వేసవిలో శరీరాన్ని ఆహ్లాదపరిచి, ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే కుకుంబర్ వాటర్ రిసిపి

Posted By:
Subscribe to Boldsky

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో..వాంటర్ కంటెంట్ అధికంగా ఉండే వెజిటేబుల్స్ లో కుకుబర్ ఒకటి. కుకుంబర్ (కీరదోసకాయ) అత్యంత ఆరోగ్యకరమైన వెజిటేబుల్. ముఖ్యంగా వేసవిలో శరీరాన్ని వేడి నుండి ఆహ్లాద పరిచే సమ్మర్ డ్రింక్ కుకుంబర్ స్మూతీ లేదా కుకుంబర్ వాటర్. వేసవిలో ఎండ వేడిమి నుండి శరీరాన్ని కాపాడుతుంది. కడుపుబ్బరాన్ని నివారిస్తుంది. అంతే కాదు కుకుంబర్ వాటర్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. కుకుంబర్ వాటర్ శరీరంను హైడ్రేషన్ లో ఉంచుతుంది. బరువు తగ్గిస్తుంది. శరీరారిన్ని రిలాక్స్ చేస్తుంది. శరీరంను ఎఫెక్టివ్ గా రిజువేట్ చేస్తుంది.

Effective Cucumber Water Recipes For Weight Loss; Check It Out

కుకుంబర్ వాటర్ లో ఇంకా మరెన్నో ప్రయోజనాలు దాగున్నాయి. అయితే బరువు తగ్గించుకోవడం కోసం కుకుంబర్ ను వివిధ రూపాల్లో తీసుకుంటారు. సహజంగా కుకుంబర్ ను సలాడ్స్ రూపంలో తీసుకుంటారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు కుకుంబర్ ను వివిధ రకాల వాటర్ రిసిపిల రూపంలో తీసుకోవడం వల్ల వేసవిలో సేదతీర్చడంతో పాటు, బరువును కూడా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

Effective Cucumber Water Recipes For Weight Loss; Check It Out

అయితే రోజూ ఒకే రూపంలో తినడం, కుకుంబర్ వాటర్ తాగడం బోరు కొడుతుంది కాబట్టి, కుకుంబర్ ను వివిధ రకాలుగా వాటర్ రిసిపిలను తయారుచేసి తీసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం...

వాటర్ మెలోన్-కుకుంబర్ వాటర్ రిసిపి:

వాటర్ మెలోన్-కుకుంబర్ వాటర్ రిసిపి:

1/4కప్పు వాటర్ మెలోన్ (పుచ్చకాయ) ముక్కలు, సగం కీరదోసకాయ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. దీనికి సరిపడా నీళ్ళు మొక్స్ చేసుకుని, అందులో బ్లాక్ పెప్పర్ పౌడర్, లెమన్ జ్యూస్ మిక్స్ చేసి భోజం లేదా డిన్నర్ చేసిన తర్వాత రోజూ తాగాలి. కుకుంబర్ , వాటర్ మెలోన్ ఈ రెండింటిలో వాటర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల శరీరంను చల్లగా..తేమగా ఉంచుతుంది.

 లెమన్ , కుకుంబర్ వాటర్ :

లెమన్ , కుకుంబర్ వాటర్ :

రోజు ప్లెయిన్ కుకుంబర్ వాటర్ తాగడం వల్ల బోర్ అనిపించవచ్చు. అయితే అందులో కొద్దిగా నిమ్మరసం జోడించి తీసుకోవడం మంచిది. 1/2కీరోదసకాయ, ఒక పెద్ద నిమ్మకాయ తీసుకుని, సన్నగా పల్చని స్లైస్ గా కట్ చేసి, ఒక బాటిల్ నీటిలో వేసి ఫ్రిజ్ లో ఉంచాలి. చల్లగా అయిన తర్వాత ఐస్ ముక్కలతో చల్లచల్లగా తాగొచ్చు.

తులసి, కుకుంబర్ వాటర్ :

తులసి, కుకుంబర్ వాటర్ :

కీరదోసకాయ మరియు తులసి కాంబినేషన్ మీ నోటికి కాస్త డిఫెరెంట్ గా అగుపిపంచవచ్చు. అయితే ఈ రెండు కాంబినేషన్ డ్రింక్ తీసుకోవడం వల్ల ఉల్లాసంగా ఫీలవుతారు. ఒక కప్పు షుగర్, మరియు లైమ్ జస్ట్ రెండూ మిక్స్ కొద్దిసేపు వేడి చేయాలి. షుగర్ కరిగిన తర్వాత అందులో కొన్ని తులసి ఆకులను వేసి స్టౌవ్ ఆఫ్ చేయాలి. చల్లారిన తర్వాత ఈ బాసిల్ సిరఫ్ ను జార్ లో నింపాలి. దీన్ని ఫ్రిజ్ లో పెట్టి ఒక గంట ఉంచాలి. ఒక గంట తర్వాత ఐస్ తోపాటు సర్వ్ చేయాలి.

 పుదీనా మరియు కుకుంబర్ వాటర్ :

పుదీనా మరియు కుకుంబర్ వాటర్ :

కుకుంబర్ వాటర్ లో విటమిన్స్ , ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. అదే విధంగా పుదీనాలో మంచి యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైటో న్యూట్రీషియన్స్ అధికంగా ఉండే శరీరానికి వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ టేస్టీ వాటర్ ను తయారుచేసుకోవడానికి కొన్ని కీరదోసకాయ ముక్కలకు 1/4స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ మిక్స్ చేసి, ఒక స్పూన్ తేనె, 10పుదీనా ఆకులు మిక్స్ చేసి, మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత దీన్ని వడగట్టి, వాటర్ తీసుకుని, అందులో కొద్దిగా నిమ్మరసం పిండి, ఫ్రిజ్ లో 15నిముషాలు పెట్టి చల్లచల్లగా తాగొచ్చు.

గ్రేప్ ఫ్రూట్ కుకుంబర్ వాటర్ :

గ్రేప్ ఫ్రూట్ కుకుంబర్ వాటర్ :

గ్రేప్ ఫ్రూట్ మరియు కుకుంబర్ కాంబినేషన్ డ్రింక్ వరల్డ్ హెల్తీయస్ట్ డ్రింక్ . గ్రేప్ ఫ్రూట్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది శరీరానికి వివిధ రకాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. ఈ హెల్తీ డ్రింక్ తయారుచేయడానికి ఫ్రెష్ గా ఉన్న గ్రేప్ జ్యూస్ తీసుకుని జార్ లో పోసి, అందులో కొన్ని కీరదోసకాయ ముక్కలు వేసి గ్రైండ్ చేయాలి. అలాగో సోడా, చల్లటి నీళ్ళు మిక్స్ చేసి గ్రైండ్ చేసి, చల్లగా అందివ్వాలి. అవసరమైతే కొద్దిగా నిమ్మరసం జోడించుకోవచ్చు.

ఆరెంజ్ మరియు కుకుంబర్ :

ఆరెంజ్ మరియు కుకుంబర్ :

ఆరెంజ్ ఒక అద్భుతమైన క్లాసిక్ ఫ్రూట్ జ్యూస్ . ఇది టేస్ట్ బడ్స్ కు అద్భుత రుచిని అందిస్తుంది. రెండు ఆరెంజ్ పండ్లను మిక్సీలో వేసి, కొన్ని కుకుంబర్ ముక్కలు , కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేయాలి. దీనికి చల్లటి నీళ్ళు మిక్స్ చేసి, ఫ్రిజ్ లో పెట్టి చల్లచల్లగా తాగాలి.

English summary

Effective Cucumber Water Recipes For Weight Loss; Check It Out

Effective Cucumber Water Recipes For Weight Loss; Check It Out,Cucumber is one among the healthiest foods to be had, especially when the summer days are around. It is always good to consume a cucumber smoothie or cucumber water rather than getting the stomach bloated with peanut shakes and a chocolate smoothi
Story first published: Monday, February 27, 2017, 13:00 [IST]
Subscribe Newsletter