బరువు తగ్గటానికి సయాన్నె క్యాప్సికం కారంపొడి

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

క్యాప్సికం కారపుపొడి బరువు తగ్గటానికి చాలా శక్తివంతమైన సహజపదార్థం. అది మెటబాలిక్ వేగాన్ని పెంచి, మీ ఆకలిని తగ్గించి,కొవ్వు కరగటానికి సాయపడుతుంది. ఈ వ్యాసంలో, క్యాప్సికం కారపు పొడి వెనక వున్న బరువుతగ్గే లక్షణం, శాస్త్రీయత,ఎలా తీసుకోవాలి,ఇతర ఆరోగ్యలాభాల వంటి అనేకం వివరిస్తాను.అందుకని, బరువు తగ్గి అందంగా తయారవటానికి రెడీ అవ్వండి!

కేయాన్ పెప్పర్లో ఒక ఫైటోకెమికల్ క్యాప్సియాసిన్ అనేది ఉంటుంది, ఇదే ఘాటుకి కారణం మరియు బరువు కూడా తగ్గిస్తుంది.ఇది నాడీగ్రాహకాలను కలిపి, కాల్షియం ప్రసరించటానికి సాయపడుతుంది.ఇది యాంటీఆక్సిడెంట్ ఎంజైముల స్థాయిలు పెరగటం, ప్రియాన్ ఇన్ఫ్లమేటరీ ప్రొటీన్ ఎక్స్ ప్రెషన్ తగ్గటం వంటి కణప్రతిస్పందనలను కలిగిస్తుంది. ఇలా జరగటం వలన విషపదార్థాలు బయటకి వెళ్ళిపోతాయి మరియు విషపదార్థాలు పేరుకోకుండా ఉంటాయి, మెటబాలిక్ వేగం పెరుగుతుంది.

Cayenne Pepper for Weight Loss

పరిశోధకులు ఈ క్యాప్సికం పొడిని భోజనానికి జతచేయడం వలన ఆహారం వల్ల మొదలయ్యే లిపిడ్ ఆక్సిడేషన్ మరియు ఉష్ణం విడుదల కావటం పెరుగుతాయి. ఇది ఆకలిని తగ్గించి, కడుపునిండుగా ఉన్న భావాన్ని కలిగిస్తుంది. క్యాప్సియాసిన్ భోజనం తర్వాత కూడా తినాలన్న కోరికను తగ్గించి, అతిగా తినకుండా చేస్తుంది. క్యాప్సికం కారంలో మిరపకాయలలో ఉండే కాప్సియాసిన్ లాంటి ఫైటోకెమికల్ డైహైడ్రోక్యాప్సియేట్ ఉంటుంది. పరిశోధకులు ఈ డైహైడ్రోక్యాప్సియేట్ మెటబాలిజాన్ని 50 క్యాలరీలు రోజుకి చొప్పున పెంచుతుందని కనుగొన్నారు.

అయితే అధ్యయనాల ప్రకారం,క్యాప్సికం కారంపొడి (కేయాన్ పెప్పర్)కి బరువుతగ్గే లక్షణాలు ఉన్నాయని తేలింది.సరిగ్గా వాడితే కావాలసిన ఫలితాలు వస్తాయి. దీన్ని మీ ఆహారంలో ఎలా వాడాలో, ఎలా బరువుతగ్గాలో చదవండి.

Cayenne Pepper for Weight Loss

కేయాన్ పెప్పర్ ను బరువుతగ్గటానికి ఎలా వాడాలి?

అత్యుత్తమ శుభ్రత- బరువుతగ్గటానికి రసంతో శరీరాన్ని లోపలనుంచి అత్యుత్తమంగా శుభ్రపరిచే ప్రక్రియ ఇది. ఇందులో వాడే ముఖ్యపదార్థాలు నిమ్మరసం, మేపుల్ సిరప్, మరియు కేయాన్ పెప్పర్ (క్యాప్సికం కారంపొడి). దాన్ని ఎలా తయారుచేయాలో చదవండి.

Cayenne Pepper for Weight Loss

కావాల్సిన వస్తువులు

2చెంచాల తాజా నిమ్మరసం

2 చెంచాల గ్రేడ్ బి మేపుల్ సిరప్

చిటికెడు సయెన్నె పెప్పర్ (క్యాప్సికం కారంపొడి)

1 కప్పు నీరు

ఎలా తయారుచేయాలి

ఈ అన్ని వస్తువులను ఒక కప్పు నీటిలో వేయండి. తాగేముందు బాగా కలపండి.

పళ్లరసాలు/స్మూతీలు - మీరు ¼-1/2 చెంచా క్యాప్సికం కారంపొడిని మీ పళ్ళరసం లేదా స్మూతీలో వేసి బరువుతగ్గడానికి వాడండి. పండ్ల యొక్క తియ్యదనం కేయాన్ ఘాటును తగ్గించి రుచిని కలిగిస్తుంది.

Cayenne Pepper for Weight Loss

ఇంటిభోజనం - కేయాన్ పెప్పర్ పొడి ఇంటి భోజనం వంటకాలకి కూడా రుచిని కలిగిస్తుంది. మీరు మీ సలాడ్ , సూప్, పెరుగు డిప్ మరియు ఇతర వంటకాలకి మరీ ఘాటుగా కాకుండా,గొట్రు రాకుండా ½-1 చెంచా ఈ క్యాప్సికం కారం పొడిని జతచేయవచ్చు.

కేయాన్ పెప్పర్ బిళ్ళలు - మీరు ఈ రకం క్యాప్సికం కారంపొడి క్యాప్స్యూల్స్ ని బరువు తగ్గటానికి, మరిన్ని ఆరోగ్యలాభాలకోసం తీసుకోవచ్చు. వీటిని మీరు స్థానిక మెడికల్ షాపుల్లో లేదా ఆన్ లైన్ లో ఆర్డర్ చేయవచ్చు.

ఇప్పుడు మనకి బరువు తగ్గటానికి సయెన్నె క్యాప్సికం ఎలా ఉపయోగపడుతుందో తెలిసింది కాబట్టి మీతో బరువు తగ్గే డైట్ ప్లాన్ పంచుకోబోతున్నాం. ఈ డైట్ లో క్యాప్సికం కారంపొడి భాగంగా ఉంటుంది, ఇది మీ బరువును తొందరగా తగ్గించేస్తుంది.

Cayenne Pepper for Weight Loss

క్యాప్సికం కారంపొడితో బరువు తగ్గే డైట్ ఛార్ట్

భోజనం

పొద్దున్నే (7.00-7.45 ఎఎం)

ఏం తినాలి ; నిమ్మరసంతో గోరువెచ్చని నీరు

అల్పాహారం (8.30-8.45 ఎఎం)

ప్రత్యామ్నాయాలుః

మాస్టర్ క్లెన్స్ రసం + ఓట్ మీల్+2 బాదంపప్పులు

మాస్టర్ క్లెన్స్ రసం + ఉడకబెట్టిన గుడ్లు 4 బాదంపప్పులు

మధ్యాహ్న భోజనం ముందు స్నాక్ (11.00ఎఎం) గ్రీన్ టీ

మధ్యాహ్న భోజనం (12.30-1.30పిఎం)

ప్రత్యామ్నాయాలుః

చికెన్ సలాడ్ కొంచెం నిమ్మరసం మరియు ఒక చిటికెడు సయాన్నె క్యాప్సికం కారంపొడి

హుమ్ముస్ లో చిటికెడు సయాన్నె క్యాప్సికం కారంపొడి మరియు 1 పీతా బ్రెడ్

సాయంత్రం స్నాక్ (4.00-4.30 పిఎం)

ప్రత్యామ్నాయాలుః

మజ్జిగ

తాజా కొబ్బరిబోండాం నీళ్ళు

చిన్న బౌల్ పళ్ళముక్కలు

రాత్రి భోజనం (7.00-7.30 పిఎం)

ప్రత్యామ్నాయాలుః

గ్రిల్ చేసే చేపలో కేయాన్ క్యాప్సికం కారం పొడి మరియు జీలకర్ర పొడి మరియు కాయగూరల ముక్కలు

వెల్లుల్లి మరియు కేయాన్ పెప్పర్ ఫ్లాంబె మరియు కాయగూర ముక్కలతో కూడిన పప్పు సూప్

English summary

Cayenne Pepper for Weight Loss

Cayenne pepper contains a phytochemical, capsaicin, which is responsible for its spiciness and aids weight loss. It works by binding to the neuroreceptors, which induces calcium influx. This triggers a host of cellular responses, such as increasing the levels of antioxidant enzymes and decreasing proinflammatory protein expression. This, in turn, helps to flush out toxins, prevents plaque formation, and increases the metabolic rate
Story first published: Thursday, December 7, 2017, 19:30 [IST]