అతి తక్కువ రోజుల్లో వేగంగా బరువు తగ్గాలంటే అల్లం మరియు జీలకర్ర డికాషన్ తాగాల్సిందే

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

సాధారణంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఫిట్ గా , అందంగా ఉండాలని కోరుకుంటారు. నాజూకైన ఫిగర్ తో అందమైన డ్రెస్సు వేసుకోవాలని సూచిస్తారు. కానీ అనుకోకుండా కొద్దికొద్దిగా శరీరంలో ఫ్యాట్ చేరడం జరిగితే ఆందోళన చెందుతారు

డైట్ , వ్యాయమం, మరియు వర్కౌట్స్ అనేవి దినదిన చర్యకు చాలా ఉపయోగపడుతాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఉరుకులపరుగుల జీవితంలో ఇటు ఇంటిపని, అటు ఆఫీస్ పని బ్యాలెన్స్ చేసుకోకుంటే జిమ్ కు వెళ్ళాలంటే కొంచెం కష్టమే అవుతుంది. అలాగే ఉదయం వ్యాయామాలు చేయడం అంటే టైమ్ సరిపోడం లేదని సాకులు చెబుతుంటారు.

అంతే కాదు, రోజువారి జీవితంలో డైట్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. బిజీ షెడ్యూల్స్ లో సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో ఎక్స్ ట్రా ఫ్యాట్ చేరి మరింత ఎక్కువ లావు అవ్వడం జరగుతుంది.

Natural Drink To Lose Weight

డైటరీ వెయిట్ లాస్ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల కొన్ని సైడ్ ఉంటాయి. అందువల్ల ఎక్స్ ట్రా కిలోల బరువు తగ్గించుకోవడానికి న్యాచురల్ రెమెడీస్ ను అనుసరించడం మంచిది. ఈ న్యాచురల్ రెమెడీస్ లో జీలకర్ర, అల్లం కొన్ని అద్భుతాలను చేస్తాయి .

ఈ రెండూ పదార్థాలు వంటగదిలో సులభంగా అందుబాటులో ఉంటాయి. వీటి ప్రయోజనాలు, వెలకట్టలేనివి, లెక్కపెట్టలేన్ని ఉన్నాయి. కానీ ఈ రెండింటి కాంబినేషన్ వల్ల కొద్ది రోజుల్లోనే బరువు తగ్గవచ్చు.

జీలక్ర ప్రయోజనాలు :

జీలకర్ర పసుపు పచ్చవర్ణంలో ఉంటుంది. పోపుదినుసుల్లో, మసాలా దినుసుల్లో ఇది ఒకటి. ఈ జీలకర్రలో ఔషధగుణాలు అధికంగా ఉన్నాయి. ఇంకా ఐరన్ క్యాల్షియంలు కూడా ఎక్కువ. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరంలో ట్యాక్సిన్ ను తొలగిస్తుంది. . కిడ్నీలు సరిగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇంకా..

1.జీర్ణ శక్తిని పెంచుతుంది:

1.జీర్ణ శక్తిని పెంచుతుంది:

జీలకర్రలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ శక్తిపెంచుతుంది. హెమరాయిడ్స్ మరియు గ్యాస్ నివారిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.

2. వ్యాధినిరోధకతను పెంచుతుంది:

2. వ్యాధినిరోధకతను పెంచుతుంది:

జీలకర్రలో ఉండే విటమిన్స్ సి బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను తగ్గింస్తుంది, వ్యాధినిరోధకతను పెంచుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గించి, ఒత్తిడి తగ్గిస్తుంది.

3. శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది:

3. శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది:

జీలకర్ర ఆస్త్మా నివారిస్తుంది. శ్వాసనాళంలో మ్యూకస్ ను తొలగిస్తుంది.ః

4. చర్మ ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది:

4. చర్మ ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది:

జీలకర్రలో ఉండే విటమిన్ ఇ యాంటీఏజింగ్, యాంటీఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఇది చర్మంలో స్కార్స్, మచ్చలు, మరియు మొటిమలను తొలగిస్తుంది.

5. నిద్రలేమి సమస్యను నివారిస్తుంది:

5. నిద్రలేమి సమస్యను నివారిస్తుంది:

జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరచడమే కాదు, మంతిమరుపు దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుంది. దాంతో నిద్రలేమి సమస్యలు కూడా తగ్గుతాయి.

6. యజీలకరలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి:

6. యజీలకరలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి:

జీలకర్ర కామన్ కోల్డ్, ఫ్లూ , బ్యాక్టీరియాతో వచ్చే వ్యాధులను నివారిస్తుంది.

7. డయాబెటిస్ ను నివారిస్తుంది. :

7. డయాబెటిస్ ను నివారిస్తుంది. :

జీలకర్ర లో కుమినాల్ డిహైడ్ అధికంగా ఉండటం వల్ల ఇది హైపోగ్లిసిమా తగ్గిస్తుంది. మరియు బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. .

8. క్యాన్సర్ నివారిస్తుంది:

8. క్యాన్సర్ నివారిస్తుంది:

జీలకర్రలో విటమిన్ సి మరియు విటమిన్ ఎలు అధికంగా ఉండటం వల్ల వ్యాధినిరోధకతను పెంచి, యాక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది. క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది.

ఇవే కాకుండా ఇందులో ఉండే ఔషధగుణాలు మెటబాలిక్ రేటు పెంచి ఎక్స్ ట్రా కిలోల బరువు తగ్గిస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ మరియు హార్ట్ డిసీజ్ రిస్క్ తగ్గిస్తుంది..

అల్లం ప్రయోజనాలు :

అల్లం ప్రయోజనాలు :

పురాతన కాలం నుండి అల్లంను వంటలకే కాదు, ముఖ్యమైన ఔషధంగా ఆయుర్వేద మెడిసిన్ గా ఉపయోగిస్తున్నారు. అల్లంలో ఉండే న్యూట్రీషియన్స్ జీర్ణ శక్తిని పెంచుతుంది. వికారం తగ్గిస్తుంది. ఫ్లూ మరియు ఫీవర్ తగ్గిస్తుంది,కండరాల నొప్పి తగ్గిస్తుంది. వ్యాధులను నివారిస్తుంది.

ఇంకా అల్లంలో యాంటీఇన్ఫ్లమేటీర గుణాలున్నాయి. ఇది ఓస్టియో ఆర్థ్రైటిస్ ను తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ మరియు కొలెస్ట్రాల్ ను హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.

ముఖ్యంగా అల్లం మహిళకు ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుంది. మెనుష్ట్రువ్ క్రాంప్స్ తగ్గిస్తుంది. రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో అల్లంలో యాంటీ క్యాన్సర్ గుణాలున్నట్లు కనుగొన్నారు. ఇది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ నివారిస్తుంది. చివరగా బ్రెయిన్ ఫంక్షన్ ను క్రమబద్దం చేస్తుంది. మతిమరుపు తగ్గిస్తుంది.

ఇవన్నీ కాకుండా అల్లం ఫ్యాట్ బర్న్ చేయడం లో గొప్పగా సహాయపడుతుంది. బెల్లీ చుట్టూ ఉన్న ఫ్యాట్ ను బర్న్ చేయడానికి సహాయపడుతుంది.

రక్తప్రసరణ మెరుగుపరచడానికి ధమనులను విస్తరింపచేస్తుంది. శరీరంలో బాడీ హీట్ ను పెంచి 20 పర్సెంట్ ఫ్యాట్ ను కరిగిస్తుంది. అలాగే శరీరంను డిటాక్స్ ఫై చేస్తుంది. రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది.

ఇప్పుడు బరువు తగ్గడానికి జీలకర్ర, అల్లం ఎలా ఉపయోగించాల తెలుసుకుందాం:

ఇప్పుడు బరువు తగ్గడానికి జీలకర్ర, అల్లం ఎలా ఉపయోగించాల తెలుసుకుందాం:

జీలకర్ర లో ఉండే ఔషధగుణాలు, బాడీ ఫ్యాట్ ను తగ్గించాలంటే అల్లంతో చేర్చితే మరింత ఎఫెక్టివ్ గా బరువు తగ్గిస్తుంది.

• కావల్సిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ జీలకర్ర

1-2 ఇన్చ్ అల్లం

500 ఎం ఎల్ వాటర్

• తయారుచేసే పద్ధతి:

1. అరలీటర్ నీళ్ళలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి రాత్రంతా నీటిలో నానబెట్టాలి.

2. తర్వాతి రోజు ఉదయం జీలకర్రతో పాటు, నీళ్ళు కూడా స్టౌ మీద పెట్టి ఉడికించాలి. జీలకర్ర ఉడికే సమయంలో ఒక అంగుళం అల్లం కూడా బాగా మెత్తగా దంచి మరిగే నీటిలో వేయాలి. జీలకర్ర, అల్లం మిశ్రమాన్ని నీళ్ళలో బాగా ఉడకనివ్వాలి.

4. బాగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, ఈ డికాషన్ చల్లారనివ్వాలి.

5. ఇప్పుడు, ఒక గ్లాసులోనికి ఈ వాటర్ ను వడగట్టుకుని, ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగాలి.

ఈ డికాషన్ ను పది రోజుల పాటు కంటిన్యుగా తాగితే తప్పనిసరిగా బెల్లీ ఫ్యాట్ ఇట్లే కరిగిపోతుంది.

మరో పద్దతి కూడా ఉంది, డిన్నర్ చేసే సమయంలో అల్లం, జీలకర్ర రెండూ కలిపి తీసుకోవడచ్చు. అందుకు మీరు చేయాల్సిందల్లా..

1-2 అంగుళం అల్లం

2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం తీసుకోవాలి

1 టీస్పూన్ జీలకర్ర పౌడర్

క్యారెట్, బీన్స్, పచ్చిబఠానీలు వంటివి మీకు నచ్చిన వాటిని తీసుకోవాలి.

హెల్తీ డిన్నర్ లో ఈ వెజిటేబుల్స్ అన్ని బాయిల్ చేసి, నీరు వడగట్టి, ఉడికించిన వెజిటేబుల్స్ మీద జీలకర్ర పొడి, నిమ్మరసం, అల్లం చిలకరించి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. దీన్ని డిన్నర్లో తీసుకుంటే వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది

కాబట్టి, అల్లం, జీలకర్రను ఉపయోగించి ఈ రెండు పద్దతులను కూడా క్రమం తప్పకుండా అనుసరిస్తే మీరు అనుకున్న వెయిట్ లాస్ లక్ష్యాన్ని చేరుకుంటారు, మంచి బాడీ షేప్ తో కనబడుతారు.

English summary

Natural Drink To Lose Weight

Both cumin and jeera have individual properties that aid in reducing subsequent body fat. But when combined, they can accelerate the weight loss program by manifold. This article explains about two of the best recipes using cumin and ginger that aid in quick weight loss.