For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుంబా డ్యాన్స్ తో బరువు తగ్గడంతో పాటు...అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!!

మన దేశంలో జుంబా డ్యాన్స్ కు యువతలో మంచి క్రేజ్‌ ఉంది. ముంబాయ్‌, ఢిల్లీ నగరాలలో ఈ డ్యాన్స్ ను కొంత భాంగ్రా నృత్యంతో మేళవించి శిక్షణ నిస్తుండడం విశేషం. ఈ డ్యాన్స్ తో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు

|

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో యూత్‌ ప్రతీది వెరైటీగా ఉండాలని కోరుకుంటున్నారు. ధరించే వస్త్రాలు, ఫ్యాషన్‌ యాక్ససరీస్ తదితరాలే కాదు పబ్‌లలో చేసే డ్యాన్సులు సైతం వెరైటీగా ఉండాలని వారు తాపత్రయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫాస్ట్‌ బీట్‌ మ్యూజిక్‌ మధ్య హుషారుగా చేసే జుంబా నృత్యం పట్ల యూత్‌ ఎంతో ఆకర్షితులవుతున్నారు. నేడు ఈ లాటిన్‌ అమెరికన్‌ డ్యాన్స్‌కు యూత్‌ లో మంచి క్రేజ్‌ ఉంది. మన దేశంలోని పలు ప్రధాన నగరాల్లో యూత్‌ ఎంతో ఇష్టపడి జుంబా డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. జుంబా డ్యాన్స్ చేస్తే ఏరోబిక్స్‌ మాదిరిగా ఫ్యాట్‌ బాగా తగ్గుతుందని ఫిట్‌నెస్‌ నిపుణులు సెలవిస్తుండడం విశేషం.

Amazing Health Benefits Of Zumba You Never Knew!

ఉర్రూతలూగించే మ్యూజిక్‌ మధ్య యువతీ, యువకులు హుషారుగా కాళ్లు, చేతులు ఆడిస్తూ డ్యాన్సులు చేస్తున్నారు. ఏరోబిక్స్‌ను తలపించే విధంగా ఉన్న డ్యాన్సును యువ జంటలు ఉత్సాహంగా చేస్తూ ఆకట్టుకున్నారు. నేడు లాటిన్‌ అమెరికన్‌ డ్యాన్స్‌ జుంబా డ్యాన్స్ ను మన దేశంలోని ప్రధాన నగరాల్లోని యూత్‌ ఎంతో ఇష్టపడి నేర్చుకుంటున్నారు. ప్రతి దాంట్లో వెరైటీని కోరుకునే యువతీ,యువకులు జుంబా డ్యాన్స్‌ను ప్రత్యే కంగా నేర్చుకొని పబ్‌లలో జరిగే నైట్‌పార్టీలలో వీటిని ప్రదర్శిస్తున్నారు.

ఓవర్ వెయిట్ తగ్గించుకోవడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!

మన దేశంలో జుంబా డ్యాన్స్ కు యువతలో మంచి క్రేజ్‌ ఉంది. ముంబాయ్‌, ఢిల్లీ నగరాలలో ఈ డ్యాన్స్ ను కొంత భాంగ్రా నృత్యంతో మేళవించి శిక్షణ నిస్తుండడం విశేషం. నాసిక్‌ డోల్‌ బీట్స్‌ మధ్య ఈ నృత్యాన్ని నేర్పిస్తున్నారు. ఏరోబి క్స్‌ను పోలి ఉండే జుంబా నృత్యంలో బాడీ వర్కవుట్స్‌ ఎక్కువగా ఉంటాయి. కార్డి యో బేస్డ్‌ వర్కవుట్‌లతో కూడిన ఈ నృత్యాన్ని ప్రాక్టీస్‌ చేస్తే శరీరంలో ఫ్యాట్‌ తగ్గుతుందని ఫిట్‌నెస్‌ నిపుణులు సైతం చెబుతుండడం విశేషం. ఇక ఇందులోని వార్మప్‌, కూల్‌ డౌన్‌ సెషన్స్‌ ఏరోబిక్స్‌ మాదిరిగానే ఉంటాయి. ఈ డ్యాన్సులో కొన్ని స్టెప్పులలో జంపింగ్‌, స్క్వాటింగ్‌, కిక్స్‌ సైతం ఉంటాయని జుంబా డ్యాన్స్ నిపుణులు సూచిస్తున్నారు.

బరువు తగ్గించుకోవడంలో అపోహలు-వాస్తవాలు

జుంబా డ్యాన్స్ వల్ల క్యాలరీస్ ఎలా కరుగుతాయో చూద్దాం..జుంబా డ్యాన్స్ వర్కవుట్స్‌ను బట్టి ప్రాక్టీస్‌ చేసే వారిలో ఫ్యాట్‌ కరిగిపోతుంది. ఒక గంటకు కనీసం 500-800 కేలరీలు కరిగిపోతుందని ఫిట్ నెస్ నిపుణులు వివరించారు. ఇక లైట్‌వెయిట్స్‌తో చేసే ఈ నృత్యం ఎంతో వెరైటీగా ఉంటుంది. జుంబా టోనింగ్‌ పేరుతో పిలిచే ఈ నృత్యాన్ని డంబెల్స్‌తో చేయడం వల్ల భుజాలు గట్టి పడతాయి. ఇక జుంబా నృత్యం చేసేవారు ఏరోబిక్స్‌ డ్యాన్స్‌ షూస్‌, స్నీకర్స్‌ను ధరించాల్సి ఉంటుందని, ఈ డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేయడానికి ముందు తర్వాత మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలంటున్నారు నిపుణులు. దాంతో చెమట రావడం మూలంగా బాడీ హైడ్రేటెడ్‌ కాకుండా ఉంటుందని చెప్పారు. అంతే కాదు, జుంబా డ్యాన్స్ చేయడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి..

 బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

జుంబా డ్యాన్స్ కార్డియో వ్యాస్కులర్ వర్కౌట్స్ లో కూడా మిలితమవ్వడం వల్ల, క్యాలరీలను ఫాస్ట్ గా బర్న్ చేస్తుంది. దాంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

మెటబాలిక్ రేటు పెరుగుతుంది:

మెటబాలిక్ రేటు పెరుగుతుంది:

జుంబా డ్యాన్స్ చేయడం వల్ల మెటబాలిక్ రేటు పెరుగుతుంది. దాంతో బాడీలో వెయిట్ లాస్ బెనిఫిట్స్ పెరుగుతాయి.

 బాడీ షేప్ పూర్తిగా ఫిట్ గా ఉంటుంది:

బాడీ షేప్ పూర్తిగా ఫిట్ గా ఉంటుంది:

వర్కౌట్స్ లో వివిధ రకాల స్టెప్పులలో జంపింగ్‌, స్క్వాటింగ్‌, కిక్స్‌ వంటివి మన శరీరంలో ప్రతి పార్ట్ ఫిట్ గా మరియు టోన్డ్ గా ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి, శరీరంలో ప్రతి పార్ట్ కదలికలతో ఫిట్ గా ఉంచుకోవాలంటే జుంబా డ్యాన్స్ చేసేయండి..

హార్ట్ హెల్త్ మెరుగుపడుతుంది:

హార్ట్ హెల్త్ మెరుగుపడుతుంది:

జుంబా డ్యాన్స్ పూర్తిగా కార్డియో వ్యాస్కులర్ వర్కౌట్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఇది హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. వివిధ రకాల ప్రమాధకర ఎలిమెంట్స్ ను హార్ట్ ను కాపాడుతుంది.

సాగిన చర్మంను టైట్ గా మార్చుతుంది:

సాగిన చర్మంను టైట్ గా మార్చుతుంది:

మజిల్ మాస్ ను మెరుగుపరచడంతో పాటు, మజిల్స్ స్ట్రాంగ్ గా మార్చుతుంది. స్కిన్ ఎలాసిటి మెరుగుపరుస్తుంది. జుంబా డ్యాన్స్ వల్ల సాగిన చర్మం టైట్ గా స్టిఫ్ గా మారుతుంది. బాడీ టోన్ అందంగా కనబడుతుంది.

స్ట్రెస్ తగ్గిస్తుంది:

స్ట్రెస్ తగ్గిస్తుంది:

జుంబా డ్యాన్స్ వల్ల శరీరంలో ప్రతి భాగంలో కదలికలు ఉంటాయి. ఫాస్ట్ బీట్ డ్యాన్సింగ్ వల్ల ..ఫన్నీ యాక్టివిటీ వల్ల బాడీ ఫిట్ గా మరియు స్ట్రెస్ ఫ్రీగా ఉండగలుగుతారు.

డిప్రెషన్ తగ్గిస్తుంది:

డిప్రెషన్ తగ్గిస్తుంది:

జుంబాడ్యాన్స్ శరీరంలో ఎండోర్ఫిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. బ్రెయిన్ లో ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదల కావడం వల్ల డిప్రెషన్ తగ్గించుకోవచ్చు.

హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది:

హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది:

అనేక రీసెర్చెస్ ప్రకారం, జుంబాడ్యాన్స్ హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. బ్లడ్ వెజల్స్ లో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

English summary

Amazing Health Benefits Of Zumba You Never Knew!

Surely, most of us would already know that zumba is a form of fitness regime that has made its mark as a fun workout idea, lately. Did you also know that zumba comes with numerous health benefits?
Story first published: Friday, January 6, 2017, 17:56 [IST]
Desktop Bottom Promotion