బరువు తగ్గించే ఎఫెక్టివ్ ఆయుర్వేదిక్ రెమెడీ..

Posted By:
Subscribe to Boldsky

సహజంగా బరువు పెరగడం ఏమో కానీ, బరువు తగ్గడం మాత్రం అంత సులభం కాదు. అయితే టీవీలలో, పబ్లిక్ ఫంక్షన్స్, ఈవెంట్స్ లో సెలబ్రెటీలను చూసినపపుడు వారి ఫర్ఫెక్ట్ ఫిగర్ చూసినప్పుడు మాత్రం వీరు అలా ఎలా ఉండ గలరు అన్న సందేహం కలగక తప్పదు. ఒక్క ఇంచ్ ఫ్యాట్ లేకుండా కర్వింగ్ ఫిగర్ ను ఎలా మెయింటైన్ చేస్తారన్న సందేహం వస్తుంది..!

అలా చూసినప్పుడు మనం కూడా స్లిమ్ గా, ఫిట్ గా మారాలని కోరుకుంటాం కదా..? బరువ తగ్గడం కేవలం అందమైన బాడీ ఫిగర్ ను మెయింటైన్ చేయడానికి మాత్రమే కాదు,ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.!

Ayurvedic Spinach Remedy For Quick Weight Loss

బరువు తగ్గడానికి నేచురల్ రెమెడీస్, హోం రెమెడీస్, వ్యాయామాలు ఎన్నో చేసుంటారు. అయితే ఆయుర్వేదం ప్రయత్నించారా? పురాతన కాలం నుండి ఆరోగ్యానికి, అందానికి ఆయుర్వేదం ఎంతగానో సహాయపడుతున్నది. అలాంటి ఆయుర్వేద రెమెడీ లేదా మెడిసిన్స్ బరువు తగ్గించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుందంటే నమ్మశక్యం కాదు..!

ఈ రోజుల్లో చాలా మంది మోడ్రన్ మెడిసిన్స్ ను పూర్తిగా మర్చిపోతున్నారు. ఆలస్యమైన ఆయుర్వేదిక్ రెమెడీస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని నమ్ముతున్నారు. అంతే కాదు, ఇవి పూర్తిగా సురక్షితమైనవి, నేచురల్ గా అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

Ayurvedic Spinach Remedy For Quick Weight Loss

బరువు తగ్గించుకునే క్రమంలో కూడా, ఈ ఆయుర్వేదిక్ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బరువు తగ్గించడంలో అలోవెర, జింజర్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..

కావల్సిన పదార్థాలు:

ఆకుకూరలు జ్యూస్ : 3 టేబుల్ స్పూన్స్

అల్లం జ్యూస్ : 1 టేబుల్ స్పూన్

ఈ రెండింటి కాంబినేషన్ హోం రెమెడీ బరువు తగ్గించడంతో పాటు, వండర్ ఫుల్ గా పనిచేసి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే రెగ్యులర్ గా తీసుకునేటప్పుడు, సరైన మోతాదును మెయింటైన్ చేయాలి.

ఈ రెమెడీని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల అదనంగా హై క్యాలరీ ఫుడ్స్ కు దూరంగా ఉంటారు. ఈ నేచురల్ రెమెడీతో పాటు, రోజూ 45 నిముషాలు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.

Ayurvedic Spinach Remedy For Quick Weight Loss

ఆకుకూరలతో తయారుచేసిన జ్యూస్ లో ప్రోటీన్స్, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో మెటబాలిక్ రేటును పెంచుతాయి. దాంతో శరీరంలో ఉండే కొవ్వు చాలా వేగంగా కరుగుతుంది.

అల్లంలో అల్లిసిన్ అనే కంటెంట్ తో పాటు, పవర్ ఫుల్ ఎంజైమ్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో చాలా వేగంగా షోషింపబడి, వేగంగా ఫ్యాట్ ను బర్న్ చేస్తుంది. దాంతో బరువు సులభంగా తగ్గుతారు.

తయారుచేయు విధానం:

పైన సూచించిన పదార్థాలను తీసుకోవాలి.

ఈ రెండూ పదార్థాలు బాగా మిక్స్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ లో 2 నెలలు తాగితే అద్భుతమైన మార్పు ఉంటుంది.

English summary

Ayurvedic Spinach Remedy For Quick Weight Loss

Here is how this simple ayurvedic remedy can help you get slimmer!
Subscribe Newsletter