Just In
- 20 min ago
శరీరంలో ఎలాంటి నొప్పినైనా తగ్గించే సహజ నొప్పి నివారణలు
- 6 hrs ago
సోమవారం మీ రాశిఫలాలు (9-12-2019)
- 22 hrs ago
ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 14 వరకు
- 1 day ago
ఆదివారం మీ రాశిఫలాలు (8-12-2019)
Don't Miss
- News
ఈ నెల 17వరకు ఏపీ అసెంబ్లీ: మొత్తం ఏడు వర్కింగ్ డేస్: బీఏసీలో నిర్ణయం..!
- Finance
విజయవాడవాసులకు శుభవార్త, ఆర్టీసీ డోర్ డెలివరీ సర్వీస్
- Movies
'వెంకీమామ'లో ఆ 40 నిమిషాలు.. హైలైట్ సన్నివేశాలివే!
- Technology
జియోను అదిగమించిన వోడాఫోన్,ఎయిర్టెల్
- Sports
వరుసగా రెండోసారి: ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ టైటిల్ గెలిచిన బ్రిస్బేన్ హీట్
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
హార్మోన్స్ ను బ్యాలెన్స్ చేసి ఎఫెక్టివ్ గా బరువు తగ్గిస్తాయి.
బరువు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసుంటారు. అయితే ఆ బరువుకు ప్రధాన కారణమైన హార్మోన్స్ ను క్రమబద్దం చేయాలన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. బరువు పెరగడానికి ప్రధానకారణం ఆహారపు అలవాట్లు, నిద్ర, వ్యాయామలోపం, జీవనశైలి ఇవన్నీ ఇంటర్నల్ గా శరీరంలోపల సిస్టమ్ మీద , హార్మోనుల మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి, హార్మోన్స్ పనిపట్టాలి. హార్మోన్స్ ను క్రమబద్దం చేయాలంటే అందుకు తగ్గ సూపర్ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఈ సూపర్ ఫుడ్స్ హార్మోన్స్ మీద పనిచేయడం మాత్రమే కాదు, ఫ్యాట్ కరిగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
హార్మోన్స్ ముఖ్యంగా శరీరం, మైండ్ చేసేపనులు కంట్రోల్ తప్పకుండా సహాయపడుతాయి. శరీరాన్ని, మైండ్ ను కంట్రోల్ చేసే కెమికల్స్ ను శరీరం మైండ్ ఏం చేయాలనే విషయాన్ని సూచిస్తుంటాయి.
ఉదాహరణకు, థైరాయిడ్ హార్మోన్స్ శరీరంలో మెటబాలిజం ఎలా ఉండాలన్న విషయాన్ని శరీరానికి తెలుపుతుంది. ఈ హార్మోన్స్ కనుక బ్యాలెన్స్ తప్పితే, అప్పుడు శరీరం కూడా బ్యాలెన్స్ తప్పుతుంది.థైరాయిడ్ హార్మోన్స్ సరిపడా ఉత్పత్తి కాలేదంటే, బరువు పెరుగుతారు. ఇంకా ఎప్పుడూ అలసటగా ఫీలవుతారు. కాబట్టి, హార్మోన్ ఎల్లప్పుడు సమత్యులంగా ఉండాలంటే, సరైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.తినే ఆహారాల్లోన్యూట్రీషీయన్స్, ప్రోటీన్స్ అధికంగా ఉండా హెల్తీ హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడాలి
ఈ క్రింది సూచించిన ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోగలిగితే, ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్స్ ను ఉత్పత్తి చేసుకోవచ్చు.మరి ఆ ఎఫెక్టివ్ ఫ్యాట్ బర్న్ హార్మోనల్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం..

రెడ్ వైన్ :
రెడ్ వైన్ లో రెస్వరేట్రోల్ అధికంగా ఉంది. ఇవి హైలీ యాంటీఇన్ఫ్లమేటరీ ఫాలీఫినాల్ గుణాలు ఎక్కువ. ఇవి హెల్తీ హార్మోన్ ప్రొడక్షన్ ను ప్రోత్సహిస్తుంది.

ఫ్లాక్స్ సీడ్స్ :
ఫ్లాక్ సీడ్స్ లిగనెన్స్ కలిగి ఉంటాయి. ఇవి ఫైటోఈస్ట్రోజెన్స్ కలిగి ఉండి, ఈస్ట్రోజెన్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తాయి. ఇవి బ్రెస్ట్ మరియు ప్రొస్టేట్ క్యాన్సర్ ను నివారిస్తాయి. అలాగే ఫ్యాట్ ను కూడా బర్న్ చేస్తాయి.

గుమ్మడి విత్తనాలు:
గుమ్మడి విత్తనాల్లో జింక్ అధికంగా ఉంటుంది ఇది పురుషుల్లో ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఫ్యాట్ బర్నంగ్ హార్మోన్ ఫుడ్స్ లో టాప్ ఫుడ్స్ లో ఇది ఒకటి.

మిక్స్డ్ మీల్స్ :
బ్యాలెన్స్డ్ మీల్స్ మరియు స్నాక్స్ తినడం వల్ల , భావోద్రేకాలను సంబందించిన హార్మోన్స్ ను క్రమబద్దం చేస్తుంది. అందుకు కారణమయ్యే కార్టిసోలను ఉత్పత్తిని తగ్గిస్తుంది.

ష్రింప్:
విటమిన్ డి లోపం , ఇది నేరుగా హార్మోనుల అసమతుల్యం మీద ప్రభావం చూపుతుంది. షింప్ ఇది సీఫుడ్ , విటమన్ డి లెవల్స్ ను పెంచడానికి సహాయపడుతుంది. దాంతో శరీరంలో హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి.

హల్తీ ఫ్యాట్స్ :
హెల్తీ అండ్ ఎసెన్షియల్ ఫ్యాట్స్ ను ఆలివ్ ఆయిల్లో కనుగొనడం జరిగింది, ఇంకా గుడ్డు పచ్చసొన, అవొకాడో, నట్స్, సీడ్స్, ఫ్యాటీ ఫిష్ సాల్మన్ లో కనుగొనడం జరిగింది, ఇది శరీరంలో హార్మోనల్ ఫంక్షన్స్ ను ప్రోత్సహిస్తుంది. ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ లో ఇది ఒక టాప్ ఫుడ్ .

యాపిల్ సైడర్ వెనిగర్ :
యాపిల్ సైడర్ వెనిగర్ ఆహారాల్లో ఉండే ప్రోటీన్స్ ను అమినోయాసిడ్స్ గా మార్చుతుంది. అమినో యాసిడ్ శరీరంలో వివిధ రకాలుగా సహాయపడుతుంది.ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్స్ ను ఉత్పత్తిలో, ఫ్యాట్ కణాలు విచ్ఛిన్నం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఫ్యాట్ ను ఫాస్ట్ గా కరిగించడానికి ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

దాల్చిన చెక్క :
ఇందులో సినామల్ డీహైడ్ ఉంటుంది.ఇది శరీరంలో హార్మోన్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. హార్మోన్స్ సెక్రికేషన్ కు సహాయపడుతుంది. ఫ్యాట్ బర్న్ చేస్తుంది. టెస్టోస్టెరోన్స్ వంటి (మహిళల్లో బరువు పెరగడానికి కారణమయ్యే హార్మోన్)ఉత్పత్తిని తగ్గిస్తుంది