విడుదల వల్ల కొవ్వులు త్వరగా జీర్ణవుతాయి. వీటిల్లోని మోనో అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు బరువు నియంత్రణకు తోడ్పడతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

15. గ్రీన్ బఠానీలు (పీస్)

15. గ్రీన్ బఠానీలు (పీస్)

ఆకుపచ్చ బఠానీల్లో విటమిన్ సీ అధికంగా ఉంటుది. అలాగే ఈ బఠానీల్లో విటమిన్ ఏ, బీ, సీ, కే తదితరాలుంటాయి. వీటిలోనున్న మాంసకృతులు మాంసాహార పోషకాలకు సరిసమానం. శరీరానికి అవసరమైన పీచుపదార్థం ఇందులో ఉంది. ఇది ఆరోగ్యానికి చాలా ఉత్తమమైన ఆహారం. వీటిని డైలీ ఆహారంగా తీసుకోవాలి. దీంతో కొవ్వు సులభంగా తగ్గిపోతుంది.

16. కాలే

16. కాలే

కాలే కూడా పిరుదుల దగ్గర ఉన్న కొవ్వు తగ్గేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. ఇందులో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్ట దగ్గరున్న కొవ్వు ఈజీగా కరిపోతుంది.

17. బ్రౌన్ రైస్

17. బ్రౌన్ రైస్

బ్రౌన్ రైస్ లో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లలో పుష్కలంగా ఉంటాయి. ఇవి పిరుదుల చుట్టు పేరుకుపోయిన కొవ్వును తగ్గించేందుకు బాగా సహాయపడతాయి. అందువల్ల ఎక్కువగా బ్రౌన్ రైస్ తినడానికి ట్రై చేయండి.

18. పాలకూర

18. పాలకూర

పాలకూరలో విటమిన్ సీ, ఏ లు మెగ్నీషియం, పోలిక్ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. ఇవి లవ్ హ్యాండిల్స్ దగ్గర పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. అందువల్ల వీలైనంత వరకు పాలకూర ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.

19. రాస్ప్బెర్రీస్

19. రాస్ప్బెర్రీస్

రాస్పె బెర్రీస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుది. వీటిలో ఆమ్లజనకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో పిరుదుల ప్రాంతంలో ఉండే కొవ్వును ఈజీగా కరుగుతుంది. వీటిని ఎక్కువ తీసుకోవడం మంచిది.

20. బీట్ రూట్

20. బీట్ రూట్

దీనిలో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని కొవ్వును తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. బీట్ రూట్ ని చిన్న చిన్న స్లైస్ గా కట్ చేసి తింటూ ఉండండి దీంతో తక్షణ శక్తిని పొందగలరు. బీట్ రూట్ లో ఉండే నైట్రేట్లు రక్తంలో కలిశాక నైట్రిక్‌ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ వాయువు రక్తనాళాలను విప్పారేలా చేసి రక్తపోటు తగ్గేందుకు దోహదం చేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది. మొత్తానికి ఆరోగ్యానికే కాదు కొవ్వుని కరిగిచండంలోనూ ఇది బాగా పని చేస్తుంది.

21. ఓయోస్టేర్స్

21. ఓయోస్టేర్స్

వీటిలో ఒమేగా 3 ఫ్యాంటీ యాసిడ్ష్ అధికంగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి పిరుదుల్లో పేరుకుపోయిన కొవ్వును తగ్గించేందుకు బాగా ఉపయోగపతాయి. అందువల్ల తరచూ వీటిని తింటూ ఉండండి.

22. డార్క్ చాక్లెట్స్

22. డార్క్ చాక్లెట్స్

డార్క్ చాక్లెట్స్ లో అధికంగా ఆమ్లజనకాలు ఉంటాయి. ఇవి మీ లవ్ హ్యాండిల్స్ లో పేరుకుపోయిన కొవ్వు తగ్గేందుకు బాగా సహాయపడతాయి. మీ జీవక్రియను కూడా పెంచుతాయి. వీలైనంత వరకు డార్క్ చాక్లెట్స్ ఎక్కువగా తింటూ ఉండండి. డార్క్ చాకొలేట్‌లో ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. కొవ్వు కరిగిపోయి బరువు తగ్గుతారు.

23. గ్రాపి ప్రూట్

23. గ్రాపి ప్రూట్

వీటిలో విటమిన్ సి, ఆమ్లజనకాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో పేరుకపోయిన కొవ్వును తగ్గించడంలోనూ ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.

24. కొబ్బరి నూనె

24. కొబ్బరి నూనె

కొబ్బరి నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీవక్రియ బాగా అయ్యేందుకు సహాయపడతాయి. కొబ్బరి నూనెలతో తయారు చేసిన ఆహారాలు తినడం మంచిది. అయితే కేరళలో మాత్రమే ఇలాంటి ఆహారపదార్థాలు ఎక్కువగా తింటారు. కొవ్వును తగ్గించగల శక్తి కొబ్బరినూనెకు ఉంది.

25. రెడ్ పామ్ ఆయిల్

25. రెడ్ పామ్ ఆయిల్

ఈ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలుంటాయి. ఇవి లవ్ హ్యాండిల్స్ దగ్గర కొవ్వు కరగడానికి బాగా తోడ్పడుతాయి. వీలైనంతవరకు దీన్ని ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి.

26. చార్డ్

26. చార్డ్

చార్డ్ అనేది ఒక రకమైన మొక్క. ఇందులో ఫైబర్, పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది కొవ్వును కూడా బాగా తగ్గిస్తుంది.

27. అవోకాడో

27. అవోకాడో

దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవకాడొలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి లవ్ హ్యాండిల్స్ దగ్గర కొవ్వును తగ్గిస్తాయి.

28. నారింజ

28. నారింజ

ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి, అవి మీ జీవక్రియను పెంచుతాయి. కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి.

29. చికెన్

29. చికెన్

లీన్ చికెన్ లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. లీన్ చికెన్ ఎక్కువగా తీసుకోండి.

30. గుడ్డు

30. గుడ్డు

చికెన్ లాగానే గుడ్డులోనూ ఎక్కువగాగా ప్రోటీన్లు ఉంటాయి. ప్రతిరోజూ ఒక గుడ్డు తీసుకుంటే శరీరానికి సరిపడా బి-విటమిన్ లభిస్తుంది. వారంలో 3 రోజులు గుడ్లు తినడం వల్ల బరువు ఈజీగా తగ్గుతారు. మీ లవ్ హ్యాండిల్స్ స్లిమ్ గామారుతాయి. కోడిగుడ్లను తింటే బరువు పెరుగుతారని చాలా మందిలో అపోహ ఉంది. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు. ఎందుకంటే కోడిగుడ్లు బరువును పెంచవు. తగ్గిస్తాయి. వీటిల్లో ఉండే ప్రోటీన్ మన శరీరంలో కండరాలను నిర్మాణం చేస్తుంది. దీంతో అధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. శరీర మెటబాలిక్ రేటు పెరిగి బరువు త్వరగా తగ్గుతారు.

31. టర్కీ కోడి మాసం

31. టర్కీ కోడి మాసం

రోజూ మీ ఆహారంలో టర్కీ కోడి తీసుకుంటే మంచిదే. అధిక మాంసకృత్తులుంటాయి. ఇవి మీలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి. అంతేకాకుండా స్లిమ్ గా తయారయ్యేందుకు టర్కీ కోడి మాంసం బాగా ఉపయోగపడుతుంది.

32. గ్రీన్ టీ

32. గ్రీన్ టీ

గ్రీన్ టీ ద్వారా కొవ్వు ఈజీగా తగ్గిపోతుంది అని అందరికీ తెలుసు. గ్రీన్ టీ యాంటీ-ఆక్సిడెంట్స్'ని కలిగి ఉంటుంది. ఉదయం, సాయంత్రం రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే పొట్ట తగ్గుతుంది. గ్రీన్ టీలో చక్కెర, పాలను కలపకూడదు. తేనె కలుపుకోవచ్చు.

English summary

32 Foods That Help You Lose ‘Love Handles’ In A Week!

Imagine this, you are going shopping for a charming dress for your friend's birthday party and you are interested in something which is stylish and sexy - like a figure-hugging evening gown! When you go to the store and try the outfit you had in mind on, you notice that your "love handles", or the excess fat around your hips is making you look unflattering! Well, this can definitely make a person feel extremely disappointed, because who does not want to look fit in stylish clothes, right?
Story first published: Thursday, November 9, 2017, 11:53 [IST]
Subscribe Newsletter