Latest Updates
-
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది?
ఫాస్ట్ గా ఫ్యాట్ ను కరిగించే ఫన్నీ ఐడియాస్!
ఫాస్ట్ గా ఫ్యాట్ ను కరిగించుకోవాలని చూస్తున్నారా? స్లిమ్ గా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి? ప్రతి ఒక్కరూ కోరుకునేది అదే. అయితే సహజంగా ఆప్షన్ ఏంటంటే బరువు తగ్గడం, క్యాలరీలను కరిగించడం ఒకటే మార్గం. అందుకు నిరంతర వ్యాయామం తప్పనిసరి.
అయితే ఇది ఒక్కటే మార్గమని చెప్పలేం. క్యాలరీలు కరిగించుకోవడానికి, స్లిమ్ గా కనబడటానికి జిమ్ కు మాత్రమే వెళ్ళాల్సిన అవసరం లేదు .

మీరు జిమ్ లో చేరినా, అందుకు మీరు ఒక సమయాన్ని ఎంపిక చేసుకోవాలి. అది మీకు కుదరకపోవచ్చు. బిజీ షెడ్యూల్ తో అది మీకు సాధ్యపడకపోవచ్చు.
మరైతే దీనికి పరిస్కారం ఏంటి? ఇంట్లో చేసే కొన్ని సింపుల్ వర్కౌట్సే పనిచేస్తాయి. ఒక చిన్న వర్కౌట్ తో ఎటువంటి ఖర్చులేకుండా పరిష్కారం సులభంగా దొరుకుతుంది.

ఒక గంటలో వంద క్యాలరీలను కరిగించే రతి క్రీడ:
పార్ట్నర్ తో కలవడం వల్ల ఒక గంటలో వంద క్యాలరీలు ఖర్చు అవుతాయి. మన శరీరంలో ప్రతి భాగంలో కదలికలు ఉండటం వల్ల అందుకు బాడీలోని ఎనర్జీతో పాటు క్యాలరీలు కూడా ఉపయోగించుకోవడం వల్ల శరీరంలో క్యాలరీలు బర్న్ అవుతాయి. దాంతో శరీరం ఫిట్ గా ఉంటుంది. కాబట్టి, పాట్నర్ తో రెగ్యులర్ సెక్స్ జరపడం మంచిది.

పరుగు:
పరుగువల్ల కాళ్ల కండరాలు, పిరుదల జాయింట్ కండరాలు కదలికలు ఎక్కువై ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. రెగ్యులర్ గా రన్నింగ్ చేయడం వల్ల తప్పనిసరిగా మార్పులను చూస్తారు. ఇది ఒక సింపుల్ రెమెడీ. బయటకు వెళ్లలేని వారు మేడ మీదకు ఎక్కడం, దిగడం చేస్తుండాలి. అరగంట పరుగు వల్ల 374 క్యాలరీలు కరుగుతాయి. ఇంత కంటే మరో బెస్ట్ వ్యాయామం మరొకటి ఉందు కాబట్టి, రెగ్యులర్ వ్యాయామంతో పాటు, పరుగు కూడా అవసరమే.

స్కిప్పింగ్ :
మరో ఈజీ వర్కౌట్ స్కిప్పింగ్. తాడుతో స్కిప్పింగ్ చేయడం . స్కిప్పింగ్ వల్ల చేతులు, భుజాలు, కాళ్ల కండరాల్లో కదలికలుంటాయి. శరీరంలో ఎక్కువ క్యాలరీలు కరిగించడంలో ఈ వర్కౌట్ కూడా టాప్ లిస్ట్ లో ఉంటుంది. 30 నిముషాల వర్కౌట్ వల్ల 340 క్యాలరీలు బర్న్ అవుతాయి.

డ్యాన్సింగ్ :
మరో ఎక్సలెంట్ మెటబాలిజం బూస్టర్, తమాషాగా ఉంటుంది, డ్యాన్స్ చేయొచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవల్సిన విషయం టెంపో హైలో ఉంచి, ఫాస్ట్ బీట్ సాంగ్స్ తో డ్యాన్స్ చేయాలి. మీ వర్కౌట్ కంప్లీట్ అయ్యే వరకూ నిలపకుండా డ్యాన్స్ చేయాలి. ఇది క్యాలరీలను బర్న్ చేయడం మాత్రమే కాదు, మైండ్ ఫ్రీగా ఉంటుంది. స్ట్రెస్ తగ్గిస్తుంది. మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. ముఖ్యంగా దీన్ని ఇంట్లోనే స్వయంగా చేసుకోవచ్చు. చాలా మంది ఫిజికల్ ఫిట్నెస్ కోసం డ్యాన్స్ ను ఎంపిక చేసుకుంటున్నారు . డ్యాన్సులో కూడా జుంబా డ్యాన్స్ ఎఫెక్టివ్. ఇది చేయడానికి కూడా సులభం. డ్యాన్స్ వర్కౌట్ వల్ల మంచి పాటతో.. షాప్ట్ బీట్ సాంగ్ తో మూమెంట్ చేసి, చివరన కూల్ గా కూర్చుంటారు. 30 నిముషాల డ్యాన్సింగ్ వల్ల 221 క్యాలరీలను కరిగించుకోవచ్చు.

వాకింగ్:
మరో సింపుల్ అండ్ ఈజీ వర్కౌట్ వాకింగ్. నడక ఆరోగ్యానికి మాత్రమే మంచిది కాదు, నడక వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. బ్రిస్క్ వాక్ వల్ల క్యాలరీలను వేగంగా తగ్గ్గించుకోవచ్చు. అయితే బ్రిస్క్ వాక్ చేస్తున్నప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. కొద్దిసేపు స్పీడ్ గా, కొద్దిసేపు స్లోగా నడవాలి. చేతులు ముందుకు, వెనుకకు జోరుగా కదలించాలి. 30 నిముషాల్లో 170 క్యాలరీలను కరిగించుకోవాలి.

వస్తువులను మార్పిడి చేయాలి:
బాడీలో ఎక్సెస్ క్యాలరీలను బర్న్ చేయడానికి ఫర్నీచర్ రీ అరేంజ్ చేయడం, మీకు నచ్చినట్లు రూమ్ అరేంజ్మెంట్ చేసుకోవడం వంటి చిన్న చిన్న ఇంటి పనులతో కూడా క్యాలరీలను సులభంగా కరిగించుకోవచ్చు.

పాటపాడటం, బిగ్గరగా నవ్వడం:
వర్కౌట్ మరింత ఇంట్రెస్టింగా ఉండాలంటే గట్టిగా పాట పాడటం, నవ్వడం, తమాషాగా ఉండటం అలవాటు చేసుకోవాలి. పాటపాడటం వల్ల 136 క్యాలరీలు ఖర్చు అవుతాయి. అలాగే నవ్వడం వల్ల 67 క్యాలరీలు బర్న్అ వుతాయి.

తోటపని:
గార్డెనింగ్, మొక్కలు నాటడం, గార్డెన్ క్లీన్ చేయడం వల్ల ఎక్కువ క్యాలరీలను కరిగించుకోవచ్చు. అనవసరమైన మొక్కలను తొలగించడం, తోటలోచెత్తా చెదారం తొలగించడం వల్ల 127 క్యాలరీలు కరిగించుకోవచ్చు. అలాగే కొత్త మొక్కను పెంచడం 15 నిముషాల్లో 77 క్యాలరీలు కరుగుతాయి. ఈ వర్కౌట్ వల్ల మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. సంతోషంగా ఉంటారు.



Click it and Unblock the Notifications